సాక్షి, ఢిల్లీ : ఏపీలో అటవీ అభివృద్ధి కోసం కేంద్రం రూ.1734 కోట్లను విడుదల చేసిందని ఏపీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఢిల్లీలోని పర్యావరణ భవన్‌లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆధ్వర్యంలో రాష్ట్రాల పర్యావరణ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ నుంచి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సమావేశానంతరం బాలినేని మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుంకుంటామన్నారు. ఎర్ర చందనం అమ్మకానికి అనుమతి ఇవ్వాలని కోరగా ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారని వెల్లడించారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారనీ, అమ్మకాలకు అనుమతినిస్తే స్మగ్లింగ్‌ను నివారించవచ్చని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment