
ప్రభుత్వ ఉద్యోగులకు ‘స్వగృహా’లు
వెబ్‌సైట్ ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అమ్ముడు కాకుండా మిగిలిపోయిన రాజీవ్ స్వగృహ ఇళ్లను ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీపై ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బండ్లగూడ, పోచారం లో ఉన్న వివిధ కేటగిరీలకు చెందిన 3,700 ఫ్లాట్స్‌ను తక్కువ ధరకే ప్రభుత్వ ఉద్యోగుల కు కేటాయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇళ్లు కావాలనుకున్న వారు దరఖా స్తు చేసేందుకు వీలుగా ప్రత్యేక వెబ్‌సైట్ (ఠీఠీఠీ.్టటటఠ్చీజటuజ్చి.ఛిజజ.జౌఠి.జీn)ను శనివారం గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. ఇళ్లు పొందాలనుకున్న ఉద్యోగు లు రూ.లక్ష చెల్లించి ఫ్లాట్‌ను రిజర్వు చేసుకోవచ్చు. ముందు వచ్చిన వారికి ముందు పద్ధతిలో ఇళ్ల కేటాయింపు ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఫ్లాట్లతోపాటు పార్కింగ్ ప్రాంతాన్ని కూడా ఇదే పద్ధతిలో కేటాయించనున్నట్టు తెలిపారు.
ఇళ్లకు సంబంధించి సమగ్ర సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, వాటిని చూసి ఇళ్లను ఎంచుకోవాలన్నారు. సందేహాల నివృత్తికి రాజీవ్ స్వగృహ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. బండ్లగూడలో సిద్ధంగా ఉన్న ఇళ్లకు చదరపు అడుగుకు రూ.1,900, కొన్ని పనులు మిగి లిన ఇళ్లకు రూ.1,700, పోచారంలో రూ.1,700, రూ.1,500గా ధర నిర్ణయించారు. బండ్లగూడలో 2,240, పోచారంలో 1,470 ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. బండ్లగూడలో 1487, 1141, 798, 545 చదరపు అడుగులు, పోచారంలో 1,470, 1,125, 767, 523 చదరపు అడుగుల విస్తీ ర్ణంలో ఫ్లాట్లున్నాయి. కార్యక్రమంలో సీఎస్ ఎస్పీ సింగ్, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, టీఎ న్‌జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, టీఎన్‌జీవో ప్రధా న కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.