గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
ఎస్‌ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క, సారలమ్మ మినీ జాతర గురువారం రెండో రోజుకు చేరింది. బుధవారం మండమెలిగె పండుగతో జాతర ప్రారంభం కాగా.. రెండో రోజు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
మేడారం, కన్నెపల్లి ఆదివాసీలు, గ్రామస్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మ పూజారులు వారి ఇళ్లలో కూడా అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి జంపన్నవాగు వద్ద స్నానాలు ఆచరించారు. గద్దెల ప్రాంగణంలో మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి మొదలైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment