
హరితహారంపై అటవీశాఖ అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమా న్ని ప్రహసనంలా కాకుండా ఓ బాధ్యతలా, ఓ యజ్ఞంలా భావించి పట్టుదల, కార్యదీక్షతతో పనిచేయాలని అధికారులకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. బుధ వారం అరణ్యభవన్‌లో త్వరలో ప్రారంభించనున్న ఐదో విడత హరితహారం కార్యక్రమంపై అటవీ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్–విజయవాడ జాతీ య రహదారి మాదిరిగానే నాగార్జున సాగర్, శ్రీశైలం రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు.
హరితహారంలో కలెక్టర్ మొదలుకొని అధికారులు, సిబ్బంది, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సైతం తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పారు. అన్ని జిల్లాల్లో పర్యటించి, హరితహారం అమలు తీరును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని మంత్రి తెలిపారు. అటవీ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి అక్కడ ఏ మేరకు మొక్కలు నాటవచ్చునో గుర్తించి, ఆ విషయాలను గ్రామ సర్పం చ్, వార్డ్ మెంబర్లు, కార్యదర్శికి తగు సూచ నలు ఇవ్వాలన్నారు. హరితహారంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పీకే ఝా పాల్గొన్నారు.