withdrawing
-
ఎస్బీఐ ఏటీఎంకు మొబైల్ తీసుకెళ్లండి!
ఎస్బీఐ ఏటీఎంలలో రూ.10వేలు, అంతకు మించి చేసే డెబిట్ కార్డు నగదు ఉపసంహరణలకు ఓటీపీ నమోదు చేయడం అన్నది ఇకపై 24 గంటల పాటు అమల్లోకి రానుంది. ప్రస్తుతానికి రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య ఎస్బీఐ ఏటీఎంల్లో రూ.10వేలకు మించి చేసే ఉపసంహరణలకు కస్టమర్ల మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఇవ్వడం తప్పనిసరిగా అమల్లో ఉంది. రాత్రి వేళల్లో మోసాలకు తావు లేకుండా ఉండే ఉద్దేశ్యంతో ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని ఎస్బీఐ తీసుకొచ్చింది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో ఈ నెల 18 నుంచి రోజులో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) రూ.10వేలు అంతకుమించి చేసే నగదు ఉపసంహరణలకు పిన్ నంబర్‌తోపాటు ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుందని ఎస్బీఐ ప్రకటించింది. ఎస్బీఐ కార్డుదారులకు ఉచితంగా క్రెడిట్ స్కోరు! న్యూఢిల్లీ: ఎస్బీఐ క్రెడిట్ కార్డు దారులకు క్రెడిట్ స్కోరు తెలుసుకునే సదుపాయం కల్పించనున్నామని సంస్థ ఎండీ, సీఈవో అశ్విని కుమార్ తివారీ తెలిపారు. ‘‘అమెరికాలో మాదిరిగా రెండు మూడు అంశాలను ఇక్కడ ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. క్రెడిట్‌కార్డు దారులకు వారి ఖాతా నుంచి క్రెడిట్ స్కోరు తెలుసుకునే సదుపాయం ఇందులో ఒకటి. అకౌంట్లో లాగిన్ అయినప్పుడు తమ క్రెడిట్ స్కోరు ఎంతో ఎటువంటి ఖర్చు లేకుండా తెలుసుకోవచ్చు. అమెరికాలో ఇది సర్వ సాధారణం. దీని ద్వారా అన్ని సమయాల్లోనూ తమ క్రెడిట్ స్కోరు ఏ విధంగా మార్పులు చెందుతుందో తెలుసుకోవచ్చు. కస్టమర్ అనుకూలమైన ఈ చర్యను వెంటనే అమలు చేయాల్సి ఉంది. దీనిపై మా బృందంతో చర్చించాను’’ అని వివరించారు. ‘‘ రిటైలర్ స్థాయిలో ఈ విధమైన స్కీమ్‌పై పని చేయాలనకుంటున్నాము. ఇప్పటికే ఎస్బీఐ కార్డ్ కో బ్రాండెడ్ విభాగంలో 14 ఒప్పందాలను కలిగి ఉంది. మరింత పెంచాలనుకుంటున్నాము. కస్టమర్ల సేవల విస్తృతిపై దృష్టి సారించాము’’ అని తివారీ తెలిపారు. -
రూ.39 లక్షల విత్‌డ్రాయల్స్ మోసాలు
• 73 మంది ఎస్బీఐ కస్టమర్ల ఫిర్యాదు • రాజ్యసభకు వెల్లడించిన • ఆర్థిక శాఖ సహాయ మంత్రి న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 లక్షల కార్డులను స్తంభింపజేసిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్ 4 వరకూ, తమ ఖాతాల నుంచి మోసపూరితంగా సొమ్ములు విత్‌డ్రా అయ్యాయని 73 మంది ఎస్బీఐ ఖాతాదారులు ఫిర్యాదు చేశారని రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో సంతోశ్ కుమార్ వెల్లడించారు. ఈ మోసపూరిత విత్‌డ్రాయల్స్ విలువ రూ.39 లక్షలని పేర్కొన్నారు. తమ డెబిట్ కార్డులు సురక్షితమేనని ఎస్బీఐ తెలిపిందని ఆయన వివరించారు. డేటా మోసాల కారణంగా లక్షలాది డెబిట్/ క్రెడిట్ కార్డులు ప్రభావితమయ్యాయని, ఖాతాదారులు తమ పిన్నంబర్లను మార్చుకోవాలని ఎస్బీఐతో సహా పలు బ్యాంకులు ఖాతాదారులకు ఆర్బీఐ సూచించిన విషయం తెలిసిందే. ఈ కార్డులకు సంబంధించిన డేటా మోసాల విషయమై ఆర్బీఐ దర్యాప్తు చేస్తోందని సంతోశ్ కుమార్ పేర్కొన్నారు. -
చిల్లరే దేవుడు...
పెద్దనోట్లు రద్దయ్యాయి. ఐదు వందలు, వెయ్యి నోట్లు తమ అవతారాన్ని చాలించి ఆర్.బి.ఐ అను తమ ధనమాత పొరలను చీల్చుకుని విలీనమయ్యే దృశ్యాలు దేశమంతా కనిపిస్తు న్నాయి. వంద వద్దు, యాభై వద్దు, ఇరవైలా వద్దే వద్దు అని ఐదు వందలు, వెయ్యి మాత్రమే ఇళ్లలో దాచుకునే ప్రజలు ఇప్పుడు ‘చిల్లర నోట్లకు మొక్కుదమయ్యా... దోవ చూపరా గురుడా’ అని పాడుకుంటూ ఆ ఏటిఎం, ఈ ఏటిఎం చుట్టూ తిరుగుతున్నారు. ఏమైనా పాత పద్ధతులే మెరుగైనవని ఆ రోజులు తలుచుకుని బాధ పడుతున్నారు. పూర్వం పెద్దిళ్లల్లో ఇనప్పెట్టెలు ఉండేవి. చిన్న ఇళ్లలో హుండీలు ఉండేవి. ఇంటి పెద్ద ఇంటి పిల్లలకు అలవాటు చేయడానికి తలా ఒక హుండీ ఇచ్చి, చిల్లర డబ్బులు దాచుకోమని చెప్పేవాడు. పిల్లలు కూడా కొత్త బట్టలకు, పుస్తకాలకు, ఆట వస్తువులకు, బంధువుల ఊళ్లకు వెళ్లడానికి సంవత్సరమంతా నాణేలు సేకరిస్తూ ఉండేవాళ్లు. ఆడవాళ్లు దేవుళ్లకు తీర్థయాత్రలకు ముడుపు కట్టి, ఇత్తడి చెంబులకు వాసం కట్టి తోచిన చిల్లరంతా దానిలో వేస్తూ ఆ సమయానికి తీసి ఉపయోగించేవారు. బంధువులు ఇళ్లకొస్తే ఇప్పటిలా బర్గర్లు తెచ్చిపెట్టకుండా, పిల్లలకు చిల్లర కానుకగా ఇచ్చేవారు. ముఖ్యంగా రోజువారీ లావాదేవీల్లో కొత్త నాణేలు, కొత్త నోట్లు కనిపిస్తే పొరపాటున కూడా ఖర్చు పెట్టకుండా వాటిని అపురూపంగా దాచుకునే అలవాటు మధ్యతరగతి ఇళ్లల్లో ఉండేది. ముసలాళ్ల కొంగులో ఏ క్షణాన్నయినా ఒకటి రెండు కాసులు మూట గట్టి ఉండేవి. ఇప్పుడు అవన్నీ బాగా తగ్గాయి. అందువల్ల పెద్ద నోట్లు రద్దు కాగానే అందరూ తెల్లముఖాలు వేయాల్సి వచ్చింది. ఇంట్లో చిల్లర ఉండే సంస్కృతి ఉండి ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా అని కుయ్యోమంటున్నవాళ్లు ఉన్నారు. బ్యాంకులో విత్‌డ్రాయల్‌కు వెళ్లినప్పుడు, వేలు అడిగి తెచ్చుకున్నవాళ్లు బాధ పడుతున్నారు. -
మ్యూచువల్ ఫండ్ స్టాక్ విక్రయాలు @ 8,058 కోట్లు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు గత నెలలో నికరంగా రూ.8,058 కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. 2014, మే తర్వాత మ్యూచువల్ ఫండ్ సంస్థలు స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ఇదే మొదటిసారని వెల్త్‌ఫోర్స్‌డాట్‌కామ్ వ్యవస్థాపకులు సిద్ధాంత్ జైన్ తెలిపారు. ఈ ఏడాది మార్చిలో స్టాక్ మార్కెట్ నుంచి మ్యూచువల్ ఫండ్ సంస్థలు భారీగా నిధులను వెనక్కి తీసుకున్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో మొత్తం రూ.68,000 కోట్ల నికర పెట్టుబడులు పెట్టాయి. ఈ నెలలో జోరుగానే... కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కారణంగా పలువురు రిటైల్ ఇన్వెస్టర్లు సిప్(సిస్టమాటిక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లు ప్రారంభిస్తారని, మ్యూచువల్ ఫండ్స్‌లో భారీగా నిధులు వస్తాయని, మ్యూచువల్ ఫండ్స్ ఈ నిధులను స్మాక్మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయని సిద్ధాంత్ జైన్ వివరించారు. ఇక గత నెలలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు నికరంగా రూ.8,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి రెండు కారణాలున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం పూర్తయినందున నగదు అవసరాలు, పుస్తకాల్లో సర్దుబాటు నిమిత్తం చాలా బ్యాంకులు, కంపెనీలు మ్యూచువల్ ఫండ్ల నుంచి నిధులను వెనక్కితీసుకోవడం మొదటి కారణమని వివరించారు.వ్యవస్థాగత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం మ్యూచువల్ ఫండ్ పొజిషన్ల నుంచి నిష్ర్కమించడం రెండో కారణమని పేర్కొన్నారు. కాగా స్టాక్ మార్కెట్ నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు రూ.14,000 కోట్ల నికర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. -
గన్మెన్లను వెనక్కి పంపిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, విజయవాడ(రామవరప్పాడు): కృష్ణా జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ శివారు రామవరప్పాడులో ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులు నిమిత్తం రైవస్ కాల్వకట్టపై ఇళ్లు తొలగించాలంటూ రెవెన్యూ అధికారులు ఆదివారం ఉదయం స్థానికులకు నోటీసులు జారీ చేయడానికి వెళ్లారు. సమాచారం అందుకున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడికి చేరుకొన్నారు. అధికారులు, గ్రామ పెద్దలతో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా కొందరు స్థానికులు విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూలుస్తున్న ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ నినదించారు. ఎమ్మెల్యే వంశీ ఈ రాస్తారోకోలో పాల్గొనకుండా అధికారులతో చర్చలు కొనసాగించారు. ఆయన నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే, ఎమ్మెల్యే వంశీపై పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, ప్రజలను రెచ్చగొట్టారని, జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి వాహనదారులకు ఇబ్బంది కలిగించారనే అభియోగాలతో వివిధ సెక్షన్ల కింద ఎమ్మెల్యేతోపాటు 200 మందిపై కేసు నమోదు చేశారు. పోలీసుల చర్యకు నిరసనగా ఎమ్మెల్యే వంశీ తనకు ప్రభుత్వం కేటాయించిన ఇద్దరు గన్మెన్లను వెనక్కి పంపారు.