వరంగల్: మేడారంలో ఆందోల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాబుమోహన్ పోలీసులపై మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో మేడారం జాతర సందర్భంగా శుక్రవారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి బాబుమోహన్ వచ్చారు. ఈ సమయంలో మేడారం వద్ద గేట్లకు తాళం వేసి ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బాబుమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులే దగ్గర ఉండి బాబుమోహన్‌తో సమ్మక్క-సారలమ్మ దర్శనం చేయించినట్టు సమాచారం.
కాగా, ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర జరగనున్న సంగతి తెలిసిందే.
మేడారంలో పోలీసులపై బాబుమోహన్ ఫైర్
Published Fri, Feb 19 2016 6:17 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM
Advertisement
Advertisement