Mini fair
-
మేడారంలో ప్రత్యేక పూజలు
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క, సారలమ్మ మినీ జాతర గురువారం రెండో రోజుకు చేరింది. బుధవారం మండమెలిగె పండుగతో జాతర ప్రారంభం కాగా.. రెండో రోజు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. మేడారం, కన్నెపల్లి ఆదివాసీలు, గ్రామస్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మ పూజారులు వారి ఇళ్లలో కూడా అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి జంపన్నవాగు వద్ద స్నానాలు ఆచరించారు. గద్దెల ప్రాంగణంలో మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి మొదలైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. -
మురిసిన మేడారం
ఇలవేల్పుల సేవలో ప్రముఖులు జనసంద్రమైన అమ్మల గద్దెలు మూడో రోజూ మేడారం జనసంద్రమైంది.. శుక్రవారం భక్తులు అధికంగా తరలివచ్చి సమ్మక్క-సారలమ్మలకు పసుపు, కుంకుమ, ఎత్తుబంగారం (బెల్లం) సమర్పించారు. గిరిజన సంక్షేమశాఖ, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్ దర్శించుకున్నారు. జాతర ప్రారంభం నుంచి సుమారు 1.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, వనదేవతల సన్నిధిలో హైదరాబాద్‌కు చెందిన వధూవరులు వివాహం చేసుకున్నారు. - మేడారం(తాడ్వాయి) మేడారం భక్తజన సంద్రమైంది. మొక్కులు, పూజలతో పులకించింది. మేడారం మినీ జాతర మూడో రోజు శుక్రవారం రద్దీ విపరీతంగా పెరిగింది. వనదేవతల చల్లని చూపు కోసం భక్తకోటి తరలివచ్చింది. పసుపు, కుంకుమ, ఎత్తుబంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించారు. గిరిజన సంక్షేమశాఖ, పర్యాటకశాఖ మంత్రి అజ్మీర చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్‌లు అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి దేవతల దర్శనానికి వచ్చిన చందూలాల్‌తోపాటు ఎంపీని ఈఓ గోధుమల మల్లేశం, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతించి సత్కారం చేశారు. గతేడాదితో పోల్చితే ఈసారి అధికారులు మెరుగ్గానే ఏర్పాట్లు చేశారని భక్తులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. - మేడారం(తాడ్వాయి)/సాక్షి ఫొటోగ్రాఫర్ హన్మకొండ -
మనసారా మొక్కులు
గద్దెపై నుంచి గుడికి చేరిన సమ్మక్క తల్లి దారిపొడవునా భక్తుల పొర్లు దండాలు కన్నెపల్లిలో ప్రత్యేక పూజలు సారలమ్మకు సుంకు వడ్ల సమర్పణ గిరిజనుల ఇంటింటా సమ్మక్క పండుగ మేడారం మినీ జాతరకు రెండో రోజు గురువారం భక్తులు పోటెత్తారు. సమ్మక్క-సారలమ్మ నామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగారుు. వందలాది వాహనాలతో వనదారులు, వేలాది మందితో ఆలయ గద్దెలు, జంపన్న వాగు చుట్టుపక్కల ప్రదేశాలు కిటకిట లాడారుు.. శివసత్తుల పూనకాలు, భక్తుల మొక్కులతో మేడారం పులకించగా.. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. - ములుగు/ తాడ్వాయి మేడారం (తాడ్వాయి) : మేడారంలో బుధవారం అర్థరాత్రి గద్దెపై కొలువుదీరిన సమ్మక్క తల్లి తిరిగి గురువారం ఉదయం గుడికి చేరుకుంది. మండమెలిగే పండుగ రోజున బుధవారం రాత్రి మేడారంలోని గుడి నుంచి ప్రధాన పూజరి కొక్కెర కృష్ణయ్య పసుపు, కుంకుమలు పట్టుకుని డోలివాయిద్యాలతో గద్దెపై ప్రతిష్టించారు. ఆ రాత్రింతా పూజారులు గద్దెల వద్ద జాగారంతో సంబరాలు జరుపుకున్నారు. తిరిగి ఉదయం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తల్లిని గుడికి చేర్చారు. గద్దె నుంచి తల్లిని గుడికి తీసుకువచ్చే క్రమంలో భక్తులు దారిపొడవునా పొర్లు దండాలు పెట్టారు. తల్లి గుడికి చేరిన అనంతరం పూజారులు తలంటు స్నానాలు ఆచరించారు. మళ్లీ గుడికి చేరుకుని సమ్మక్కకు ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారంలోని గిరిజనులందరూ తమతమ ఇళ్లల్లో సమ్మక్క పండుగ చేసుకున్నారు. సమ్మక్కకు యాటమొక్కు మేడారం గద్దెల వద్ద బుధవారం రాత్రింతా సమ్మక్క పూజారులతో కలిసి జాగారం చేసిన సారలమ్మ పూజారులు గురువారం ఉదయం కన్నెపల్లికి చేరుకున్నారు. సారలమ్మ పూజారి కాక సారయ్య, ఇతర పూజారులు స్నానమాచరించి గుడికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం సమ్మక్కకు సారలమ్మ పూజారులు యాటను మొక్కి బలిచ్చారు. సంప్రదాయబద్ధంగా కులపెద్దలందరికీ పంచి పెట్టారు. వచ్చే బుధవారం తిరుగువారం పండుగ వరకు సారలమ్మ గుడి వద్ద డోలీలతో జాగారం నిర్వహించనున్నారు. సారలమ్మకు సుంకు వడ్లు కన్నెపల్లిలో సారలమ్మకు గిరిజనులు సంకు వడ్లు సమర్పించారు. సోలం వెం కటేశ్వర్లు తల్లి గురువారం వడ్లతో గుడికి వచ్చి పసుపు, కుంకుమ, పూలతో పూజలు నిర్వహించారు. ధాన్యం పండించిన గిరిజనులు సారలమ్మకు ముందుగా సుంకు వడ్లు సమర్పించిన తర్వాతనే అమ్ముకోవడం ఆనవారుుతీగా వస్తోంది. -
మండమెలిగే.. మేడారం వెలిగే...
అర్ధరాత్రి కొలువుదీరిన సమ్మక్క తల్లి సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర షురూ.. సంప్రదాయబద్ధంగా పూజలు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు మండమెలిగే పండుగతో బుధవారం మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ప్రారంభమైంది. భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క తల్లి అర్ధరాత్రి గద్దెపై కొలువు దీరింది. సమ్మక్క గుడి నుంచి ప్రధాన పూజారి కృష్ణయ్య కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని గద్దెపై ప్రతిష్ఠించారు. మొదటి రోజు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి పులకించారు. గిరిజన ఇలవేల్పులైన తల్లులకు చీరసారెతోపాటు పసుపు, కుంకుమ, బెల్లంతోపాటు కానుకలు సమర్పించారు. - మేడారం (తాడ్వాయి) మేడారం (తాడ్వాయి) : మేడారంలో మండమెలిగే పండుగతో బుధవారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర వైభవంగా ప్రారంభమైంది. గిరిజన ఇలవేల్పులైన తల్లులకు పూజారులు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సమ్మక్క ప్రధాన పూజరి కొక్కెర కృషయ్య ఒక్క పొద్దుతో సమ్మక్క గుడ్డిని శుద్ధి చేశారు. సిద్దబోయిన లక్ష్మణ్‌రావు ఇంటి దగ్గర పూజారులందరూ కలిసి మామిడాకుల తోరణాలను తయారు చేశారు. అనంతరం ఆయన ఇంటి నుంచి పసుపు, కుంకుమ, చెంబులో నీళ్లు పట్టుకుని డోలివాయిద్యాలతో సమ్మక్క గుడికి వెళ్లి తల్లి గద్దెకు పసుపు, కుంకుమ పెట్టారు. ఊరు పోలిమేరలోని పోచమ్మగుడిలో పూజలు చేశారు. ఆ తర్వాత గ్రామదేవతకూ పూజలు నిర్వహించారు. అనంతరం సిద్దబోయిన లక్ష్మణ్‌రావు ఇంటి నుంచి మామిడి తోరణాలను తీసుకుని మేడారం ప్రధాన రోడ్డుకు రెండు దారుల్లో దుష్టశక్తులు రాకుండా బురుగు కర్రలతో గజ స్తంభాలు పాతి. మామిడాకుల తోరణానికి మిరప కాయలు, కోడిపిల్ల కట్టారు. ప్రధాన పూజరి కొక్కెర కృష్ణయ్య, పూజారులు సిద్దబోయిన మునేందర్, లక్ష్మన్‌రావు, బొక్కెన్న, మల్లె ల ముత్తయ్య పసుపు, కుంకుమలతో పూజలు చేసి, నీళ్లు, సారాతో రోడ్డుకు అడ్డంగా ఆరగించారు. ఈ తంతు ముగిసిన తర్వాత ఆడపడుచులు పసుపు, కుంకుమలతో గుడిలో సమ్మ క్క గద్దె, పీఠాన్ని అలంకరించారు. సాయంత్రం సమయంలో పూజారులు గుడిలో ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో గుడి నుంచి పూజారి కొక్కెర కృష్ణయ్య మిగతా పూజారులతో కలిసి దేవతను తీసుకొని సమ్మక్క గద్దె వద్ద ప్రతిష్టించారు. గద్దె వద్ద పూజా కార్యక్రమాలు పూర్తయ్యే వరకూ భక్తులు, ఇతరులను ఆల యంలోని ప్రవేశించకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇక రాత్రంతా సమ్మక్క పూజారులు జాగారాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పూజారుల సంఘం మండల అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సారలమ్మ గుడిలో... కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజరి కాక సారయ్య ఒక పొద్దుతో ఉదయం 10 గంటలకు గుడి శుద్ధి చేశారు. హడారాల గుండాలను పసుపు, కుంకుమలతో అలంకరించారు. మామిడి ఆకులతో కంకణాలను తయారు చేసి, పూజా సామగ్రికి కట్టారు. అనంతరం ధూపదీపాలతో నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 11 గంటల సమయంలో సారలమ్మ పూజారులు, గ్రామపెద్దలు సంప్రదాయబద్ధంగా కంకణాలు కట్టుకుని, సాకహనంతో సమ్మక్క గద్దె వద్దకు వెళ్లారు. సమ్మక్క పూజారులకు సాకహనం అప్పగించి జాగారాలతో సంబరాలు జరుపుకున్నారు. చర్ప ఇంటి నుంచి చేలపెయ్యా... మేడారం సమీపంలోని ఊరట్టంలో దివంగత మాజీ ఎమ్మెల్యే చర్ప భోజారావు ఇంటి నుంచి చర్ప కుటుంబ సభ్యులు సమ్మక్క పూజారులతో కలిసి చెలపెయ్యాను సమ్మక్క గద్దెకు డోలివాయిద్యాలతో తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. చేలపెయ్యాను తీసుకురావాడానికి ముం దుగా చర్ప భోజారావు ఇంటి వద్ద కుటుంబ సభ్యులు పండుగ జరుపుకున్నారు. ప్రతి ఏడాది మండమెలిగే పండుగ సందర్భంగా చర్ప భోజారావు ఇంటి నుంచి సమ్మక్క పూజారులు చేలపెయ్యాను ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. -
నేటి నుంచే మినీ జాతర
మినీ జాతరకు ‘మేడారం’ ముస్తాబైంది.. విద్యుద్దీపాలతో సమ్మక్క-సారలమ్మ తల్లుల గద్దెలను అందంగా అలంకరించారు.. బుధవారం నుంచి శనివారం వరకు దారులన్నీ భక్తులతో కిక్కిరిసి పోనున్నారుు.. పది రోజుల ముందు నుంచే వేల సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు.. మంగళవారం ఒక్కరోజే ఐదు వేల మంది దర్శించుకున్నారు.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఎత్తు ‘బంగారం’ సమర్పించారు.. తలనీలాలు ఇచ్చుకున్నారు.. శివసత్తులు పూనకాలతో ఊగారు.. ఈ నాలుగు రోజులు సందడి నెలకొననుంది.. - ములుగు/తాడ్వారుు మేడారం (తాడ్వాయి): మహా జాతర జరిగిన సరిగ్గా ఏడాది తర్వాత మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం మండమెలిగే పండుగతో మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ప్రా రంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచే భక్తుల రాక పెరిగింది. భక్తులతో జంపన్నవాగు పులకించిపోరుుంది. ఒక్కరోజే సుమా రు 5 వేల మంది అడవి తల్లులను దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపారుు. జాతర పరిసరాల్లో దుకాణాలు వెలి శారుు. భక్తులు చీరసారెలు, వనదేవతలకు ఇష్టమైన బంగారాన్ని (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నేడు ఇలా... బుధవారం సమ్మక్క గుడిని పూజారులు శుద్ధి చేస్తారు. ఆడపడుచులు పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి సమ్మక్క గద్దెను అలంకరిస్తారు. అనంతరం దుష్టశక్తులు ప్రభావం చూపకుండా మేడారంలోని రెండు ప్రధాన రహదారుల పొలిమేరల్లో పూజారులు ధ్వజస్తంభాలు పాతి... రోడ్డుకు అడ్డంగా నీళ్లు ఆరగించి... మామిడాకుల తోరణాలు, కోడిపిల్లను కడతారు. అనంతరం సిద్దిబోయిన మునేందర్ ఇంటి నుంచి పసుపు, కుంకుమలతో గుడికి వెళ్లి సమ్మక్కకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆర్ధరాత్రి సమయంలో గుడి నుంచి ప్రధాన పూజరి కొక్కెర కృష్ణయ్య సమ్మక్కను తీసుకుని డోలివాయిద్యాల నడుమ తల్లి గద్దెపై ప్రతిష్టిస్తారు. రాత్రంతా గద్దెలపై జాగారాలతో సంబరాలు జరుపుకుంటారు. గురువారం పొద్దుపొడవక ముందే గద్దెపై నుంచి తల్లిని గుడికి తీసుకొచ్చి పూజలు చేస్తారు. అదేవిధంగా కన్నెపల్లిలో సారలమ్మ గుడిలో బుధవారం ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు గుడిని శుద్ధి చేస్తారు. హడారాల కుండాలను పసుపు, కుంకుమలతో అలంకరించి ధూపదీపాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం పూజలు నిర్వహించిన ఆనంతరం రాత్రి సమయంలో పూజారులు సాక తీసుకుని మేడారం దేవతల గద్దెల వద్ద సమ్మక్క పూజరులకు సాకహనం ఇచ్చిపుచ్చుకుని వారితో కలిసి సంబరాల్లో పాల్గొంటారు. గురువారం ఉదయం కూడా సారలమ్మ గుడిలో పూజలు చేసి మేకపోతు బలిస్తారు. అనంతరం పూజారులు తమ ఇళ్లలో పూజలు చేయడంతో తంతు ముగుస్తుంది.