హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని ఓ ఖాకీ కబ్జా చేశాడు. సుమారు వేయి గజాల భూమి తనదేనంటూ మంగళవారం చదును చేసే కార్యక్రమం చేపట్టాడు. కేయూ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని భూమి యూనివర్సిటీదేనని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా.. సదరు సీఐ వారి మాటను బేఖాతరు చేయడమేగాక స్థానిక సీఐని అవమానించాడు. దీనికి సంబంధించినవివరాలు ఇలా ఉన్నాయి. పలివేల్పుల శివారులోని సర్వే నంబర్ 413లో కేయూకు సంబంధించిన భూమి ఉంది. అయితే ఆ భూమిని కొందరు వ్యక్తు లు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు.దీంతో కేయూసీ అధికారులు ఇటీవల ల్యాండ్ సర్వే అధికారులతో కొలతలు వేయించి హద్దులు నిర్ధారించారు.
భూమి కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు ప్రహారీ నిర్మాణ పను లు చేపట్టడానికి ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న నగర పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఓ సీఐ అక్కడికి చేరుకుని యంత్రాలతో భూమి చదును చేసే కార్యక్ర మం చేపట్టాడు. అందులో వేయి గజాల భూ మి కొనుగోలు చేసినట్లు కేయూ అధికారులకు తెలిపాడు. సర్వే చేసిన రికార్డు తమ వద్ద ఉం దంటూ కేయూ అధికారులు ఎంత చెప్పినా ఆయన వినలేదు. డబ్బులు ఇచ్చి భూమి కొనుగోలు చేశా.. ఇది ఆక్రమించింది కాదంటూ ఎదురుతిరిగాడు. దీంతో పరిస్థితి ఉద్రి క్తంగా మారింది. సద రు సీఐ, అధికారుల మధ్య మా టమాట పెరిగింది. సమాచా రం అందుకున్న రిజిస్ట్రార్ సాయిలు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే సీఐపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న కేయూ సీఐ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
కేయూ సీఐపై మండిపాటు..
ఇది కేయూకు చెందిన భూమేనని సీఐ దేవేందర్‌రెడ్డి చెప్పినందుకు భూమి అక్రమించుకున్న సీఐ ఆయనతో వాగ్వాదానికి దిగారు. సివిల్ తగదాలో పోలీసుల జోక్యం ఏమిటం టూ ఎదురు ప్రశ్నించారు. ఓ సీఐగా ఉండి.. తోటి సీఐకి సహకరించవా.. అంటూ మండిపడ్డాడు. అంతేగాక కేయూ సీఐని అవమానకరమైన పదజాలంతో దూషించాడు. నీ వద్ద ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే చూపించమని కోరినా సదరు సీఐ చూపించలేదు. చివరికి సీఐ దేవేందర్‌రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం కేయూ భూమిని ఆక్రమించుకోవడమేగాక తనను అవమానించాడని సీఐ దేవేందర్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
‘ఖాకీ’ కబ్జాలో కేయూ భూమి
Published Wed, Jan 1 2014 3:52 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement