భద్రాద్రి రామయ్య పెళ్లికి రండి | CM KCR Governor Tamilisai Soundararajan Invited For Lord Rama Celestial Wedding | Sakshi
Sakshi News home page

భద్రాద్రి రామయ్య పెళ్లికి రండి

Published Sun, Apr 3 2022 1:52 AM | Last Updated on Sun, Apr 3 2022 8:55 AM

CM KCR Governor Tamilisai Soundararajan Invited For Lord Rama Celestial Wedding - Sakshi

కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందచేస్తున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, దేవస్థాన బృందం

భద్రాచలం: భద్రాచలంలో ఈనెల 10, 11వ తేదీల్లో జరిగే సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు హాజరు కావాలని దేవస్థానం అధికారులు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావులను ఆహ్వానించారు. శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను ఈవో శివాజీ ఆధ్వర్యంలో వేదపండితులు శాలువాతో సత్కరించి ఆహ్వానపత్రాన్ని అందించారు.

అలాగే, ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు రామయ్య వివాహా ఆహ్వానపత్రిక అందచేసి వేదాశీర్వచనం అందజేశారు. స్థానాచార్యులు స్థలశాయి, ఉప ప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అర్చకులు మురళీ కృష్ణమాచార్యులు పాల్గొన్నారు.


గవర్నర్‌కు కల్యాణోత్సవ ఆహ్వాన పత్రిక అందజేస్తున్న ఆలయ అధికారులు, అర్చకులు 

సీఎం కేసీఆర్‌కు యాదాద్రీశుడి ఆశీస్సులు
యాదగిరిగుట్ట: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌కు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులను ఆలయ ఆర్చకులు అందజేశారు. శనివారం ఉదయంప్రగతిభవన్‌లో యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి ఆధ్వర్యంలో ప్రధానార్చకులు నల్లంథీఘల్‌ లక్ష్మీనరసింహచార్యులు, వేద పండితుడు శ్రీనివాస్‌శర్మ వెళ్లి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానాలయం ఉద్ఘాటన తరువాత భక్తుల రాక ఎలా ఉందనే అంశాన్ని కేసీఆర్‌ ఈవో గీతారెడ్డితో చర్చించినట్లు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement