
సాక్షి, న్యూఢిల్లీ: గిరిజన కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రావాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆహ్వానించారు. బుధవారం ఈ మేరకు వెంకయ్యను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకొని ఆహ్వాన పత్రికను అందించారు. జాతరకు తప్పక హాజరవుతానని వెంకయ్య హామీనిచ్చారని మంత్రి వెల్లడించారు. అనంతరం జాతర విశిష్టతను, ఏర్పాట్ల గురించి వివరించారు.
జాతరను జాతీయ పండుగగా గుర్తించే విషయమై కేంద్రానికి సూచించాలని కోరినట్టు ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాకు తెలిపారు. జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, ప్రత్యేకంగా హెలిప్యాడ్లు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఉచిత వైఫై, మంచినీరు, స్వచ్ఛతా అంశాలపై దృష్టి సారించినట్టు వివరించారు. వెంకయ్యను కలిసిన వారిలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు సీతారాం నాయక్, జి.నగేశ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment