Sammakka Saralamma
-
మేడారం మినీ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వన జాతర నుంచి జన జాతరగా మారిన మేడారం
-
Medaram: నేటి నుంచి సమక్క-సారలమ్మ మహా జాతర
ములుగు,సాక్షి: ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళా.. తెలంగాణలో జరిగే చారిత్రాత్మక క్రతువు మేడారం మహా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క, సారలమ్మలు వనం వీడి జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో మహా జాతర ఉత్సవాలు బుధవారం నుంచి ఆరంభం కానున్నాయి. ఈ మహాజాతర ప్రారంభం కానుండడంతో మొక్కులు, దర్శనం కోసం వచ్చే వారి సంఖ్యతో మేడారం పరిసరాలు పూర్తిగా జనసంద్రంగా మారనున్నాయి. భక్తుల కొంగు బంగారం సమ్మక్క-సారలమ్మ జాతర మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నం) రోజున రెండేళ్లకోసారి జరుగుతుందని చెప్పనక్కర్లేదు. మేడారం మహాజాతర పూజల తొలిఘట్టం గత బుధవారమే అత్యంత వైభవంగా ప్రారంభమయింది. జాతరకు సరిగ్గా వారం ముందు నిర్వహించే మండమెలిగే పండగను మేడారంలోని సమ్మక్క దేవత, కన్నెపల్లిలోని సారలమ్మ తల్లి పూజారులు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఇక.. ఈసారి ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. నిన్న(మంగళవారం) మేడారం మహాజాతర జంపన్న గద్దెకు చేరే క్రతువుతో ఆరంభమైంది. పూజారి పోలెబోయిన సత్యం, వడ్డె అయిన గొంది సాంబశివరావు ఆధ్వర్యంలో మంగళవారం కన్నెపల్లి నుంచి జంపన్న ఆదివాసీ సంప్రదాయాలతో రాత్రి 7:09 గంటలకు బయల్దేరారు. సరిగ్గా 8:31 గంటలకు జంపన్నను గద్దెకు చేర్చారు. జంపన్న గద్దెకు వచ్చే క్రమంలో గ్రామస్థులు, ఆడపడుచులు మంగళ హారతులు ఇస్తూ, నీళ్లు ఆరగిస్తూ స్వాగతం పలికారు. ఆదివాసీ పెద్ద మనుషులు, యువత రక్షణ కవచంలా ఉంటూ గద్దెల వరకు చేర్చారు. భక్తులు రహదారులకు ఇరువైపులా కన్నెపల్లి నుంచి జంపన్నవాగు వరకు 2 కిలోమీటర్ల మేర శరణు వేడుతూ జంపన్నకు స్వాగతం పలికారు. గద్దెకు చేరిన తర్వాత భక్తులు జంపన్నను దర్శించుకున్నారు. ఇవాళ సమ్మక్క కూతురైన సారలమ్మ సాయంత్రం నాలుగు గంటలకు కొలువుదీరనుంది. సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్దంగా ఆదివాసి, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకొస్తారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. శుక్రవారం ఇద్దరు తల్లులు భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం సాయంత్రం దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. సారలమ్మ రాక: మొదటి రోజు (ఫిబ్రవరి 21) కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవి గంభీరమైన ఆగమనాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక ఉత్సవాలకు నాంది పలికే రోజు ఇది. గాలి దేవత సన్నిధికి స్వాగతం పలుకుతూ కీర్తనలు, సంగీతంతో అలరిస్తుంది. సమ్మక్క ప్రవేశం: రెండోరోజు (ఫిబ్రవరి 22) చిలుకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారి జాతరతో దివ్యగాథ కొనసాగుతుంది. దేవత రాకను సూచిస్తూ డప్పులు, శంఖం ధ్వనులతో అడవి ప్రతిధ్వనిస్తుంది. ఆధ్యాత్మిక ఉత్సవాన్ని బలపరిచే రోజు ఇది. ఉత్సవాల కొనసాగింపు: మూడోరోజు (ఫిబ్రవరి 23) ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు, సంగీతంతో గిరిజన వారసత్వం శక్తిమంతంగా కళ్లకు కడుతుంది. అడవికి తిరుగు ప్రయాణం: నాలుగోరోజు (ఫిబ్రవరి 24) గంభీరమైన వన ప్రవేశం వేడుక పాటిస్తారు. ఇక్కడ దేవతలు తిరిగి అడవికి ప్రయాణం చేస్తారు. ఇది జాతర ముగింపును సూచిస్తుంది. జీవిత ప్రక్రియ స్వభావం, దైవ, సహజ ప్రపంచం మధ్య ఉండే లోతైన సంబంధాన్ని గుర్తు చేస్తుంది. తెలంగాణ నుంచే కాకుండా, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్..ఇలా ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు వస్తారు. ఈసారి మేడారం జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. -
ఆన్లైన్ ద్వారా సమ్మక్క–సారలమ్మలకు ‘బంగారం’
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారలమ్మలకు ఆన్లైన్ ద్వారా నిలువెత్తు బంగారం (బెల్లం) సమరి్పంచే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం.. అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం తన మనవడు రియాన్‡్ష పేరిట నిలువెత్తు బంగారాన్ని ఆన్లైన్ ద్వారా సమర్పించారు. అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఈ సందర్భంగా తన మనవరాలి నిలువెత్తు బంగారాన్ని ఆన్లైన్ ద్వారా అమ్మవార్లకు సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. మేడారంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధిస్తూ పోస్టర్ మేడారం మహాజాతరలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ, జాతరను పరిశుభ్రంగా జరుపుకోవాలని భక్తులను కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఓ పోస్టర్‌ను ఆవిష్కరించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొన్నారు. -
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్ ఇదే..
వరంగల్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ నుంచే పాదయాత్ర ప్రారంభించనున్నారు. 'హాత్ సే హాత్ జోడో' అభియాన్ లో భాగంగా రేవంత్ ఈ యాత్ర చేపడుతున్నారు. తెలంగాణలో నియంతృత్వ పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వైఎస్ఆర్ స్ఫూర్తితో తాను ఈ యాత్ర చేపడుతున్నట్లు రేవంత్ చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003లో వైఎస్ఆర్ చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టి 2004లో టీడీపీని ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కాకతీయ రాజులపై వీరోచిత పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం కోసమే తన పాదయాత్రను మేడారం నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రేవంత్ పాదయాత్ర షెడ్యూల్ ఇలా.. సోమవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి పాదయాత్రకు బయలుదేరుతారు వరంగల్ హైవే మీదుగా ములుగు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు 12 గంటలకు పాదయాత్ర ప్రారంభం మేడారం నుంచి కొత్తూరు, నార్లాపుర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర మధ్యాహ్నం 2 నుంచి 2 30 వరకు ప్రాజెక్ట్ నగర్లో భోజన విరామం ప్రాజెక్ట్ నగర్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి పాదయాత్ర సాయంత్రం 4:30 నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం పస్రా జంక్షన్లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్ తిరిగి సాయంత్రం 6 గంకలకు పస్రా నుంచి మళ్లీ పాదయాత్ర రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకోనున్న రేవంత్ పాదయాత్ర రాత్రికి రామప్ప గ్రామంలోనే బస రేవంత్ మొదటి విడత పాదయాత్రలో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. ఫిబ్రవరి 22 వరకు ఈ యాత్ర సాగుతుంది. ఆ తర్వాత రెండు రోజులు విరామం తీసుకుని చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్ ప్లీనరీకి హాజరవుతారు. ఆ తర్వాత ఫిబ్రవరి 24 పాదయాత్ర రెండో విడత ప్రారంభమవుతుంది. 'హాత్ సే హాత్ జోడో అభియాన్'లో భాగంగా తెలంగాణలోని అన్ని గ్రామాలను కవర్ చేసి ప్రతి ఇంటికి రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేడయమే ఈ యాత్ర లక్ష్యమని ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే చెప్పారు. చదవండి: కాంగ్రెస్ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి గెలుపెవరిదో..? -
Medaram : సమ్మక్క సారలమ్మ చిన్న జాతర (ఫొటోలు)
-
మేడారంలో ప్రత్యేక పూజలు
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క, సారలమ్మ మినీ జాతర గురువారం రెండో రోజుకు చేరింది. బుధవారం మండమెలిగె పండుగతో జాతర ప్రారంభం కాగా.. రెండో రోజు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. మేడారం, కన్నెపల్లి ఆదివాసీలు, గ్రామస్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మ పూజారులు వారి ఇళ్లలో కూడా అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి జంపన్నవాగు వద్ద స్నానాలు ఆచరించారు. గద్దెల ప్రాంగణంలో మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి మొదలైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. -
చినజీయర్‌ను తప్పించండి: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క–సారలమ్మలను అవమానపరిచిన త్రిదండి చినజీయర్ స్వామిని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుని బాధ్యతల నుంచి తక్షణమే తప్పించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భక్తి విశ్వాసాలపై దాడి చేసిన జీయర్‌స్వామిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
సమ్మక్క– సారలమ్మలను తూలనాడలేదు
తాడేపల్లిరూరల్: ‘‘సమ్మక్క–సారలమ్మ గ్రామ దేవతలేనని అన్నాం. వారిని చిన్నచూపు చూసినట్టు, తూలనాడినట్టు కొందరు ప్రచారం చేస్తున్నారు. అది పొరపాటు. నేను ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆదివాసీ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలని ఆలోచించిన సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్లం. వారిని చిన్నచూపు చూసే ఆలోచన చేయబోం. కానీ కొందరు స్వార్థ ప్రయోజనాలతో నా వ్యాఖ్యలను వక్రీకరించి విమర్శలు చేస్తున్నారు. అమాయక ప్రజలను రెచ్చగొట్టడం సమాజానికి మంచిది కాదు..’’అని త్రిదండి చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. ఆధ్యాత్మికతతో ఉన్నవారు వివాదాలకు తావు ఇవ్వరని, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసే వారి జ్ఞానానికే ఈ విషయాన్ని వదిలేస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఏపీలోని తాడేపల్లిలో ఉన్న సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై చినజీయర్ స్వామి మీడియాతో మాట్లాడారు. ఆయా అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఈ మధ్య నాపై కొన్ని వివాదాలు వచ్చాయి. కొంతమంది దేవతలను చిన్నచూపు చూసినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏదైనా విన్నప్పుడు ఆ మాటల పూర్వాపరాలు చూడాలి. చిన్న వీడియో చూసి ఒక వ్యక్తి ఇలా అన్నాడని ప్రచారం చేయడం హాస్యాస్పదం. మేం ఆదివాసీ జనాలను ఏదో అన్నట్టుగా, కామెంట్ చేస్తున్నట్టుగా వినపడుతుంది. మేం అటువంటి కామెంట్ చేయం. సమాజ హితంపై కాంక్ష ఉన్నవారైతే.. వచ్చి ఏం జరిగిందనే విషయం తెలుసుకోవాలి, సరైన పద్ధతిలో స్పందించాలి. 20 ఏళ్లకు ముందు మాట్లాడిన వీడియో నుంచి దానిని తీశారు. ఆ రోజున మాట్లాడినప్పుడు సమ్మక్క–సారలమ్మ స్వర్గం నుంచి దిగివచ్చిన వారు కాదు, గ్రామ దేవతలేనని అన్నాం. వారు సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలను ఎదుర్కొని భక్తులచేత పూజలందుకుంటున్నారని చెప్పాం. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా వివాదం ఇప్పుడే తగ్గుతోంది. దీంతో ప్రచారం కోసం దీన్ని చర్చకు తీసుకువస్తున్నట్లు కనపడుతోంది. మాకు ఆస్తులేమీ ఉండవు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మాకు వ్యక్తిగతఆస్తులేమీ ఉండవు. సేవా కార్యక్రమాలు చేసేప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలా మాంసం తినవద్దని చెప్పిన మాట వాస్తవమే. కొందరు దానిని వక్రీకరించి మాట్లాడటం బాధాకరం. సమాజానికి మంచి చేసేవారితో కలిసేందుకు మేం ఎప్పుడూ సిద్ధమే. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అనేది మా నినాదం. ఆదివాసుల సంక్షేమానికి వికాస తరంగిణి సంస్థ ద్వారా సేవ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నాం.. మా జీయర్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మహిళలు మంత్రోచ్ఛారణ చేయకూడదని చాలామంది అభిప్రాయం. కానీ మేం మహిళలను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నాం. జీయర్ ట్రస్ట్ ద్వారా వైద్య పరీక్షలు చేయించి.. మహిళలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నాం. ఇందులో అన్ని మతాలు, కులాలకు చెందిన మహిళలు ఉన్నారు. మేం మెడికల్ క్యాంప్ పెట్టినపుడు సేవ చేయడానికి వచ్చే వైద్యులు కూడా అనేక వర్గాలకు చెందినవారు ఉంటారు. ఆదివాసులను విమర్శించాల్సిన అవసరం మాకు లేదు’’అని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అహోబిల స్వామి, మాజీ ఎంపీ, జీయర్ ట్రస్ట్ సభ్యుడు గోకరాజు గంగరాజు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. మా దగ్గర అందరూ సమానమే.. మేం రాజకీయాలకు దూరం. మా దగ్గర అందరూ సమానమే. రాజకీయాల్లోకి వెళ్లాలన్న కోరిక మాకు ఉండదు. ఎవరితోనూ గ్యాప్ అనేది ఉండదు. వివాదాలు ఉండవు. మేమెప్పుడూ దక్షతతో మంచి కార్యక్రమాలు చేస్తాం. ఎవరినీ మోసం చేయకుండా ఉంటాం. రాబట్టే ధైర్యంగా మాట్లాడగలుగుతాం. వారికి వీరికి దడుస్తూ ఏదో మూలన నక్కి మాట్లాడటం మా చర్రితలో ఎప్పుడూ లేదు. మేం సన్యాసులం.. మా పేరుతో బ్యాంకు ఖాతా కూడా ఉండదు. మేం ఎవరికీ భయపడబోం.. అలాగే ఎవరి వెంటా పడబోం. శుక్రవారం ఏపీలోని తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడుతున్న చినజీయర్ స్వామి. చిత్రంలో అహోబిలస్వామి, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు -
చినజీయర్ స్వామి క్షమాపణ చెప్పాలి
ఎస్ఎస్ తాడ్వాయి/గుండాల: సమ్మక్క, సారలమ్మ వనదేవతలమీద త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై పూజారులు మండిపడ్డారు. స్వామి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం సమ్మక్క, సారలమ్మ పూజారులు, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వా యి మండలంలోని మేడారంలో చినజీయర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు. అయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్వామి మాటలపై పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు మాట్లాడుతూ చినజీయర్ స్వామి ఇంగీత జ్ఞానం లేకుండా సమ్మక్క, సారలమ్మ దేవత కాదని అనడం అవివేకమన్నారు. కోట్లాది మందికి అశీర్వాదాలు అందించే తల్లులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఆదివాసీ ప్రజానీకానికి, వనదేవతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, స్వామి వ్యాఖ్యలను తప్పుబడుతూ భద్రాద్రి కొత్త గూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డలోని పగిడిద్దరాజు గుడివద్ద అరెం వంశీయులు బుధవారం నిరసన తెలిపారు. సమ్మక్క, సారలమ్మ విషయంలో స్వామి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. -
పులిపై సమ్మక్క, జింకపై సారలమ్మ... ఈ రూపాలు ఎలా వచ్చాయో తెలుసా ?
-
హామీలు అమలు చేయని సీఎం
ములుగు: సమయానుకూల తను బట్టి ప్రజలకు హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయని నైజం ఉన్న ముఖ్య మంత్రి కేసీఆర్ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. గురువారం మేడారం సమ్మక్క సారలమ్మలను షర్మిల దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల తరపున పోరాడిన సమ్మక్క సారలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే గిరిజనులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందన్నారు. గిరిజనులకు 3 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చింది వైఎస్సార్ అన్నారు. -
కురిసిన మేఘం.. ఆగమాగం
ఏటూరునాగారం /మంగపేట: శ్రీ సమ్మక్క – సారలమ్మ మహా జాతర చివరి రోజైన శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు కురిసిన వర్షం వల్ల మేడారంలోని రోడ్లు, పరిసర ప్రాంతాలు బురదమయంగా మారాయి. భక్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు తడుచుకుంటూనే అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రతి జాతర సమయంలో చిరుజల్లు పడటం ఆనవాయితీ. ఈ సారి వనదేవతలు గద్దెలపై ఉన్న క్రమంలో వర్షం కురవడం శుభసూచికంగా భక్తులు భావిస్తున్నారు. అకాల వర్షం పడటం వల్ల భక్తులు తడిబట్టలతో దర్శనం చేసుకుని తన్మయత్వం పొందారు. సమ్మక్క గద్దె వద్ద చీర సమర్పిస్తున్న మండలి చైర్మన్ ‘గుత్తా’ తిరుగు పయనం కష్టాలు అకాల వర్షంతో మేడారం తిరుగు ప్రయాణంలో భక్తులకు వర్షం కష్టాలు ఎదురయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్, పలు చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో నిలిపి వేసిన వాహనాలు దిగబడటంతో వాటిని బయటకు తీసేందుకు భక్తులు పడ రాని పాట్లు పడ్డారు. మేడారం సమ్మక్క గుడి ప్రాంతంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉన్న వాహనాలు దిగబడగా.. వీవీఐపీ, వీఐపీ వాహనాలు రెండు గంటల పాటు ఇరుక్కుపోయాయి. అలాగే మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనాల్లో వెళ్తున్న భక్తులు సైతం ఇబ్బందులకు గురయ్యారు. ఊరట్టం స్తూపం నుంచి పస్రా వెళ్లే దారిలో వాహనాలు నిలిచిపోయాయి. మేడారం లోని పలు ప్రాంతాల నుంచి వచ్చే రోడ్ల నుంచి కూడా వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెడ్డిగూడెం వెళ్లే గ్రామ పంచాయతీ కార్యాలయం మూల మలుపు వద్ద రెడ్డిగూడెం వైపు నుంచి వచ్చే వాహనాలు ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. శనివారం సాయంత్రం అకాల వర్షంతో వ్యాపార సముదాయాల్లోకి చేరిన నీరు దుర్వాసన శనివారం కురిసిన వర్షంతో మేడారం పరిసరాల్లో దుర్వాసన మొదలైంది. జాతరలో భక్తులు వదిలేసిన తిను బండారాలు, పేరుకుపోయిన చెత్తాచెదారం, కోళ్లు, మేకల వ్యర్థాలతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్ల వలన దుర్వాసన వస్తోంది. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన క్లోరినేషన్ పనులు చేపట్టకపోతే స్థానికులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా.. మేడారం అభివృద్ధి: ఎమ్మెల్యే సీతక్క ములుగు: మేడారం జాతర ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మరింత అభివృద్ధి చేయాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీ బిడ్డగా.. రెండు సార్లు ఎమ్మెల్యేగా జాతర నిర్వహణలో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు. వచ్చే 2022 మహా జాతరలో ఈ సారి ఎదురైన సమస్యలను గుర్తించి మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం సహకరించాలని కోరారు. మొదటి రెండు రోజులు జంపన్న వాగు వద్ద నీరు లేక భక్తులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. నిధుల వినియోగ విషయంలో అన్ని వర్గాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలను సేకరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే బడ్జెట్ ప్రణాళికలో మార్పు రావాలని ఆమె అభిప్రాయపడ్డారు. -
కన్నుల పండువగా తెలంగాణ కుంభమేళా
-
మేడారం జాతరకు విచ్చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: గిరిజన కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రావాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆహ్వానించారు. బుధవారం ఈ మేరకు వెంకయ్యను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకొని ఆహ్వాన పత్రికను అందించారు. జాతరకు తప్పక హాజరవుతానని వెంకయ్య హామీనిచ్చారని మంత్రి వెల్లడించారు. అనంతరం జాతర విశిష్టతను, ఏర్పాట్ల గురించి వివరించారు. జాతరను జాతీయ పండుగగా గుర్తించే విషయమై కేంద్రానికి సూచించాలని కోరినట్టు ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాకు తెలిపారు. జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, ప్రత్యేకంగా హెలిప్యాడ్లు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఉచిత వైఫై, మంచినీరు, స్వచ్ఛతా అంశాలపై దృష్టి సారించినట్టు వివరించారు. వెంకయ్యను కలిసిన వారిలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు సీతారాం నాయక్, జి.నగేశ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. -
'మేడారం'ను జాతీయ పండుగగా గుర్తించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, టీఆర్ఎస్ ఎంపీలు సీతారాం నాయక్, జి.నగేష్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరంను కలసి విజ్ఞప్తి చేశారు. ఈ జాతరకు తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో గిరిజనులు హాజరవుతారని వివరించారు. సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసిందని వివరించారు. ఉత్తర భారతంలో జరిగే వనజ్ జాతరను జాతీయ పండుగగా గుర్తించినట్టే గిరిజనులు ఎంతో ఆరాధించే సమ్మక్క–సారలమ్మ జాతరను సైతం జాతీయ పండుగగా గుర్తించి, కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక సాయం చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరినట్టు సమావేశం అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాకు తెలిపారు. అలాగే జాతరకు రావాల్సిందిగా మంత్రి జుయల్‌ను తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆహ్వానించామన్నారు. -
ఘనంగా ముగిసిన మేడారం జాతర
-
వనంలోకి జన దేవతలు
తిరిగి అడవిలోకి ప్రవేశించిన సమ్మక్క, సారలమ్మలు సాక్షి ప్రతినిధి, వరంగల్: లక్షలాది మంది భక్తుల పూజలందుకున్న వన దేవతలు శనివారం తిరిగి వన ప్రవేశం చేశారు. నాలుగు రోజులపాటు వైభవంగా జరిగిన మేడారం మహా జాతర ముగిసింది. ఆదివాసీ సంప్రదాయాలతో పూజారులు (వడ్డెలు) దేవతలను శనివారం సాయంత్రం అడవిలోకి తీసుకెళ్లారు. లక్షలాది మంది భక్తుల మధ్య నలుగురు దేవతల వన ప్రవేశ ఘట్టం ఉద్విగ్నంగా సాగింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా జాతర చివరిరోజు అయిన శనివారం దాదాపు 8 లక్షల మంది సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. దేవతల వనప్రవేశం పూర్తయిన తర్వాత సమ్మక్క గద్దెపై భక్తులు సమర్పించిన చీరసారె, బంగారం, పసుపు కుంకుమలను మేడారం వాసులు తీసుకున్నారు. దేవతల ప్రసాదాన్ని తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. దేవతల వన ప్రవేశం తర్వాత కూడా పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలతో.. దేవతల వన ప్రవేశ ఘట్టం శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల సమయంలో దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. మొదట గోవిందరాజును దబ్బగట్ల గోవర్దన్, పోదెం బాబు నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల నుంచి ఆరు గంటలకు కదిలించి.. ఏటూరునాగారం మండలం కొండాయికి తరలించారు. అనంతరం 6.24 గంటలకు కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన మునీందర్ నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల వద్ద పూజలు నిర్వహించి సమ్మక్కను అక్కడి నుంచి కదిలించారు. గద్దెల సమీపంలోని ఎదుర్కోళ్ల ప్రదేశం వద్ద మేకను బలిచ్చి, పూజలు చేశారు. తర్వాత సమ్మక్కను చిలుకలగుట్టకు చేర్చారు. ఇక సమ్మక్క భర్త పగిడిద్దరాజును 6.28 గంటలకు పెనక బుచ్చిరాములు నేతృత్వంలోని పూజారుల బృందం తరలించి... కొత్తగూడ మండలం పూనుగొండ్ల వైపు తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం వారు గమ్యాన్ని చేరుకుంటారు. ఇక సారలమ్మను కాక సారయ్య, కాక కిరణ్, సోలం వెంకటేశ్వర్లు నేతృత్వంలోని పూజారుల బృందం కదిలించింది. గద్దెపై ప్రతిష్ఠించిన మెంటె(వెదురుబుట్ట)ను 6.35 గంటలకు తీసుకుని జంపన్న వాగు మీదుగా కన్నెపల్లికి చేర్చింది. భక్తులు ఈ సమయంలో పూజారులను తాకి, మొక్కుకోవడానికి ప్రయత్నించారు. మొత్తంగా దేవతల వన ప్రవేశంతో మేడారం మహాజాతర అధికారికంగా ముగిసింది. బుధవారం నిర్వహించే తిరుగువారం పండుగతో మహా జాతర పరిసమాప్తమవుతుంది. అప్పటిదాకా భక్తులు గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటూనే ఉంటారు. సారలమ్మ గద్దెపై పోలీసు అధికారి మేడారం మహాజాతరలో పోలీసుల అత్యుత్సాహం చివరిరోజు కూడా కొనసాగింది. దేవతల వన ప్రవేశ ఘట్టం మొదలుకాగానే వడ్డెలు గద్దెలపైకి చేరుకుని పూజలు మొదలుపెట్టారు. ఈ సమయంలో స్థానిక ఆదివాసీలు మాత్రమే గద్దెలపై ఉంటారు. అరుుతే మేడారంలో విధులు నిర్వహిస్తున్న ఏటూరునాగారం సీఐ కిశోర్‌కుమార్ అత్యుత్సాహంతో యూనిఫామ్‌తోనే సారలమ్మ గద్దెపైకి ఎక్కారు. ఆదివాసీలు ఎంత చెప్పినా వినలేదు. చివరికి వారు నిరసన తెలపడంతో కిందికి దిగారు. ఇదే సమయంలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య గద్దెల ఆవరణలోకి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తాను ప్రధాన పూజారినని చెప్పినా గేటు తీయలేదు. దీంతో సారయ్య వెనక్కి వెళ్లిపోయారు. కానీ మిగతా పూజారులు సారయ్య ప్రధాన పూజారి అని చెప్పడంతో పోలీసులు వెళ్లి మళ్లీ తీసుకొచ్చారు. జాతరకు ప్రపంచ స్థారుు గుర్తింపు తెస్తాం: దత్తాత్రేయ ఏటూరునాగారం/కాశిబుగ్గ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసానికి మారుపేరైన సమ్మక్క, సారలమ్మ జాతరకు యునెస్కో సహకారంతో ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఆయన శనివారం కుటుంబ సమేతంగా మేడారంలో వన దేవతలను దర్శించుకున్నారు. అనంతరం తన ఎత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించారు. ఈ సందర్భంగా మేడారంలో, వరంగల్‌లో దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడారు. సమ్మక్క, సారలమ్మ తల్లుల మహిమ అమోఘమైనదని, జాతర ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైందని పేర్కొన్నారు. దేశంలో గిరిజన సంప్రదాయానికి ప్రత్యేక పవిత్రత ఉందని, దానిని కాపాడుకుంటూ జాతర నిర్వహించాలని చెప్పారు. ‘మేడారం’ విజయవంతంపై సీఎం హర్షం సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతంగా ముగించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జాతర కోసం రేయింబవళ్లు పనిచేసిన అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయపరిచి జాతరను అద్భుతంగా జరిగేందుకు కృషి చేసిన కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు, వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులకు సీఎం అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోయేవిధంగా సమ్మక్క సారలమ్మలు దీవిస్తారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. జాతర విజయవంతం: ఇంద్రకరణ్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అందరి సహకారాలతో విజయవంతంగా నిర్వహించగలిగామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నామని చెప్పారు. అధికారులు ముందు నుంచి ప్రణాళికతో సాగడంతో జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగలేదని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నెలల ముందునుంచి చేపట్టిన పనులు భక్తులకు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. సమన్వయంతోనే సక్సెస్.. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి జరిగిన మేడారం మహా జాతర విజయవంతమైంది. రెండు నెలల నుంచి భక్తులు వచ్చారు. జాతర నాలుగు రోజులు భారీ సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సౌకర్యాల కల్పనలో సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్ ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో మహా జాతర విజయవంతమైంది..’’ - వాకాటి కరుణ, వరంగల్ జిల్లా కలెక్టర్ -
మేడారం జాతర అద్భుతంగా జరిగింది: కేసీఆర్
హైదరాబాద్: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అద్భుతంగా జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మేడారం జాతర విజయవంతంగా ముగియడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మలను వనప్రవేశానికి పూజారులు తీసుకవెళ్లడంతో మేడారం జాతర ముగిసినట్టు శనివారం అధికారులు ప్రకటించారు. ఈ జాతర నేపథ్యంలో రేయింబవళ్లు పనిచేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో జాతర అద్భుతంగా జరిగిందని కొనియాడారు. వరంగల్ కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. -
ముగిసిన మేడారం జాతర..
► సమ్మక్క-సారలమ్మలను వనప్రవేశానికి తీసుకెళ్లిన పూజారులు ► మేడారం జాతర ముగిసినట్టు ప్రకటించిన అధికారులు ► మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అద్భుతంగా జరిగింది: కేసీఆర్ ► మేడారం జాతర విజయవంతంగా ముగియడంపై కేసీఆర్ ఆనందం ► వరంగల్ కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులకు, సిబ్బందికి కేసీఆర్ అభినందనలు వరంగల్: ఫిబ్రవరి 17 న ప్రారంభమై నాలుగు రోజులపాటు ఘనంగా జరిగిన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర ముగిసింది. సమ్మక్క సారలమ్మలను వనప్రవేశానికి పూజారులు తీసుకెళ్లారు. దాంతో మేడారం జాతర ముగిసినట్టు శనివారం అధికారులు ప్రకటించారు. మేడారం జాతర చివరి రోజు కావడంతో సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారంలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అద్భుతంగా జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మేడారం జాతర విజయవంతంగా ముగియడంపై శనివారం ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ జాతర నేపథ్యంలో రేయింబవళ్లు పనిచేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో జాతర అద్భుతంగా జరిగిందని కొనియాడారు. వరంగల్ కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. గత మూడు రోజులుగా మేడారం భక్తజనంతో మెరిసిపోయింది. ఆదివాసీల ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఒకే చోట కొలువుదీరడం తో భక్తులు భారీగా మొక్కులు చెల్లించుకుని తన్మయత్వానికి లోనయ్యారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో రోజంతా రద్దీ కొనసాగింది. జాతరకు రెండు రోజులు ముందుగానే చేరుకున్న భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని ఉన్నారు. బుధవారం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, గురువారం సమ్మక్క గద్దెలపైకి చేరుకోవడంతో గురువారం రాత్రి నుంచి మొక్కులు ఊపందుకున్నాయి. శుక్రవారం రాత్రి వరకు వన దేవతలను దర్శించుకున్న భక్తుల సంఖ్య కోటి దాటినట్లు అధికారులు తెలిపారు. రాజకీయ నేతలు, సినీ నటులు కూడా మేడారం జాతరలో పాల్గొని వనదేవతలను దర్శించుకున్నారు. -
మేడారంలో పోలీసులపై బాబుమోహన్ ఫైర్
వరంగల్: మేడారంలో ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబుమోహన్ పోలీసులపై మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో మేడారం జాతర సందర్భంగా శుక్రవారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి బాబుమోహన్ వచ్చారు. ఈ సమయంలో మేడారం వద్ద గేట్లకు తాళం వేసి ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బాబుమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులే దగ్గర ఉండి బాబుమోహన్‌తో సమ్మక్క-సారలమ్మ దర్శనం చేయించినట్టు సమాచారం. కాగా, ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర జరగనున్న సంగతి తెలిసిందే. -
మేడారానికి పోటెత్తిన లక్షలాది భక్తులు
మేడారం: వరంగల్ జిల్లా మేడారం పండుగ కళను సంతరించుకుంది. అతిపెద్ద గిరిజనోత్సవమైన సమ్మక్క సారలమ్మ వేడుక ప్రారంభమైన తొలిరోజున భారీ సంఖ్యలో తరలివచ్చారు. జాతర నేపథ్యంలో ప్రత్యేకంగా తెలంగాణ ఆర్టీసీ 2,745 బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కల్పించిన బస్సు సర్వీసుల సాయంతో సాయంత్రం ఆరు గంటల వరకు 1,24,238 మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారని టీఎస్ ఆర్టీసీ జేఎండీ జీవీ రమణారావు తెలిపారు. ఈ నెల 20 వరకు కన్నుల పండువగా ఈ జాతర కొనసాగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.