సమావేశంలో మాట్లాడుతున్న ఎర్రబెల్లి. చిత్రంలో ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘మేడారం మహా జాతరకు నెల సమయం కూడా లేదు.. ఎన్ని సార్లు సమీక్షలు చేసినా మీ తీరు మారడం లేదు.. రోడ్లు, భవనాలు, జాతీయ రహదారులు, ఆర్‌డబ్ల్యూఎస్ పనుల తీరు చూస్తే జాతర మొదలయ్యే వరకు పూర్తి అవుతాయన్న నమ్మకం లేదు’ అని సంబంధిత అధికారులపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు ఇన్‌చార్జి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధ్యక్షతన మేడారం హరిత హోటల్‌లో జాతర పనులు, ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జాతర మొదలయ్యే వరకు పను లు పూర్తయ్యేలా లేవని ఫైర్ అయ్యారు. ఆయా పనుల్లో లోపాలను ఎత్తి చూపారు. మహబూబాబాద్, నర్సంపేట మధ్య రోడ్డు పనుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. దీంతో నేషనల్ హైవేస్ అథారిటీ పీవో శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణలపై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గాలిమాటలు చెప్పకు.. పనుల్లో వేగం పెరగకపోతే ఇంటికి పోతరు’ అని మందలించారు. ఈ నెల 26లోగా అన్ని పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రులు మేడారం అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment