
సాక్షి, నిర్మల్ : టీఆర్‌ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి సొంత నియోజకరవర్గం నిర్మల్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అనుచరుడు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్‌తోపాటు పలువురు కౌన్సిలర్లు మంత్రికి ఎదురుతిరిగారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యవహారశైలిపై గత కొంతకాలంగా వీరు ఆదివారం టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. తర్వలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్, ఆయన మద్దతుదారులైన కౌన్సిలర్లు రంగం సిద్ధం చేసుకున్నారు. మంత్రి తీరు నచ్చకపోవడంతో పార్టీ మారాలని వారు నిర్ణయించుకున్నారని, త్వరలో రాహుల్‌గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.