అనుకున్న సమయానికే ఇందిరమ్మ ఇళ్లు | indrakaran reddy speaks on indiramma houses | Sakshi
Sakshi News home page

అనుకున్న సమయానికే ఇందిరమ్మ ఇళ్లు

Published Wed, Mar 15 2017 2:56 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

indrakaran reddy speaks on indiramma houses

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బకాయిలు చెల్లిస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆయన శాసనసభలో  మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల బకాయిలు చెల్లించడం లేదని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. 29,64,435 మంది లబ్ధిదారులకు బకాయిలు చెల్లించామని, 1,19,307 మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించామని తెలిపారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభమైందని గుర్తు చేశారు. అనుకున్న సమయానికే ఈ ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని పేర‍్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement