
సాక్షి, హైదరాబాద్: అటవీశాస్త్ర పరిజ్ఞానంలో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడంతోపాటు విద్యాప్రమాణాలను పెంపునకు ఆబర్న్ వర్సిటీతో కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవో యూ) మైలురాయి కాగలదని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం అరణ్య భవన్‌లో ఆయన సమక్షంలో రాష్ట్ర ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ), అమెరికా అలబామా రాష్ట్రంలోని ఆబర్న్ వర్సిటీ మధ్య ఎంవో యూ కుదిరింది. ఆబర్న్ యూనివర్సిటీ డీన్ జానకి రాంరెడ్డి, ఎఫ్‌సీఆర్‌ఐ డీన్ చంద్రశేఖర్ రెడ్డిలు ఎంఓయూపై సంతకాలు చేసి, ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. విద్యా విధానం ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ ఒప్పందం వల్ల ఎఫ్‌సీఆ ర్‌ఐ విద్యార్థులకు మేలు జ రుగుతుందని ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పరిశోధన వల్ల కలిగే ప్రయోజనంతో ఫలితాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పీసీసీఎఫ్ ఆర్.శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అదనపు అటవీ సంరక్షణ అధికారులు లోకేశ్ జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్, ఎం.సి.పర్గెయిన్ పాల్గొన్నారు.