
రెడ్డి సామాజికవర్గ అభివృద్ధికి కృషి
రెడ్డి సామాజికవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.
► మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
► నిర్మల్‌లో రెడ్డి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా సమావేశం
నిర్మల్ టౌన్ : రెడ్డి సామాజికవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. రెడ్డి ఫంక్షన్ హాలులో ఆదివారం రెడ్డి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఐకేరెడ్డి హాజరై మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి సామాజికవర్గ విద్యార్థుల సంక్షేమంతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ‘రేవ’ ఆధ్వర్యంలో అన్ని వర్గాల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా చదువులో ప్రతిభ కనబరుస్తున్న 8 మంది విద్యార్థులను సన్మానించారు.
అలాగే 50 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం రెడ్డి ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. రెడ్డి హెల్ప్‌లైన్ ఐపీఎస్ కేవీరెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, కౌన్సిలర్ భూపతిరెడ్డి, రెడ్డి ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు మోహన్ రెడ్డి, హంసలత, మనోహర్‌రెడ్డి, గంగారెడ్డి, జీవన్ రెడ్డి, అన్నపూర్ణ, ప్రవీణ్‌రెడ్డి, లక్ష్మి ప్రసాద్‌రెడ్డి, మురళీమనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.