శుక్రవారం పోస్టర్‌ను విడుదల చేస్తున్న సీఎం రేవంత్, సీతక్క, సురేఖ,
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారలమ్మలకు ఆన్‌లైన్ ద్వారా నిలువెత్తు బంగారం (బెల్లం) సమరి్పంచే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం.. అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం తన మనవడు రియాన్‡్ష పేరిట నిలువెత్తు బంగారాన్ని ఆన్‌లైన్ ద్వారా సమర్పించారు. అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఈ సందర్భంగా తన మనవరాలి నిలువెత్తు బంగారాన్ని ఆన్‌లైన్ ద్వారా అమ్మవార్లకు సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
మేడారంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధిస్తూ పోస్టర్
మేడారం మహాజాతరలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ, జాతరను పరిశుభ్రంగా జరుపుకోవాలని భక్తులను కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఓ పోస్టర్‌ను ఆవిష్కరించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment