రేవంత్‌రెడ్డికి జైలుశిక్ష తప్పదు..
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ఆర్మూర్ : ఏపీ ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు కు తొత్తుగా వ్యవహరిస్తూ తెలంగాణలో అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ శాసన సభాపక్ష నేత రేవంత్‌రెడ్డికి తమిళనాడులో శశికళకు పట్టిన గతే పడుతుందని హౌసింగ్, దేవాదా య శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌లో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎమ్మెల్సీని కొనుగోలు చేసే వ్యవహారంలో రేవంత్‌రెడ్డికి జైలు శిక్ష, ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోక తప్పదన్నారు. గతంలో వీకర్ సెక్షన్‌లో పేదలకు ఇచ్చిన ఇళ్లను ఇతరులకు కేటాయించానని తనపై రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని అన్నారు. నిరూపించని పక్షలో రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలని సవాల్ విసిరారు.
తాను చైర్మన్‌గా మంత్రులు ఈటల రాజేందర్, మహేందర్‌రెడ్డిలతో ఏర్పాటైన కమిటీలో ఎలాంటి అక్రమాలకు తావు లేదన్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సంస్కారం లేకుండా మా ట్లాడుతున్నాడని విమర్శించారు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నాడన్నారు.í డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయన్నారు. తన రాజకీయ జీవితంలో అవినీతికి, అక్రమాలకు పాల్పడలేదని మంత్రి పేర్కొన్నారు.