Devender Reddy
-
ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు జాతీయ గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. టాప్ ఎక్స్పోర్ట్ అవార్డ్ ఆఫ్ క్యాపెక్సిల్ అవార్డును సొంతం చేసుకుంది. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డికి లోక్‌సభాపతి ఓంబిర్లా ఈ అవార్డును అందజేశారు. అనంతరం దేవేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేయడంలో పురోగతి సాధించినట్టు చెప్పారు. ఏపీ ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్ కలప ఆధారిత, అటవీ ఆధారిత పరిశ్రమలతో పాటు బీడీ ఆకు, ఎర్రచందనం వ్యాపారం చేసే ఒక ఏజెన్సీగా పనిచేస్తోందన్నారు. ఎకో టూరిజాన్ని కూడా కార్పొరేషన్ ప్రొత్సహిస్తోందని తెలిపారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల సగటు ఉత్పత్తితో 35 వేల హెక్టార్లలో యూకలిప్టస్ను పెంచుతున్నట్టు చెప్పారు. 6 వేల హెక్టార్లలో జీడి మామిడి, 4 వేల హెక్టార్లలో కాఫీ, మిరియాలు, 2,500 హెక్టార్లలో వెదురు, 825 హెక్టార్లలో టేకు, 1000 హెక్టార్లలో ఇతర వాణిజ్య పంటల్ని ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు. 5,353 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించి సుమారు రూ.2 వేల కోట్లు సమీకరించామని, 2023లో ఇప్పటి వరకూ రూ.218 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని సాధించామని, మరో రూ.250 కోట్లు సాధించే దిశగా ముందుకెళుతున్నట్టు తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి కార్పొరేషన్ ‘త్రీస్టార్ ఎక్స్పోర్ట్ హౌస్’ హోదాను పొందిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో, ఆయన దిశానిర్దేశంలో కార్పొరేషన్ మరిన్ని విజయాలు సాధిస్తుందని దేవేందర్‌రెడ్డి వివరించారు. -
దుర్గమ్మపై ఆన.. లంచం తీసుకోలేదు
పాపన్నపేట (మెదక్): ఏడుపాయల వనదుర్గ ఆలయం గురువారం బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు.. ప్రతి సవాళ్లు, ప్రమాణాలకు వేదికైంది. బీఆర్ ఎస్‌లోని రెండు వర్గాలు తడి బట్టలతో ఒకరు.. పసుపు బట్టలతో మరొకరు అమ్మవారి ఎదుట ప్రమాణాలు చేశారు. ‘నా రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదని వన దుర్గమ్మ మాత ఎదుట ప్రమాణం చేస్తున్నా. తప్పు చేసినట్లు నిరూపిస్తే మెదక్ రాందాస్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా’ అంటూ ఇఫ్కో డైరెక్టర్, మెదక్ ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్‌రెడ్డి ఏడు పాయల వనదుర్గ అమ్మవారి ఎదుట గురువారం ప్రమాణం చేశారు. తాను ప్రకటించినట్లుగా 150 మంది కార్యకర్తలతో ఆలయానికి చేరుకున్నారు. మంజీరా నదిలో స్నానం చేసి రాజగోపురంలోని దుర్గమ్మ ఉత్సవ విగ్రహం వద్ద పూజలు చేసి ప్రమా ణం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ కోనాపూర్ సొసైటీలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, భూకబ్జాలు, ఇసుక దందాలు, భూపంచాయితీలు, సెటిల్మెంట్లు చేయలేదన్నారు. సామాజికసేవ కోసం కాంట్రాక్టర్లు, అధికారుల సహాయం తీసుకున్నానే తప్ప ఎవరినీ బెదిరించలేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్పారు. వందల ఎకరాల భూములు కొన్నారు... దైవ సన్నిధిలో చేసిన అసత్య ప్రమాణాలతో దేవేందర్‌రెడ్డి పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ అసమ్మతి నేతలు అన్నారు. దేవేందర్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన అసమ్మతి నాయకులు మడూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, చిన్నశంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ, సర్పంచ్ రాజారెడ్డి, అడ్వొ కేట్ జీవన్‌రావు తదితరులు 100 మందితో కలిసి గురువారం ఏడుపాయలకు చేరుకున్నారు. పసుపు బట్టలతో ఆలయంలోకి వచ్చి పూజలు చేసి అమ్మ వారి సన్నిధిలో ప్రమాణం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవేందర్‌రెడ్డి తన భూదందాలు, ఇసుక మాఫియా, లంచాలు, కోనాపూర్ సొసైటీ వ్యవహారం, అక్రమ సంపాదనపై జవాబు చెప్పకుండా అమ్మవారి ఎదుట అసత్య ప్రమాణం చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన అఫిడవిట్‌తో తాము వచ్చామని పేర్కొన్నారు. రూ.కోట్ల అవినీతిపై కాకుండా కేవలం ఏడుపాయల విషయంపై స్పందించడాన్ని ప్రజలు గమనించాలన్నారు. శంకరంపేట, నర్సాపూర్, మెదక్‌తో పాటు కామారెడ్డి జిల్లాల్లో వందల ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు. ఏ హోదాలో కలెక్టర్ పక్కన కూర్చొని సమావేశాల్లో సమీక్షలు చేస్తున్నారని ప్రశ్నించారు. మెదక్ డెయిరీ పేరిట కార్యకర్తల నుంచి రూ. లక్ష చొప్పున వసూలు చేసిన రూ. కోటి సొమ్మును ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మెదక్ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని మార్చకపోతే రెబల్ అభ్యర్థిని పోటీకి దింపక తప్పదని హెచ్చరించారు. -
రేపటి నుంచి షర్మిల ప్రజాప్రస్థానం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రకు రేపు శ్రీకారం చుడుతున్నారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్‌రెడ్డి పాదయాత్ర వివరాలను మీడియాకు వెల్లడించారు. షర్మిల పాదయాత్ర దాదాపు 400 రోజులు.. 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సాగుతుందన్నారు. 14 పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో కొనసాగుతుందని చెప్పారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. 9 ప్రాంతాల్లో బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రోజూ సాయంత్రం పలు సమస్యల పరిష్కారంపై షర్మిల స్థానిక నాయకులు, ప్రజలతో భేటీ అవుతారని చెప్పారు. రచ్చబండ తరహాలో ప్రజలతో మాటముచ్చట కార్యక్రమం సాగుతుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో మూడు మండలాలను కలుపుకొనిపోయేలా రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా షర్మిల పా దయాత్ర సాగుతుందన్నారు. ప్రతి మంగళవారం పాదయాత్ర ఎక్కడ జరుగుతుంటే అక్కడే నిరుద్యోగ నిరాహార దీక్ష జరుగుతుందని వెల్లడించారు. నేడు తల్లి విజయమ్మతో ఇడుపులపాయకు.. తన తల్లి విజయమ్మతో కలసి షర్మిల మంగళవారం ఉదయం ఇడుపులపాయ వెళ్తారు. అక్కడ వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, ఇడుపులపాయకు వెళ్తున్న నేపథ్యంలో నేడు జరగాల్సిన నిరుద్యోగ నిరాహార దీక్షను వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. షర్మిలను ఆదరించండి.. రాజన్న అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కోసం.. మీ కోసం మీ రాజన్న బిడ్డ షర్మిల చేపడుతున్న ప్రజాప్రస్థానం పాదయాత్రను ఆదరించాలని వైఎస్ విజయమ్మ ప్రజలకు పిలుపునిచ్చారు. షర్మిల పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆమె సోమవారం ఓ సందేశాన్ని విడుదల చేశారు. చేవెళ్ల నుంచి ప్రారంభించనున్న షర్మిల పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. షర్మిల అడుగులో అడుగు వేసి ఓ ప్రభంజనాన్ని సృష్టించాలన్నారు. -
మాజీ మంత్రి ఇంటికి రేవంత్.. పార్టీలోకి ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ఏఐసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ఉన్నారు. ఈ సందర్బంగా దేవేందర్ గౌడ్‌తో పాటు ఆయన ఇద్దరు కుమారులు వీరేందర్ గౌడ్, విజయేందర్ గౌడ్లతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ముగ్గురిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘ తెలంగాణలో కారు దారి తప్పింది. కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణలో భాగంగా అందరినీ కలుస్తాం. తెలంగాణ భవిష్యత్తు కార్యాచరణ కోసం పని చేస్తాం. తెలంగాణకు పట్టిన గులాబీ చీడ వదిలిస్తాం. డబుల్ బెడ్ రూం, దళితులకు మూడెకరాల లాంటి సంక్షేమం పేదలకు దూరం అయ్యింది. తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి దేవేందర్ గౌడ్’ అని అన్నారు. -
ఐ అండ్ పీఆర్ చీఫ్ డిజిటల్ డైరెక్టర్‌గా దేవేందర్ రెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల విభాగం చీఫ్ డిజిటల్ డైరెక్టర్‌గా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవేందర్ రెడ్డి ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్‌గా పార్టీకి విస్తృత ప్రచారం కల్పించారు. -
రైతుబంధును గల్ఫ్ కార్మికులకు కూడా వర్తింపచేయండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతుబంధు పథకాన్ని గల్ఫ్ వెళ్లిన రైతులకు కూడా వర్తింప చేయాలని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాలలో ఉన్న సుమారు ఒక లక్షమంది సన్నకారు, చిన్నకారు రైతులకు వర్తింపచేయాలని మాజీ దౌత్యవేత్త, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి డా. బీ.ఎం.వినోద్ కుమార్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ (ప్రవాసి సంక్షేమ వేదిక) అధ్యక్షులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి ఆదివారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. దీనిపై గతంలోనే ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. వలస వెళ్లిన వారిలో వ్యవసాయం దెబ్బతిని, బోర్లు తవ్వించి అప్పులపాలై పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లినవారే ఉన్నారని వారు అన్నారు. భూమిని నమ్ముకుని బతికిన బక్క రైతులు వ్యవసాయం దెబ్బతినడం మూలంగానే విదేశాలకు వెళ్లారని, అలాంటి వారిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి కోరారు. ‘‘ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి రైతులందరికీ కొత్త పాసుపుస్తకాలు, ఎకరాకు పంటకు రూ.4 వేల చొప్పున పెట్టుబడిసాయం, ప్రతీ రైతుకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. కానీ విదేశాలకు వలస వెళ్లిన బడుగు రైతులకు ఈ సాయం అందక ముఖ్యంగా గల్ఫ్‌కు వెళ్లిన వలసకార్మికులు నష్టపోతున్నారు. స్వయంగా భూ యజమాని వచ్చి తమ పేరిట ఉన్న పాసుపుస్తకాన్ని, రైతుబంధు చెక్కు అందుకోవాలని, బీమా ఫారంపై సంతకం చేయాలనే నిబంధన వలసరైతుల పాలిట శాపమైంది. గల్ఫ్ దేశాల నుండి ప్రత్యేకంగా ఇందుకోసం రావాయాలంటే ఎంతో వ్యయంతో కూడుకున్న పని’’అని వారు అభిప్రాయపడ్డారు. ఈమేరకు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ‘‘రైతుబంధు పెట్టుబడిసాయం చెక్కులను గల్ఫ్ వెళ్లిన రైతుల ఎన్ఆర్ఓ (నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) బ్యాంకు అకౌంట్లలో లేదా వారి కుటుంబ సభ్యుల అకౌంట్లలో జమచేయాలి. మండల వ్యవసాయ అధికారి లేదా తహసీల్దార్ ఎన్నారై రైతుల నుండి ఇ-మెయిల్ ద్వారా ఒక అంగీకార పత్రాన్ని తెప్పించుకోవాలి. ఎన్నారై రైతుల వ్యవహారాలను చూడటానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి’’ అని పేర్కొన్నారు. -
ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం
మెదక్ మున్సిపాలిటీ: ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని విస్మరించాయని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందని చెప్పారు. ముఖ్యంగా వైద్య సేవలపై దృష్టి సారించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ...ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించని పేదలను ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆదుకుంటున్నట్లు తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 2500మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆదుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ కింద 41మందికి రూ.11.68లక్షలు అందజేశారు. మెదక్ మండల పరిధిలోని పాతూర్ గ్రామానికి చెందిన సత్తమ్మకు రూ.12.500, రాజ్‌పల్లి గ్రామానికి చెందిన సిద్దమ్మకు రూ.15,500, రాయిన్‌పల్లి గ్రామానికిచెందిన సిహెచ్.యశోధకు రూ.42,500, మాచవరం గ్రామానికి చెందిన మమతకు రూ.25వేలు, నవాబుపేటకు చెందిన నందమ్మకు రూ.25,500, దాయరవీధికి చెందిన పోచమ్మకు రూ.14వేలు, హౌజింగ్‌బోర్డుకు చెందిన నరేందర్‌రెడ్డికి రూ.22,500, ఫత్తేనగర్ వీధికి చెందిన ప్రవీణ్‌కు రూ.10వేలు, వెంకటేశంకు రూ.60వేలు, చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన నవీన్‌రెడ్డికి రూ.16,500, ఇదే మండలం మడూర్కు చెందిన సంతోష్‌కు రూ.37,500, రామాయంపేటకు చెందిన లక్ష్మయ్యకు రూ.60వేలు, పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటకు చెందిన దుర్గమ్మకు రూ.20వేలు, ఢాక్యాతండాకు చెందిన మరొకరికి రూ.15వేల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ వైస్‌చైర్మన్ రాగి అశోక్, టీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్‌గౌడ్, కోఆప్షన్ సభ్యుడు సాధిక్, టీఆర్ఎస్ నాయకులు ఉమర్, దత్తు, మహ్మద్, రామస్వామి, లింగారెడ్డి, జయరాంరెడ్డి, గడిలశ్రీనివాస్రెడ్డి, దుర్గయ్య, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
రెడ్డి సామాజికవర్గ అభివృద్ధికి కృషి
► మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ► నిర్మల్‌లో రెడ్డి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా సమావేశం నిర్మల్ టౌన్ : రెడ్డి సామాజికవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. రెడ్డి ఫంక్షన్ హాలులో ఆదివారం రెడ్డి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఐకేరెడ్డి హాజరై మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి సామాజికవర్గ విద్యార్థుల సంక్షేమంతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ‘రేవ’ ఆధ్వర్యంలో అన్ని వర్గాల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా చదువులో ప్రతిభ కనబరుస్తున్న 8 మంది విద్యార్థులను సన్మానించారు. అలాగే 50 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం రెడ్డి ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. రెడ్డి హెల్ప్‌లైన్ ఐపీఎస్ కేవీరెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, కౌన్సిలర్ భూపతిరెడ్డి, రెడ్డి ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు మోహన్ రెడ్డి, హంసలత, మనోహర్‌రెడ్డి, గంగారెడ్డి, జీవన్ రెడ్డి, అన్నపూర్ణ, ప్రవీణ్‌రెడ్డి, లక్ష్మి ప్రసాద్‌రెడ్డి, మురళీమనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నలుగురి కథ
నలుగురు యువకులు ఓ లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగుపెడతారు. డబ్బు సంపాదన కోసం వారు ఎలాంటి మార్గం ఎంచుకున్నారు? సరైన దారిలో నడిచారా? లేదా? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సత్య గ్యాంగ్’. ప్రత్యూష్ వి.ఆర్, హర్షితా పన్వర్, కిషన్ కన్నయ్య కె.కె, సాత్విక్, సిరికొమ్ము ప్రధాన పాత్రల్లో ప్రభాస్ నిమ్మలను దర్శకత్వంలో మహేశ్ కన్నా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైద రాబాద్‌లో జరిగింది. దర్శకుడు సముద్ర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత మల్కాపురం శివకుమార్ కెమెరా స్విచాన్ చేయగా, తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. నిర్మాతలు బి. కాశీవిశ్వనాథం, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మా చిత్ర దర్శకుడు, సముద్ర గారి వద్ద పనిచేశాడు. తను రాసుకున్న కథ నచ్చడంతో నిర్మిస్తున్నాం’’ అని మహేశ్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అడుసుమిల్లి విజయకుమార్, సహ నిర్మాతలు: ఎస్.మంగారావు-చలపతి, కథ,-స్క్రీన్‌ప్లే-సంగీతం-మాటలు-దర్శకత్వం: ప్రభాస్ నిమ్మల. -
నవతెలంగాణ సమాజం ఫౌండర్‌తో చిట్ ఛాట్!
-
జూబ్లీహిల్స్ క్లబ్ అధ్యక్షుడిగా దేవేందర్‌రెడ్డి
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ పాలక కమిటీ ఎన్నికల్లో టి. దేవేందర్‌రెడ్డి ప్యానల్ ఘనవిజయం సాధించింది. తన ప్రత్యర్థి జైవీర్‌రెడ్డిపై దాదాపు 951 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. దేవేందర్‌రెడ్డితో పాటుగా సభ్యులు సైతం సుమారు 900 పైచిలుకు మెజారిటీతోనే ఈ విజయం దక్కించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ పాలక వర్గానికి ఆరేళ్ల తర్వాత ఎన్నికలు ఆదివారం క్లబ్ సెక్రటరీ హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్యానల్ పోటీ పడ్డాయి. దేవేందర్‌రెడ్డి అధ్యక్షునిగా జగ్గారావు, రమేష్‌చౌదరి, శ్రీనివాస్‌రెడ్డి, విద్యాసాగర్‌లు సభ్యులుగా బరిలో నిలిచారు. మరో ప్యానల్ జూవీర్‌రెడ్డి అధ్యక్షతన అశోక్‌రెడ్డి, కిషన్‌రావు, ఏవీఆర్‌కే. ప్రసాద్, డాక్టర్. జీఆర్‌యం. రెడ్డిలు ఎన్నికల్లో పోటీ చేశారు. సంయుక్త కార్యదర్శిగా పీఎస్.రెడ్డి సంయుక్త కార్యదర్శిగా ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భాగంగా క్లబ్‌లోని 2560 మంది ఓటు హక్కు ఉన్న సభ్యుల్లో 1863 మంది వారి ఓటు వేశారు. అంతకుముందు ఈవీయం మిషన్లతో ఏర్పాటు చేసిన ఈ ఎన్నికల్లో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, నరేంద్రచౌదరి, సీవీ.రావు తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేవేందర్‌రెడ్డి ప్యానల్ విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించిన అనంతరం ప్యానల్ ఆధ్వర్యంలో క్లబ్ ముందు బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ క్లబ్ తో పాటు సభ్యులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. కోశాధికారి జగ్గారావును ఎకగ్రీవంగా ఎన్నుకున్నట్లు దేవేందర్‌రెడ్డి ప్రకటించారు. -
‘ఖాకీ’ కబ్జాలో కేయూ భూమి
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని ఓ ఖాకీ కబ్జా చేశాడు. సుమారు వేయి గజాల భూమి తనదేనంటూ మంగళవారం చదును చేసే కార్యక్రమం చేపట్టాడు. కేయూ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని భూమి యూనివర్సిటీదేనని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా.. సదరు సీఐ వారి మాటను బేఖాతరు చేయడమేగాక స్థానిక సీఐని అవమానించాడు. దీనికి సంబంధించినవివరాలు ఇలా ఉన్నాయి. పలివేల్పుల శివారులోని సర్వే నంబర్ 413లో కేయూకు సంబంధించిన భూమి ఉంది. అయితే ఆ భూమిని కొందరు వ్యక్తు లు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు.దీంతో కేయూసీ అధికారులు ఇటీవల ల్యాండ్ సర్వే అధికారులతో కొలతలు వేయించి హద్దులు నిర్ధారించారు. భూమి కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు ప్రహారీ నిర్మాణ పను లు చేపట్టడానికి ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న నగర పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఓ సీఐ అక్కడికి చేరుకుని యంత్రాలతో భూమి చదును చేసే కార్యక్ర మం చేపట్టాడు. అందులో వేయి గజాల భూ మి కొనుగోలు చేసినట్లు కేయూ అధికారులకు తెలిపాడు. సర్వే చేసిన రికార్డు తమ వద్ద ఉం దంటూ కేయూ అధికారులు ఎంత చెప్పినా ఆయన వినలేదు. డబ్బులు ఇచ్చి భూమి కొనుగోలు చేశా.. ఇది ఆక్రమించింది కాదంటూ ఎదురుతిరిగాడు. దీంతో పరిస్థితి ఉద్రి క్తంగా మారింది. సద రు సీఐ, అధికారుల మధ్య మా టమాట పెరిగింది. సమాచా రం అందుకున్న రిజిస్ట్రార్ సాయిలు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే సీఐపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న కేయూ సీఐ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేయూ సీఐపై మండిపాటు.. ఇది కేయూకు చెందిన భూమేనని సీఐ దేవేందర్‌రెడ్డి చెప్పినందుకు భూమి అక్రమించుకున్న సీఐ ఆయనతో వాగ్వాదానికి దిగారు. సివిల్ తగదాలో పోలీసుల జోక్యం ఏమిటం టూ ఎదురు ప్రశ్నించారు. ఓ సీఐగా ఉండి.. తోటి సీఐకి సహకరించవా.. అంటూ మండిపడ్డాడు. అంతేగాక కేయూ సీఐని అవమానకరమైన పదజాలంతో దూషించాడు. నీ వద్ద ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే చూపించమని కోరినా సదరు సీఐ చూపించలేదు. చివరికి సీఐ దేవేందర్‌రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం కేయూ భూమిని ఆక్రమించుకోవడమేగాక తనను అవమానించాడని సీఐ దేవేందర్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.