Environment Minister
-
ఢిల్లీలో మళ్లీ సరి–బేసి విధానం
న్యూఢిల్లీ: ప్రజారోగ్యానికి గొడ్డలిపెట్టులా మారిన కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో మళ్లీ సరి–బేసి విధానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకూ సరి–బేసి విధానం అమలు చేయనున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం ప్రకటించారు. నవంబర్ 20 తర్వాత ఈ విధానాన్ని పొడిగించే అంశంపై అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వాయు నాణ్యత తగ్గిపోవడం, కాలుష్యం వల్ల చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే 8వ తరగతి వరకూ ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించాలని సూచించారు. బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే పది, పన్నెండో తరగతి విద్యార్థులకు మినహాయింపు ఉంటుందన్నారు. -
ఢిల్లీకి ‘గాలాడటం’ లేదు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు నాణ్యత ఈ సీజన్లో మొదటిసారిగా ఆదివారం ‘వెరీ పూర్’ స్థాయికి పడిపోయింది. శనివారం 248గా ఉన్న సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 24 గంటల వ్యవధిలో 313కు పడిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణ మని అధికారులు చెబుతున్నారు. దాంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ సోమవారం సంబంధిత శాఖలతో సమీక్ష జరపనున్నారు. ప్రైవేటు వాహనాల రాకపోకలను వీలైనంతగా తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయతి్నస్తోంది. ఇందులో భాగంగా పార్కింగ్ ఫీజులు పెంచడం వంటి చర్యలు చేపట్టింది. హోటళ్లలో తందూరీ పొయ్యిలపై నిషేధం విధించింది. సీఎన్జీ, ఎలక్రి్టక్ బస్సుల వినియోగాన్ని, మెట్రో రైలు సరీ్వసుల సంఖ్యను పెంచాలని కోరింది. ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలోపలున్న కాలుష్య కారఖ పారిశ్రామిక యూనిట్లు, ధర్మల్ విద్యుత్ ప్లాంట్లను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిర్మాణాలు జరుగుతున్న, కూలి్చవేత ప్రాజెక్టులు చేపట్టిన చోట్ల దుమ్ము రేగకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
‘మీ ఫ్యామిలీని కాల్చిపడేస్తా.. బీజేపీ మంత్రి బెదిరింపులు’
ఆయనో మంత్రి.. పేదలకు సాయం చేయాల్సిందిపోయి వారినే బెదిరించాడు. తాను చెప్పింది వినకుండా ఎక్కువగా మాట్లాడితే మీ కుటుంబాన్ని మొత్తం కాల్చిపడేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హోస్పెట్‌లో భూవివాదానికి సంబంధించి ఎస్సీ వర్గానికి చెందిన ఓ కుటుంబాన్ని కర్నాటక పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆనంద్ సింగ్ బెదిరించారు. కాగా, మంత్రి మంగళవారం హోస్పెట్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఎస్సీ వర్గానికి చెందిన పోలప్ప అనే వ్యక్తి.. భూవివాదంలో మరో వర్గానికి చెందిన వారు తమను ఇబ్బంది పెడుతున్నారని మంత్రిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఆనంద్ సింగ్.. తాము చెప్పింది చేయాలని పోలప్పను బెదిరించారు. లేకపోతే కుటుంబం మొత్తాన్ని కాల్చిపడేస్తానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆవేదనకు గురైన పోలప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు మంత్రి ఆనంద్ సింగ్‌తో పాటుగా మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, ఐపిసి సెక్షన్ 504, 506 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే, ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో, వారిని అడ్డుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసినందుకు గానూ పోలప్ప ఫ్యామిలీపై కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. The members of the family threatened by #Karnataka Tourism, Ecology and Environment Minister Anand Singh, later attempted to immolate themselves.https://t.co/kGLeJmzu06 — News9 (@News9Tweets) August 31, 2022 -
ఏపీకి కంపా నిధులు
సాక్షి, ఢిల్లీ : ఏపీలో అటవీ అభివృద్ధి కోసం కేంద్రం రూ.1734 కోట్లను విడుదల చేసిందని ఏపీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఢిల్లీలోని పర్యావరణ భవన్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆధ్వర్యంలో రాష్ట్రాల పర్యావరణ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ నుంచి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సమావేశానంతరం బాలినేని మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుంకుంటామన్నారు. ఎర్ర చందనం అమ్మకానికి అనుమతి ఇవ్వాలని కోరగా ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారని వెల్లడించారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారనీ, అమ్మకాలకు అనుమతినిస్తే స్మగ్లింగ్‌ను నివారించవచ్చని మంత్రి తెలిపారు. -
హరితహారాన్ని యజ్ఞంలా నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమా న్ని ప్రహసనంలా కాకుండా ఓ బాధ్యతలా, ఓ యజ్ఞంలా భావించి పట్టుదల, కార్యదీక్షతతో పనిచేయాలని అధికారులకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. బుధ వారం అరణ్యభవన్‌లో త్వరలో ప్రారంభించనున్న ఐదో విడత హరితహారం కార్యక్రమంపై అటవీ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్–విజయవాడ జాతీ య రహదారి మాదిరిగానే నాగార్జున సాగర్, శ్రీశైలం రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు. హరితహారంలో కలెక్టర్ మొదలుకొని అధికారులు, సిబ్బంది, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సైతం తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పారు. అన్ని జిల్లాల్లో పర్యటించి, హరితహారం అమలు తీరును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని మంత్రి తెలిపారు. అటవీ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి అక్కడ ఏ మేరకు మొక్కలు నాటవచ్చునో గుర్తించి, ఆ విషయాలను గ్రామ సర్పం చ్, వార్డ్ మెంబర్లు, కార్యదర్శికి తగు సూచ నలు ఇవ్వాలన్నారు. హరితహారంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పీకే ఝా పాల్గొన్నారు. -
పర్యావరణశాఖ మంత్రిగా జవదేకర్ బాధ్యతలు
-
కాళేశ్వరం అనుమతులకు ధన్యవాదాలు
- పర్యావరణ మంత్రి భేటీలో సీఎం కేసీఆర్ - హరితహారానికి రావాల్సిందిగా ఆహ్వానం సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశకు అనుమతులిచ్చిన నేపథ్యంలో కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్‌కు సీఎం కె.చంద్రశేఖర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కేంద్రమంత్రి బండారు దత్తా త్రేయ, ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.వేణుగోపాలాచారి తదితరులతో కలసి పర్యావరణ మంత్రితో భేటీ అయ్యారు. దత్తాత్రేయ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతులకు మేలు జరుగు తుందని, దీనికి సహకరించినందుకు కేంద్రా నికి ధన్యవాదాలు తెలిపినట్లు వివరించారు. తెలంగాణలో భారీ ఎత్తున నిర్మిస్తున్న పవర్ ప్లాంటుకు అనుమతులు దక్కడం గొప్ప విశేషమని వివరించారు. రాబోయే రోజుల్లో కాంపా నిధులు విడుదల కావాల్సి ఉందని, దీనికి సంబంధించి నిబంధనల రూపకల్పన అనంతరం విడుదల అవుతాయని పర్యావ రణ మంత్రి తెలిపినట్లు వివరించారు. భేటీ వివరాలను వేణుగోపాలాచారి మీడియాకు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమ తులు ఇచ్చినందుకు కేసీఆర్ కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. జూలైలో హరిత హారం ప్రారంభానికి రాష్ట్రానికి రావా లని హర్షవర్ధన్‌ను ఆహ్వానించినట్లు తెలిపా రు. ‘రాష్ట్రానికి బకాయి ఉన్న కాంపా నిధు లను విడుదల చేయాలని సీఎం కోరారు. కొత్త రాష్ట్రంలో నీటిపారుదల రంగం అభివృ ద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయా లను కేంద్రమంత్రికి వివరించారు. దేశంలోనే నీటిపారుదల రంగానికి రూ.25 వేల కోట్ల మేర బడ్జెట్‌ను కేటాయించినట్లు వివరిం చారు’ అని వేణుగోపాలాచారి వెల్లడించారు. -
బట్టతలపై నీళ్లు పోసి మంత్రి ప్రయోగం!
ప్రజలకు సందేశం ఇవ్వడంలో, తమ మనస్సులోని మాటను ప్రజలకు చేర్చడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు నాయకులు పొడవాటి ఉపన్యాసాలు ఇస్తే.. మరికొందరు కళ్లకు కట్టినట్టు ’డెమో’ చూపించి.. తమ చెప్పాలనుకున్నదేదో సూటిగా, మనస్సులో నాటుకుపోయేలా చెప్తారు. మధ్యప్రదేశ్ పర్యావరణ మంత్రి అంతార్సింగ్ ఆర్య కూడా మాటలు చెప్పేరకం కాదు. ఏదైనా ప్రజలకు కళ్లకు కట్టేలా ఆయన ’డెమో’ ఇస్తూ ఉంటారు. తాజాగా చెట్లను పెంచి అడవులను కాపాడే ఆవశ్యకతను ప్రజలకు వివరించేందుకు ఆయన ఇదేవిధంగా ’డెమో’ ఇచ్చారు. తన నియోజకవర్గం కొండప్రాంతమైన సేంధ్వాలోని ఓ గ్రామంలోని సభలో పాల్గొన్న ఆయన.. ప్రజల్లో ఇద్దరిని వేదికపైకి పిలిచారు. అందులో ఒకరు బట్టతల ఉన్న వ్యక్తి. మరొకరు నిండుగా వెంట్రుకలు ఉన్న వ్యక్తి. ఇద్దరి నెత్తిపై మంత్రిగారు నీళ్లు గుమ్మరించారు. ఆ తర్వాత ఓ తుండువస్త్రం తీసుకొని ఆయన వారిద్దరి తలలనూ తుడిచారు. అప్పుడు ప్రజలను అడిగారు. బట్టతల వ్యక్తి తలపై నీళ్లు నిలిచాయా? లేక వెంట్రుకలున్న వ్యక్తి తలపైనా అని.. బట్టతల నున్నగా ఉండటంతో తడి లేదు. కానీ వెంట్రుకలున్న తలపై సహజంగా తడి ఉంది. అదే ప్రజలు చెప్పారు. ఇంతకు ఆయన ఇవ్వదలుచుకున్న సందేశం ఏమిటంటే.. బట్టతల అంటే చెట్లు, అడవి లేని ప్రాంతం. వెంట్రుకలు ఉన్న తల అంటే చెట్లు, అడవి ఉన్న ప్రాంతం. బట్టతల మాదిరిగానే అడవిలేని ప్రాంతం వాననీటిని కాపాడుకోలేదు. ముఖ్యంగా కొండప్రాంతంలో చెట్లులేకపోతే నీటి సంరక్షణ చాలా కష్టం. అదే చెట్లు, అడవి ఉంటే వెంట్రుకలున్న వ్యక్తి లాగా తడిని, నీటిని కాపాడుకోవచ్చు. స్వయంగా బట్టతల కలిగిన మంత్రిగారి సందేశం అనుకున్నట్టుగానే ప్రజల్లోకి వెళ్లింది. చెట్లను అధికంగా నాటడం ద్వారా వానానీటిని పరిరక్షించుకోవాలని మంత్రి అంతార్ సింగ్ పిలుపునిచ్చారు. -
రెండేళ్లవుతున్నా పనుల పూర్తి లే దు..
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న వివిధ పనులు మంజూరై రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకు పూర్తి చేయలేదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. మంజూరు పనులు, పూర్తైవి, వివిధ దశల్లో ఉన్నవి, ప్రారంభం కాని వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి పనులు జిల్లాకు 34 మంజూరుకాగా, ఇప్పటి వరకు 21 పనులు పూర్తి చేశారని, ఇంకా 13 పనులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. ఇందుకు గల కారణాలు అధికారులను అడిగారు. కుంటాల, సిర్పూర్, రెబ్బెన, కెరమెరి, వాంకిడి, నేరడిగొండ, బాబేర (బోథ్)లో ఈ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. 75 రోడ్డు పనులకుగాను 40 పనులు పూర్తి చేశారని, మిగతా 25 వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. ఇంకా ఆరు టెండర్ల స్థాయిలో ఉన్నాయని, అటవీ శాఖ అనుమతులు లేకపోవడం వల్ల కొన్ని పనులు నిలిచిపోయాయన్నారు. ఎక్కడెక్కడ ఆ పనులు నిలిచిపోయాయో వివరాలు తనకు పంపాలని మంత్రి సూచించారు. 13వ ఫైనాన్స్ కింద జిల్లాలో 18 పనులు ఉన్నాయని అన్నారు. అధికారులకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనకు చెప్పాలని మంత్రి పేర్కొన్నారు. ఈజీఎస్, గ్రామాల లింకురోడ్లు, మెటల్‌రోడ్లు తదితర పనులనూ వాకాబు చేశారు. ఐకేపీ, అంగన్వాడీ భవన నిర్మాణాలు ఎన్ని పూర్తయ్యాయో తెలుసుకున్నారు. అంతకు ముందు జిల్లాలో 23 జేఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఒక డిప్యూటీ ఈఈ పోస్టు ఖాళీగా ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. సమావేశంలో కలెక్టర్ ఎం.జగన్మోహన్, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ అమీనోద్దీన్, డిప్యూటీ ఈఈలు ప్రకాష్, శైలేందర్, సురేష్, రవి ప్రకాష్, అధికారులు పాల్గొన్నారు. విద్య, ఆర్డబ్ల్యూస్పై సమావేశం విద్య, ఆర్వీఎం, సాంఘిక సంక్షేమ శాఖల్లో పనుల తీరుపై ఆ శాఖల అధికారులతో మంత్రి జోగు రామన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు, ఉపాధ్యాయులు విద్యావ్యవస్థను పటిష్ట పర్చడం లేదన్నారు. పూర్తయిన పనులకు డబ్బులు చెల్లించాలని, ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలన్నారు. అదనపు గదుల నిర్మాణం ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ నిర్మాణాలు చేపట్టాలని, ఆర్వీఎం, ఆర్ఎంఎస్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షెడ్యూల్డు తెగల వారికి అందిస్తున్న సంక్షేమం పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీలకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడానికి 2013-14లో 3,631 మంది కి రూ.22.60 కోట్లు లక్ష్యం కాగా, రూ.20,71 కోట్లతో 2,831 మందికి బ్యాంకు రుణాల ద్వారా లబ్ధి చేకూర్చినట్లు అధికారులు తెలిపారు. 1991 నుంచి 2010 వరకు 3,911 మంది ఎస్సీ, ఎస్టీలకు 6,438.12 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చామని పేర్కొన్నారు. దళిత మహిళలకు ఆగష్టు 15న రూ. 18.37 కోట్లతో 106 మంది లబ్ధిదారులకు వ్యవసాయ భూములు పంపిణీ చేశామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. కావాల్సిన నిధుల ప్రతిపాదనలు పంపితే సీఎంతో మాట్లాడి మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ.. మంత్రి సూచనలు పాటించి సంక్షేమ పథకాల అమలు బాధ్యతగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈవో సత్యనారాయణ, ఆర్వీఎం పీవో యాదయ్య, డీడీఎస్డబ్ల్యూ శంకర్, అధికారులు పాల్గొన్నారు. అధికారులు అందుబాటులో ఉండాలి ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి.. వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న సూచిం చారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయంతో తాగునీటికి, వ్యవసాయానికి సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. జిల్లాలో 14 ఏఈఈ, రెండు మం డలాలకు ఒక ఈఈ చొప్పున పదిహేను మండలాలు ఉన్నాయని ట్రాన్స్‌కో ఎస్ఈ అశోక్ మంత్రికి వివరించారు. హౌసింగ్ కాలనీలో విద్యుత్ సరఫరాకు కొన్ని కాల నీల్లో పనులు పూర్తయ్యాయని, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లాలో ని ఆశ్రమ పాఠశాలల్లో విద్యుత్ సరఫరాకు ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పనులకు కలిపి మొత్తం 112 పనులకు గాను 100 పనులు పూర్తి చేశామని ఎస్ఈ తెలిపారు. సీఎల్డీపీ, ఇందిరా జలప్రభ పనులు పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్ల కొరకు ప్రభుత్వ భూములు కేటాయించాలని ఎస్ఈ కోరారు. విద్యుత్ కోతలు, విద్యుత్ సరఫరాలో అంతరాయం వివరాలు సక్రమంగా ప్రజలకు వివరించాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆదేశించారు. సోలార్ సిస్టంతో నీటి పథకాలు.. గ్రామీణ మంచినీటి సరఫరా విభాగంపై మంత్రి జోగు రామన్న సమీక్షించారు. సోలార్ సిస్టమ్ ద్వారా నీటి పథకాలు పనిచేసేలా ప్రతిపాదించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను మంత్రి ఆదేశించారు. వివిధ పత్రికల్లో వస్తున్నా ప్రతికూల వార్తలపై స్పందించాలని, మంచినీటి ట్యాంకులను అధికారులు పరిశీలించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ ఎం.జగన్మోహన్, ట్రాన్స్‌కో ఎస్ఈ అశోక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇంద్రసేన్, ఎస్ఈలు, డిప్యూటీ ఈఈలు పాల్గొన్నారు. -
బొగ్గు ఉత్పత్తి పెంచండి
కోల్ ఇండియాకు కేంద్ర మంత్రి గోయల్ ఆదేశం న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తిని పెంచేందుకు వీలుగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖల మంత్రి పీయూష్ గోయల్ కోల్ ఇండియా లిమిటెడ్‌ను ఆదేశించారు. ‘బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత తవ్వకాలు జరుపుతున్న గనుల నుంచి మరింత బొగ్గును వెలికితీసేందుకు అనుమతించాల్సిందిగా పర్యావరణ, అటవీ శాఖను కోరాం. విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా పెరిగే విధంగా ఈ-వేలంలో బొగ్గు పరిమాణాన్ని తగ్గించాలని ఆదేశించాం..’ అని ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాకు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని విద్యుదుత్పత్తి కంపెనీలన్నిటికీ సరఫరా చేసేందుకు బొగ్గు ఉత్పత్తిని 50-60 శాతం పెంచాలని కోల్ ఇండియాను కోరినట్లు చెప్పారు. దేశంలో విద్యుత్ కొరతకు పరిష్కారాలను కనుగొనేందుకు ప్రైవేట్ విద్యుత్ దిగ్గజాలు అనిల్ అంబానీ (రిలయన్స్ పవర్), గౌతమ్ ఆదానీ (ఆదానీ గ్రూప్), వినీత్ మిట్టల్ (వెల్స్పన్ ఎనర్జీ), నవీన్ జిందాల్ (జిందాల్ పవర్) తదితరులతో గోయల్ సమావేశం నిర్వహించారు. -
ఉన్నత చదువులు లేకే వెనుకబాటు
ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నత చదువులు చదవకపోవడంతోనే 60 ఏళ్ల సీమాంధ్ర పాలనలో వెనుకబాటుకు గురయ్యామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ మండలంలోని యాపల్‌గూడ గ్రామంలో సోమవారం ‘ఆచార్య జయశంకర్ బడి పండుగ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బడిబాట కార్యక్రమం ఈ నెల 16 నుంచి జూలై 2 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే జిల్లాలో యాపల్‌గూడలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. యాపల్‌గూడలో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే వంద మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు రప్పించడం అభినందనీయమన్నారు. యాపల్‌గూడ ప్రాథమిక పాఠశాలను ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులకు మంత్రి సర్టిఫికెట్లు, దుస్తులు, పుస్తకాలు అందజేశారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు చిన్నారులు సమాధానం చెప్పడంతో అందరూ వారిని అభినందించారు. మంత్రిని గ్రామస్తులు సన్మానించారు. పలు సమస్యలను గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందరూ మొక్కలు నాటాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సర్పంచ్ ఇస్రూబాయి, ఉప సర్పంచ్ తిరుపతి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, ఆర్వీఎం పీవో శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్, డీఈవో సత్యనారాయణరెడ్డి, ఎంఈవో జయశీల, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ వెంకన్న, వైస్ చైర్మన్ లక్ష్మి, ఎంపీటీసీ శ్రీవాణి, ప్రధానోపాధ్యాయులు తురాటి గంగన్న, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. రైతులకు నమ్మకం కలిగించాలి ఆదిలాబాద్ అగ్రికల్చర్ : సహకార బ్యాంకు కమర్షియల్ బ్యాంకుల కంటే ఎక్కువగా ప్రజల్లో నమ్మకం కల్పించాలని మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం జిల్లా సహకార బ్యాంకు ఆధ్వర్యంలో మంత్రి రామన్నను, ఎంపీ గోడం నగేశ్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును ఘనంగా సన్మానించారు. అంతకుముందు డీసీసీబీ మాజీ అధ్యక్షుడు గోనె హన్మంత్‌రావు మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులందరికీ రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, బ్యాంకు సీఈవో హన్మంత్‌రావు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు మంత్రి బిజీబిజీ కలెక్టరేట్ : రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న మంగళవారం పలు శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్‌లోని అటవీ శాఖ అతిథి గృహంలో వ్యవసాయ శాఖపై అధికారులతో సమావేశం అవుతారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఒంటి గంటకు విద్యుత్ సమస్యపై సమావేశం, 3 గంటలకు పంచాయతీ రాజ్ శాఖ, ఐటీడీఏ, అటవీ సంక్షేమంపై అధికారులతో సమావేశం కానున్నారు. -
రుణమాఫీపై ప్రతిపక్షాలది రాద్ధాంతం
- మేనిఫెస్టో హామీలను కచ్చితంగా అమలు చేస్తాం - మంత్రి జోగు రామన్న మంచిర్యాల టౌన్ : రుణ మాఫీపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ రైతులను పక్కదోవ పట్టిస్తున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న దుయ్యబట్టారు. ఆదివారం మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా ఐబీ విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు ఐబీలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మంత్రిగా మొదటిసారి మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, అటవీ శాఖ అధికారులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. పూర్తిస్థాయిలో అధికారులు లేకున్నా ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ పాలన సాగిస్తున్నామని, ఇదే అదనుగా ప్రతిపక్షాలు కుతంత్రాలు చేస్తున్నాయని మంత్రి దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు కమిటీ మాత్రమే వేశాడని, కానీ తెలంగాణలో కచ్చితంగా రూ.లక్ష లోపు రుణాల మాఫీతో పాటు రుణాలు తిరిగి అందేలా కూడా చూస్తున్నామని చెప్పారు. ఇక ఖరీఫ్ సీజన్లో రైతాంగాన్ని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాలు, ఎరువులను అందుబాటులోకి తీసుకువచ్చి పూర్తి స్థాయిలో పంపిణీ జరిగేలా చూస్తున్నామని వివరించారు. అమరుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు పింఛన్‌దారులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. అడవులను సంరక్షిస్తాం జిల్లాలో అంతరిస్తున్న అడవులను సంరక్షించేలా ప్రత్యేక చర్యలు చేపడుతామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో ఏడుగురు అటవీ శాఖ సిబ్బంది స్మగ్లర్ల దాడుల్లో మృత్యువాత పడ్డారని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని అందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తామని అన్నారు. ఇదే సమయంలో అక్రమ కలప రవాణా, స్మగ్లర్ల ఆగడాలను నియంత్రించేలా తగిన విధంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మంచిర్యాల, బెల్లంపల్లి, బోథ్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, సోయం బాపురావు, మంచిర్యాల జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత వెంకటేశ్వర్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, పట్టణ అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ, నాయకులు సిరిపురం రాజేశ్, పల్లె భూమేశ్, కర్ణ శ్రీధర్, ముత్తినేని రవికుమార్, గోగుల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు అత్తి సరోజ, జోగుల శ్రీదేవి, గౌరీప్రియ, తిరుమల యాదవ్ పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కుభీర్ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి జోగు రామన్న అన్నారు. మండలానికి ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో జరిగిన శుభకార్యానికి హజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం మండలంలోని పల్సిలో సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సన్మానించారు. పాలజ్ గణేశ్ మందిరంలో సైతం పూజలు చేశారు. ఆయన వెంట భైంసా మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, ఆదిలాబాద్ మాజీ చైర్మన్ భోజారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి పాకాల రాంచందర్, మండల నాయకులు దామాజీ, హన్మండ్లు, దేవెందర్, గులాబ్, పోశెట్టి, కల్యాణ్ పాల్గొన్నారు. -
అదనపు బాధ్యతలు స్వీకరించిన వీరప్ప మొయిలీ
దేశంలో పచ్చదనం పరిరక్షించేందుకు రాజీ లేని పోరాటం చేస్తానని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. పర్యావరణం, అడవులు అనేవి మనిషి జీవితంలో ఓ భాగమని ఆయన పేర్కొన్నారు. అవి వాతావరణ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తాయని తెలిపారు. అడవులు, పర్యావరణ మంత్రిగా అదనపు బాధ్యతలు మంగళవారం వీరప్ప మొయిలీ స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ బాధ్యతలను చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీకి అప్పగిస్తున్నట్లు రాష్ట్రపతి భవనం వెనువెంటనే విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. దాంతో వీరప్ప మొయిలీ మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసేందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు జయంతి వెల్లడించారు. అయితే పర్యావరణ ప్రాజెక్టు అనుమతుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న కారణంగా జయంతిని పదవి నుంచి తొలగించినట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి.