కాళేశ్వరం అనుమతులకు ధన్యవాదాలు | Thank you for the permission of Kaleshwaram : KCR | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం అనుమతులకు ధన్యవాదాలు

Published Wed, Jun 28 2017 3:33 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

కాళేశ్వరం అనుమతులకు ధన్యవాదాలు - Sakshi

కాళేశ్వరం అనుమతులకు ధన్యవాదాలు

- పర్యావరణ మంత్రి భేటీలో సీఎం కేసీఆర్‌ 
హరితహారానికి రావాల్సిందిగా ఆహ్వానం
 
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశకు అనుమతులిచ్చిన నేపథ్యంలో కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్‌కు సీఎం  కె.చంద్రశేఖర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కేంద్రమంత్రి బండారు దత్తా త్రేయ, ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.వేణుగోపాలాచారి తదితరులతో కలసి పర్యావరణ మంత్రితో భేటీ అయ్యారు.  దత్తాత్రేయ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతులకు మేలు జరుగు తుందని, దీనికి సహకరించినందుకు కేంద్రా నికి ధన్యవాదాలు తెలిపినట్లు వివరించారు.

తెలంగాణలో భారీ ఎత్తున నిర్మిస్తున్న పవర్‌ ప్లాంటుకు అనుమతులు దక్కడం గొప్ప విశేషమని వివరించారు. రాబోయే రోజుల్లో కాంపా నిధులు విడుదల కావాల్సి ఉందని, దీనికి సంబంధించి నిబంధనల రూపకల్పన అనంతరం విడుదల అవుతాయని పర్యావ రణ మంత్రి తెలిపినట్లు వివరించారు. భేటీ వివరాలను వేణుగోపాలాచారి మీడియాకు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమ తులు ఇచ్చినందుకు కేసీఆర్‌ కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. జూలైలో హరిత హారం ప్రారంభానికి రాష్ట్రానికి రావా లని హర్షవర్ధన్‌ను ఆహ్వానించినట్లు తెలిపా రు. ‘రాష్ట్రానికి బకాయి ఉన్న కాంపా నిధు లను విడుదల చేయాలని సీఎం కోరారు. కొత్త రాష్ట్రంలో నీటిపారుదల రంగం అభివృ ద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయా లను కేంద్రమంత్రికి వివరించారు. దేశంలోనే నీటిపారుదల రంగానికి రూ.25 వేల కోట్ల మేర బడ్జెట్‌ను కేటాయించినట్లు వివరిం చారు’ అని వేణుగోపాలాచారి వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement