rajiv swagruha
-
సర్కారు వారి పాట!
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్మించిన ఇళ్లలో మిగిలిపోయినవి, అసంపూర్తిగా ఉన్నవి, ఓపెన్ ప్లాట్లను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత తొమ్మిది ప్రాజెక్టులను ఎంపిక చేసింది. గతంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ తొమ్మిది ప్రాంతాల్లోని ఫ్లాట్లు, ప్లాట్లకు ధరలను ఖరారు చేసిన నేపథ్యంలో.. నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతోంది. వచ్చే నెలలోనే ఈ తొమ్మిది ప్రాంతాల్లోని ఆస్తులను వేలం వేయనున్నారు. ఇందులో ఒక బీహెచ్‌కే నుంచి 3 బీహెచ్‌కే వరకు ఉన్న 760 ఫ్లాట్లు... 200 గజాల నుంచి 2,200 గజాల వరకు ఉన్న 179 ప్లాట్లు.. అసంపూర్తిగా ఉన్న 5 నుంచి 9 అంతస్తుల 6 టవర్లు (ఇళ్ల సముదాయాలు) ఉన్నాయి. అన్నింటినీ కూడా ఉన్నవి ఉన్నట్టుగా (యథాతథ స్థితిలో) విక్రయించనున్నారు. తర్వాత మిగతా ప్రాజెక్టుల్లోని ఆస్తులను వేలం వేస్తారు. ఈ ఆస్తులు ఎక్కడెక్కడ? ⇒ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ, పోచారంలలో ఫ్లాట్లు ఉన్నాయి. వాటిల్లో కొన్ని పూర్తయినవి, కొన్ని అసంపూర్తివి ఉన్నాయి. బండ్లగూడలో 129 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సెమీ ఫినిష్డ్ స్థాయిలో ఆగిపోయినవి. ఇక ఇప్పటికిప్పుడు గృహప్రవేశం చేసుకునేలా పంతొమ్మిది 2 బీహెచ్‌కే ఫ్లాట్లు, పదకొండు 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ మోడల్ ఫ్లాట్లు కావడంతో వెల్ ఫర్నిష్డ్ కావడం విశేషం. వీటికి కనీస ధర చదరపు అడుగుకు రూ.3 వేలుగా నిర్ణయించారు. 3 బీహెచ్‌కే ఫ్లాట్ల ధర రూ.37.23 లక్షల నుంచి రూ.48.51 లక్షల వరకు పలికే అవకాశం ఉంది. ఇదే తరహాలో మిగతా కేటగిరీల ఫ్లాట్ల ధరలు కూడా ఉంటాయి. ⇒ పోచారంలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 255, 2 బీహెచ్‌కే ఫ్లాట్లు 340, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు 6 ఉన్నాయి. బండ్లగూడ కంటే వీటి ధరలు కొంత తక్కువగా ఖరారు చేశారు. ⇒ కొన్ని ఐదు అంతస్తులు, కొన్ని 9 అంతస్తులతో అసంపూర్తిగా ఉన్న 6 టవర్లను కూడా అమ్మకానికి ఉంచారు. వీటిల్లో ఫ్లాట్లను విడివిడిగా కాకుండా.. మొత్తం భవనాలను గంపగుత్తగా వేలం వేయనున్నారు. ⇒ ఇక చందానగర్‌లో మూడు భారీ టవర్లు నిర్మించేందుకు సిద్ధం చేసిన మూడు భారీ ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇవి 2 వేల గజాల నుంచి 2,200 చదరపు గజాల వరకు విస్తీర్ణంతో ఉన్నాయి. వీటికి కనీస ధరను గజం రూ.40 వేలుగా నిర్ణయించారు. ⇒ 200 గజాల నుంచి 500 గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. నగర శివార్లలోని బహదూర్‌పల్లిలో 69, తొర్రూరులో 514, భూత్పూరు సమీపంలోని పోతులమడుగులో 111, మహబూబ్‌నగర్ పట్టణంలో 45 ప్లాట్లు అమ్మకానికి సిద్ధం చేశారు. అప్పట్లో రూ.1,940 కోట్లు.. ఈసారి రూ.850 కోట్లు! రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా 2022–23లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో స్వగృహ ఫ్లాట్లను వేలం వేసింది. అప్పట్లో ప్రభుత్వానికి రూ.1,940 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి తొలి దఫా వేలం ద్వారా రూ.850 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం బండ్లగూడ, పోచారం ప్రాజెక్టులలో మిగిలిన ఫ్లాట్లన్నింటినీ వేలంలో ఉంచారు. ఇంతకాలం ఆ ఇళ్ల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది. ఇప్పుడు అన్నీ అమ్ముడైతే ఈ భారం తగ్గుతుంది. ఇక గతంలో స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇళ్లు నిర్మించేందుకు సిద్ధం చేసిన స్థలాలనూ ఇప్పుడు వేలానికి పెడుతున్నారు. అవి అమ్ముడైతే ఆ ప్రాజెక్టులు కూడా ముగిసిపోయినట్టే. -
‘స్వగృహ’కు స్వస్తి
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహకు స్వస్తి చెప్పే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణ ప్రాజెక్టులు, భూములను అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని అమ్మితే రూ.3500 కోట్లు సమకూర్చుకునే అవకాశముందని ప్రభుత్వం తేల్చినట్టు తెలిసింది. కొన్ని ఖాళీ భూములు వివాదంలో ఉండగా, మిగతావి అమ్మ కానికి సిద్ధంగా ఉన్నాయి. బండ్లగూడ, పోచారం ప్రాజెక్టులు సహా మరికొన్ని చోట్ల ఉన్న అసంపూర్తి ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా వ్యక్తులకుగానీ, గంపగుత్తగా సంస్థలకు గానీ అమ్మేయనున్నారు. వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నందున ప్రస్తుతం ఆ ఇళ్లకు, ఖాళీగా ఉన్న భూములకు ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఏ ధర నిర్ణయించాలో తేల్చేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక తర్వాత విక్రయ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అప్పుడే అమ్మిఉంటే.. బండ్లగూడ, పోచారంలలో 6 వేలకుపైగా ఇళ్లను ఫ్లాట్ల రూపంలో గతంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ విక్రయించింది. పూర్తిస్థాయిలో సిద్ధమైన ఇళ్లు అప్పట్లో హాట్‌కేకులుగా అమ్ముడుపోయాయి. కానీ, నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆ కార్పొరేషన్ పూర్తిగా గతి తప్పింది. రాజకీయ నేతలు, కొందరు ఉన్నతాధికారులు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడి నిధులు దారి మళ్లించారు. ఫలితంగా చేతిలో డబ్బు లేక మిగతా ఇళ్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయలేకపోయారు. ఈ నెపాన్ని నాటి స్వగృహ కార్పొరేషన్ అధికారులపై నెట్టేసి ఉన్నతాధికారులు, నేతలు చేతులు దులుపుకున్నారు. తర్వాతి ప్రభుత్వాలు ఆ ఇళ్లను పట్టించుకోలేదు. అన్నింటిని సిద్ధం చేసి ఉంటే మంచి ధరలకు అమ్ముడుపోయి, కార్పొరేషన్‌కు నిధులు సమకూరి ఉండేవి. వాటితో మిగతా చోట్ల పనులు జరిపితే అవి కూడా అమ్ముడుపోయేవి. కానీ ఆ చొరవ లేక కార్పొరేషనే దివాలా తీసింది. ఏడాదిన్నర క్రితం ఉన్నవి ఉన్నట్టుగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో విక్రయించారు. బండ్లగూడ, పోచారంలలో మూడు వేల ఫ్లాట్ల విక్రయం ద్వారా రూ.700 కోట్లు సమకూరాయి. తొర్రూరు, బహదూర్పల్లిలతో పాటు ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్‌లాంటి కొన్ని జిల్లాల్లో లేఔట్ల రూపంలో ప్లాట్లు, నల్లగొండ లాంటి ప్రాంతాల్లో కొన్ని అసంపూర్తి ఇళ్లు విక్రయించడం ద్వారా మరో రూ.1300 కోట్లు వచ్చాయి. ► ఇప్పుడు బండ్లగూడ, పోచారంలలో ఇంకా 700 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. బండ్లగూడలో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లు 80, పోచారంలో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లు 300, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 280 వరకు ఉన్నాయి. కొన్ని ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా ఉన్నాయి. వీటిని ఉన్నవి ఉన్నట్టుగా విక్రయించనున్నారు. ► రాష్ట్రవ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఖాళీ స్థలాలున్నాయి. వీటిని గతంలోలాగా లేఔట్లుగా అభివృద్ధి చేసి విక్రయించాలా, గంపగుత్తగా ఎకరాలుగా విక్రయించాలా అన్న విషయాన్ని కమిటీ పరిశీలిస్తోంది. ► గాజులరామారం, బహదూర్‌పల్లి, జవహర్నగర్లాంటి ప్రాంతాల్లో భారీ భవన సముదాయాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని పూర్తిచేస్తే కొనేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీ స్థలాల్లో కాలనీలు నిర్మించినా డిమాండ్ ఏర్పడే పరిస్థితి ఉంది. ఇటీవల ఇదే విషయాన్ని కొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే పెట్టుబడి సమకూర్చటమే ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. దీంతో ఇళ్లను నిర్మించి విక్రయించాలన్న స్వగృహ కార్పొరేషన్ ప్రాథమిక విధానానికి విరుద్ధంగా ఉన్న భూములను అమ్మి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు ఇది మంగళం పాడే నిర్ణయంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. -
రాజీవ్ స్వగృహ టోకెన్ అడ్వాన్స్ చెల్లింపు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బండ్లగూడ, పోచారంలలో నిర్మించిన ఫ్లాట్స్‌ను సొంతం చేసుకునేందుకు వినియోగదారులు టోకెన్ అడ్వాన్స్ చెల్లించే గడువును హెచ్ఎండీఏ పొడిగించింది. ఫిబ్రవరి 15 వరకు అడ్వాన్స్ డిమాండ్ డ్రాఫ్ట్‌లను మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్, ఉర్దూగల్లీ, స్ట్రీట్‌నెం.17, హిమాయత్‌నగర్ హైదరాబాద్‌కు చేరేలా పంపించాలని సూచించింది. అనంతరం ఫ్లాట్స్ కేటాయింపునకు సంబంధించి లాటరీని పారదర్శక విధానంలో నిర్వహిస్తామని తెలిపింది. ప్రస్తుతం పోచారంలో 3 బీహెచ్‌కె ఫ్లాట్స్ 16, 2బీహెచ్‌కే ఫ్లాట్స్ 570, 1 బీహెచ్‌కె ఫ్లాట్స్ 269 ఉన్నాయని తెలిపింది. ఇక బండ్లగూడలో 1బీహెచ్‌కే ఫ్లాట్స్ 344, సీనియర్ సిటీజన్లకు 1 బీహెచ్‌కే ఫ్లాట్స్ 43 ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌కు రూ.3 లక్షలు, 2 బీహెచ్‌కే ఫ్లాట్స్‌కు రూ.2 లక్షలు, 1 బీహెచ్‌కే ఫ్లాట్‌కు రూ.లక్ష చొప్పున టోకెన్ అడ్వాన్స్‌గా చెల్లించాలని కోరింది. -
స్వగృహ వేలం 2.0
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిపెట్టిన సర్కారు.. మరో విడత ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆస్తుల రెండో విడత వేలానికి ఏర్పాట్లు చేస్తోంది. 10 జిల్లాల పరిధిలోని 19 ప్రాంతాల్లో ఉన్న నివాస, వాణిజ్య స్థలాలతోపాటు గృహాల జాబితాలను సిద్ధం చేసింది. తొలి విడతలో 9 జిల్లాల పరిధిలోని రాజీవ్ స్వగృహ ఆస్తులను విక్రయించి, రూ.503 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సర్కారు.. ఈసారి కనీసం రూ.1,000 కోట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. మూడు రోజుల్లో ప్రకటన రెండో విడత స్వగృహ ఆస్తుల వేలానికి ఈ నెల 11న వేలం ప్రకటన జారీ చేయనున్నారు. 14వ తేదీ నుంచే వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఆస్తుల వేలం ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.9 వేల కోట్లను సమకూర్చుకోవాలని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇటీవల గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వేలం వేసి దాదాపు రూ.నాలుగు వేల కోట్లను సమీకరించింది. తాజాగా రెండో విడత స్వగృహ ఆస్తుల వేలం నిర్వహిస్తోంది. ప్లాట్లు, ఇళ్లతోపాటు ఖాళీ స్థలాలు కూడా.. ఈ–వేలంతో పాటు భౌతికంగా నేరుగానూ వేలం నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరు, తుర్కయాంజల్, కుర్మాలగూడ, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా బహదూర్‌పల్లి ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ ప్లాట్లతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్ లేఅవుట్లోని కమర్షియల్ ప్లాట్లకు హెచ్ఎండీఏ ఆన్లైన్ ద్వారా వేలం నిర్వహించనుంది. రంగారెడ్డి జిల్లా చందానగర్, కవాడిపల్లిలోని ప్లాట్లకు టీఎస్ఐఐసీ ఆన్లైన్ ద్వారా వేలం జరపనుంది. ఆదిలాబాద్ జిల్లాలోని బీఎస్ గావ్, మహబూబ్‌నగర్ జిల్లాలోని అమిస్తాపూర్, పోతులమడుగు, నిజామాబాద్ జిల్లాలోని మల్లారం, కామారెడ్డి జిల్లాలోని అడ్లూరు, నల్లగొండ జిల్లాలోని ఎల్లారెడ్డిగూడ, కరీంనగర్ జిల్లాలోని నుస్తులాపూర్లలోని ప్లాట్లు.. వికారాబాద్ జిల్లాలోని ఆలంపల్లి, గంగారాం ప్రాంతాల్లోని రెండు ఖాళీస్థలాలకు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సాధారణ వేలం నిర్వహించనున్నారు. ఖమ్మం టౌన్‌షిప్‌లోని 6.9 ఎకరాల ఖాళీ స్థలానికి స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎకరాకు రూ.3 కోట్ల కనీస ధరతో వేలం పాట చేపడతారు. నివాస ప్లాట్లకు కనీస ధర (అప్సెట్ ప్రైస్)గా చదరపు గజానికి.. జిల్లాల్లో రూ.7 వేల నుంచి రూ.12 వేలు, హెచ్ఎండీఏ/టీఎస్ఐఐసీ పరిధిలో రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు ఖరారు చేశారు. గృహాల విషయానికి వస్తే.. చదరపు గజానికి రూ.10,500, రూ.12 వేలు కనీస ధర నిర్ణయించారు. వేలానికి అంతా సర్వ సన్నద్ధం రాజీవ్ స్వగృహ ఆస్తుల వేలంపై రాష్ట్ర ప్రభుత్వ ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ అధికారులు, సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ అధికారులు, జిల్లా కలెక్టర్లు వేలానికి సర్వ సన్నద్ధంగా ఉన్నట్టు సీఎస్‌కు నివేదించారు. వేలం వేయనున్న ఆస్తుల వివరాలు, లేఅవుట్లు, సైట్ ఫోటోలు, వేలం విధానం తదితర వివరాలను సంబంధిత సంస్థ వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా అరవింద్ కుమార్ ఆదేశించారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు ‘స్వగృహా’లు
వెబ్సైట్ ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: అమ్ముడు కాకుండా మిగిలిపోయిన రాజీవ్ స్వగృహ ఇళ్లను ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీపై ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బండ్లగూడ, పోచారం లో ఉన్న వివిధ కేటగిరీలకు చెందిన 3,700 ఫ్లాట్స్‌ను తక్కువ ధరకే ప్రభుత్వ ఉద్యోగుల కు కేటాయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇళ్లు కావాలనుకున్న వారు దరఖా స్తు చేసేందుకు వీలుగా ప్రత్యేక వెబ్సైట్ (ఠీఠీఠీ.్టటటఠ్చీజటuజ్చి.ఛిజజ.జౌఠి.జీn)ను శనివారం గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. ఇళ్లు పొందాలనుకున్న ఉద్యోగు లు రూ.లక్ష చెల్లించి ఫ్లాట్‌ను రిజర్వు చేసుకోవచ్చు. ముందు వచ్చిన వారికి ముందు పద్ధతిలో ఇళ్ల కేటాయింపు ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఫ్లాట్లతోపాటు పార్కింగ్ ప్రాంతాన్ని కూడా ఇదే పద్ధతిలో కేటాయించనున్నట్టు తెలిపారు. ఇళ్లకు సంబంధించి సమగ్ర సమాచారం వెబ్సైట్లో పొందుపరిచామని, వాటిని చూసి ఇళ్లను ఎంచుకోవాలన్నారు. సందేహాల నివృత్తికి రాజీవ్ స్వగృహ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. బండ్లగూడలో సిద్ధంగా ఉన్న ఇళ్లకు చదరపు అడుగుకు రూ.1,900, కొన్ని పనులు మిగి లిన ఇళ్లకు రూ.1,700, పోచారంలో రూ.1,700, రూ.1,500గా ధర నిర్ణయించారు. బండ్లగూడలో 2,240, పోచారంలో 1,470 ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. బండ్లగూడలో 1487, 1141, 798, 545 చదరపు అడుగులు, పోచారంలో 1,470, 1,125, 767, 523 చదరపు అడుగుల విస్తీ ర్ణంలో ఫ్లాట్లున్నాయి. కార్యక్రమంలో సీఎస్ ఎస్పీ సింగ్, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, టీఎ న్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో ప్రధా న కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్వగృహాలు’ కావాలంటే ధర కోట్ చేయండి
టీఎన్జీఓలకు ఈ-వేలం ఆఫర్ సీఎస్ ఆధ్వర్యంలో జరిగిన హైలెవల్ కమిటీ సమావేశంలో నిర్ణయం అవి ఆమోదయోగ్యంగా ఉంటాయో లేవో అప్పుడు చెబుతారట ప్రభుత్వపరంగా ధర నిర్ణయించకుండా దోబూచులాట సాధారణ ప్రజలకు మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్న రేట్లనే వర్తింపు సాక్షి, హైదరాబాద్: ఓ ప్రాజెక్టుకు మంచి డిమాండ్ ఉన్నప్పుడు వేలం నిర్వహించటం కద్దు. ఓ ప్రభుత్వ భూమి కోసం నలుగురైదుగురు పోటీ పడుతున్నప్పుడు ఎవరెక్కువ ధర చెల్లించేందుకు ముందుకొస్తే వారికి కేటాయించేందుకు ఆక్షన్ నిర్వహించిన దాఖలాలున్నాయి. కానీ కొనేవారు లేక దాదాపు రెండేళ్లుగా తెల్ల ఏనుగుల్లా మూలుగుతున్న ‘రాజీవ్ స్వగృహ’ ఇళ్లను వేలం ద్వారా అమ్మాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించటం చర్చనీయాంశంగా మారింది. సాధారణ ప్రజలు కొనాలంటే మాత్రం ప్రస్తుతం అమలులో ఉన్న ధరే చెల్లించాలని, టీఎన్జీఓలకు రాయితీ ధరలకు వాటిని అమ్మనున్నట్టు ఇటీవల ముఖ్యమంత్రి చె.చంద్రశేఖరరావు ప్రకటించిన నేపథ్యంలో... వారికి వేలం పద్ధతిలో అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయితీ ధరలపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన రాజీవ్‌స్వగృహ ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది. ధర వెల్లడించొద్దు... రాజీవ్ స్వగృహ ఇళ్ల ధరలను కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం తగ్గించింది. ఎస్కలేషన్ పేర కాంట్రాక్టర్లకు గతంలో దాదాపు రూ.100 కోట్లను అదనంగా చెల్లించిన నేపథ్యంలో ఆ భారాన్ని కొనుగోలుదారులపై మోపేందుకు 2013 డిసెంబరులో గుట్టుచప్పుడు కాకుండా ఇళ్ల ధరలను పెంచారు. దీంతో ఇటీవల ధరలను స్వల్పంగా తగ్గించినా కొనుగోలుదారులకు పెద్దగా ప్రయోజనం లేదు. ఇదే సమయంలో టీఎన్జీవోలకు రాయితీధరలకు ఇళ్లను కేటాయించనున్నట్టు సీఎం ప్రకటించడంతో హైలెవల్ కమిటీ సోమవారం భేటీ అయింది. టీఎన్జీవోలు చదరపు అడుగు ధర రూ.1500 వరకు ఉండేలా సవరించాలని కోరుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది.అంతతక్కువ ధర నిర్ణయిస్తే ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లనున్నందున అంతకంటే ఎక్కువ ధర ఉండాలని ఇందులో అభిప్రాయపడ్డారు. ఆ ధర ఎంత అనే విషయంపై ముం దుగా ఓ నిర్ణయానికి రావటం కంటే, టీఎన్జీఓలు వాస్తవంగా ఎంత ధర పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారో పరిశీలించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఈ-వేలం ద్వారా ఇళ్లను అమ్మనున్నట్టు ప్రకటన ఇచ్చి, వారిని దరఖాస్తు చేసుకునేందుకు ఆహ్వానిస్తారు. బండ్లగూడ, పోచారం ప్రాజెక్టులకు ఈ వెసులుబాటు కల్పించారు. కొనాలనుకునే టీఎన్జీఓ సభ్యులు స్వయంగా ఇళ్లను పరిశీలించి, మార్కె ట్ ధరలను తెలుసుకొని ఆ ఇంటికి ఎంత ధర పెట్టాలనుకుంటున్నారో ఈ-వేలం ద్వారా కోట్ చేసేలా సూచించాలని పేర్కొన్నారు. అలా వచ్చే కొటేషన్లను పరిశీలించి ఆ ధరలు ఆమోదయోగ్యంగా ఉన్నాయో లేవో పరిశీ లించి సీఎం ముందుంచనున్నారు. ఈ విధానా న్ని టీఎన్జీఓలకు మాత్రమే వర్తింపజేస్తారు. ఆ ధరలు ఆమోదయోగ్యం కాని పక్షంలో ప్రభుత్వపరంగా స్వగృహకు ‘రాయితీ’లు ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే బ్యాంకు లోన్లు, వాటికి చెల్లిస్తున్న వడ్డీలు తడిసిమోపెడైన నేపథ్యంలో తక్కువ ధరలను ఖరారు చేస్తే స్వగృహపై భారం పడి తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని అధికారులు సీఎస్ దృష్టికి తెచ్చారు. కేటాయించిన భూములకు గాను ‘స్వగృహ’ నుంచి రుసుము వసూలు చేయరాదని నిర్ణయిస్తే ధరలను తగ్గించేందుకు వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. దానికి సీఎం నుంచి ఆమోదం వస్తేనే ఇళ్లను తక్కువ ధరలకు ఖరారు చేయనున్నారు. ఈ-వేలానికి సంబంధించి పక్షం రోజు ల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సాధారణ ప్రజలు మాత్రం ఇళ్లను కొనాలంటే అధికారులు ఇప్పటికే నిర్ధారించిన ధరలే వర్తిస్తాయని అధికారులు తేల్చారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
వీధినపడ్డ రాజీవ్ స్వగృహ లబ్దిదారులు