మాట్లాడుతున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్‌రూరల్ : పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌రూరల్ మండలంలోని రత్నాపూర్‌క్లాండీ గ్రామంలో గురువారం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు చేపడుతోందన్నారు. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల ద్వారా ఏప్రిల్ నుంచి రూ.లక్షా 116 అందిస్తోందన్నారు.
కస్తూరిబా పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు, మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకునే వారికి కేసీఆర్ కిట్, 75శాతం సబ్సిడీపై యాదవులకు గొర్రెలు పంపిణీ చేస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగాశకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రామేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ సభ్యుడు హరీశ్‌రావు, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యుడు మహేశ్‌రెడ్డి, నాయకులు ముత్యంరెడ్డి, అల్లోల మురళీధర్‌రెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment