పండుగలను ఇళ్లలోనే జరుపుకోండి | Please Celebrate Festivals At Home Says Minister Indrakaran Reddy | Sakshi
Sakshi News home page

పండుగలను ఇళ్లలోనే జరుపుకోండి

Published Mon, Aug 17 2020 2:28 AM | Last Updated on Mon, Aug 17 2020 2:28 AM

Please Celebrate Festivals At Home Says Minister Indrakaran Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జన సమూహాలు లేకుండా వినాయకచవితి ఉత్సవాలతోపా టు మొహర్రంను ఎవరి ఇం ట్లో వారే నిర్వహించుకోవాలని, సామూహిక నిమజ్జనా లు, ప్రార్థనలు వద్దని ప్రజలకు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో ఈ రెండు పండుగలను నిరాడంబరం గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నా రు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆదివారం మంత్రి తన క్యాంప్‌ కా ర్యాలయం నుంచి మీడియా ద్వారా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కరోనా నిబంధన లను ప్రజలు తప్పకుండా పాటించాలని, వ్యక్తుల మధ్య భౌతికదూరం పాటించాలని, మాస్కులు తప్పక ధరించాలని, ఈ నిబంధనలను పాటిస్తూ ప్రజలు పండుగలు జరుపుకోవాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement