
సాక్షి, హైదరాబాద్: మనుషులకు ప్రాణాధారమైన గాలిని (ఆక్సిజన్) కొనుక్కోవాల్సిన దుస్థితి రాకుండా ఉండేందుకు అడవులను పరిరక్షించుకుని జాగ్రత్త పడాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో అర్బన్‌పార్కు ప్రారంభంతో పాటు వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొ ని మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న అటవీ సంరక్షణ చర్యలతో ప్రజల్లో అవగాహన పెరుగుతోందన్నారు. అడవుల రక్షణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛమైన గాలి లభించడం గగనమైపోతున్న తరుణంలో ప్రభుత్వం ‘అర్బన్ లంగ్ స్పేస్’పేరుతో రిజర్వ్ ఫారెస్టులను అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఇంద్రకరణ్ తెలిపారు.