
మేడారం జాతర అద్భుతంగా జరిగింది: కేసీఆర్
హైదరాబాద్: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అద్భుతంగా జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మేడారం జాతర విజయవంతంగా ముగియడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మలను వనప్రవేశానికి పూజారులు తీసుకవెళ్లడంతో మేడారం జాతర ముగిసినట్టు శనివారం అధికారులు ప్రకటించారు.
ఈ జాతర నేపథ్యంలో రేయింబవళ్లు పనిచేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో జాతర అద్భుతంగా జరిగిందని కొనియాడారు. వరంగల్ కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.