రూ.39 లక్షల విత్డ్రాయల్స్ మోసాలు | Data breach: 73 SBI cardholders reported fraud withdrawals | Sakshi
Sakshi News home page

రూ.39 లక్షల విత్డ్రాయల్స్ మోసాలు

Published Wed, Nov 23 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

రూ.39 లక్షల విత్డ్రాయల్స్ మోసాలు

రూ.39 లక్షల విత్డ్రాయల్స్ మోసాలు

73 మంది ఎస్‌బీఐ కస్టమర్ల ఫిర్యాదు
రాజ్యసభకు వెల్లడించిన
ఆర్థిక శాఖ సహాయ మంత్రి

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్  ఆఫ్ ఇండియా 6 లక్షల కార్డులను స్తంభింపజేసిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్ 4 వరకూ, తమ ఖాతాల నుంచి మోసపూరితంగా సొమ్ములు విత్‌డ్రా అయ్యాయని 73 మంది ఎస్‌బీఐ ఖాతాదారులు ఫిర్యాదు చేశారని రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో సంతోశ్ కుమార్ వెల్లడించారు. ఈ మోసపూరిత విత్‌డ్రాయల్స్ విలువ రూ.39 లక్షలని  పేర్కొన్నారు. తమ డెబిట్ కార్డులు సురక్షితమేనని ఎస్‌బీఐ తెలిపిందని ఆయన వివరించారు.

డేటా మోసాల కారణంగా లక్షలాది డెబిట్/ క్రెడిట్ కార్డులు ప్రభావితమయ్యాయని, ఖాతాదారులు తమ పిన్‌నంబర్లను మార్చుకోవాలని ఎస్‌బీఐతో సహా పలు బ్యాంకులు ఖాతాదారులకు ఆర్‌బీఐ సూచించిన విషయం తెలిసిందే. ఈ కార్డులకు సంబంధించిన డేటా మోసాల విషయమై ఆర్‌బీఐ దర్యాప్తు చేస్తోందని సంతోశ్ కుమార్ పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement