hasanparti
-
విషాదంగా ప్రేమ పెళ్లి.. ఇంటి నుంచి వెళ్లిపోయి..
సాక్షి, హసన్‌పర్తి: ప్రేమ పెళ్లి విఫలమైంది. రెండేళ్ల పాటు ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబంలో నెలకొన్న గొడవలు భరించలేక ఆ వివాహిత తనువు చాలించింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆమె గురువారం వడ్డెపల్లి చెరువులో శవంగా లభ్యమైంది. అంతకుముందు భార్య ఆచూకీ లభ్యం కాకపోవడంతో భర్త కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వివరాలు.. నగరంలోని 56వ డివిజన్ గోపాలపురానికి చెందిన నిఖిలేశ్వర్, హనుమకొండ కాపువాడకు చెందిన లలిత(23) ఇంటర్మీడియట్ చదువుతున్న క్రమంలో ప్రేమలొ పడ్డారు. కులాలు వేరు కావడంతో కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నిఖిలేశ్వర్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యపై అనుమానం.. కాగా, కొంతకాలంగా భార్య లలితపై నిఖిలేశ్వర్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడని బాధిత కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. కుటుంబంలో నెలకొన్న గొడవలు భరించలేక ఈనెల 20న లలిత ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో గాలించారు. భార్య ఆచూకీ లభ్యం కాకపోవడంతో నిఖిలేశ్వర్ మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో గురువారం ఉదయం తాను చనిపోతానని లేఖ రాసి వెళ్లిపోయాడు. బైక్, సెల్‌ఫోన్ ఇంట్లోనే ఉన్నాయి. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. కాగా, కొడుకు, కోడలు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆందోళనకు గురైన తల్లి యాదలక్ష్మి గురువారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చెరువులో తేలిన మృతదేహం.. ఇదిలా ఉండగా, లలిత మృతదేహం గురువారమే వడ్డెపల్లి చెరువులో లభ్యమైంది. అయితే గుర్తు తెలియని మృతదేహంగా ఎంజీఎంలో కాజీపేట పోలీసులు భద్రపరిచారు. శుక్రవారం ఆ మృతదేహం లలితదిగా కుటుంబసభ్యులు గుర్తించారు. అయితే ఇప్పటివరకు నిఖిలేశ్వర్ ఆచూకీ లభ్యం కాలేదు. ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బాలిక కిడ్నాప్?
హసన్‌పర్తి: వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్ నుంచి కిడ్నాప్‌కు గురైన ఓ బాలికను హసన్‌పర్తి పోలీసులు సోమవారం కాపాడినట్లు తెలిసింది. భీమదేవరపల్లికి చెందిన ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ విద్యార్థిని రెండు రోజుల క్రితం ఎల్కతుర్తిలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో స్నేహతురాలిని కలవడానికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఆమె బస్సు కోసం వేచి చూస్తుండగా హసన్ పర్తి మండలం అన్నాసాగరం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెకు మాయమాటలు చెప్పి బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి వివిధ ప్రాంతాల్లో తిప్పాడు. రాత్రి కావడంతో ఆ బాలికను హసన్‌పర్తి మండలం వంగపహాడ్లో ఉంటున్న తన సోదరి వద్దకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఉదయం ఆ బాలిక తనను కిడ్నాప్ చేశారని డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు బాధితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ యువకుడి ఫోన్ ఆధారంగా హసన్‌పర్తి మండలం అన్నాసాగరంగా గుర్తించి గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. -
దంపతుల దారుణ హత్య
హసన్‌పర్తి : దంపతుల దారుణ హత్య జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి కొందరు దుండగులు భార్యాభర్తల గొంతులు కోసి ఘాతుకానికి పాల్పడ్డారు. డాగ్‌స్క్వాడ్‌కు చిక్కకుండా ఉండేందుకు నిందితులు సంఘటన స్థలంలో కారంపొడిని చల్లారు. దీనిని బట్టి .. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం.. హసన్పర్తికి చెందిన గడ్డం దామోదర్(58), పద్మ(49) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్తెల వివాహాలు చేశారు. పెద్ద కుమార్తె ఉదయశ్రీ, హైదరాబాద్‌లో ఉంటోంది. చిన్న కూతురు కరుణశ్రీ యూకేలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. కుమారుడు పున్నంచందర్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు.కాగా ఆరు నెలల క్రితం దామోదర్ ఇంటో జారిపడగా కాలు విరిగింది. ప్రస్తుతం కోలుకుని కర్ర సాయంతో నడుస్తున్నాడు. దామోదర్ దంపతులు తమ ఇంటిలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆ ఇంటిలో భార్యభర్తలు ఇద్దరే ఉంటున్నారు. రాత్రి ఏడు గంటల లోపు షాపు మూసి వేస్తారని, దామోదర్ వివాదరహితుడని స్థానికులు పేర్కొన్నారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు సంఘటన స్థలంలో డాగ్‌స్క్వాడ్‌తో గాలించగా జాగిలాలు దామోదర్ ఇంటి నుంచి చిన్నంగి చెరువు సమీపంలో ఉన్న వైన్స్‌షాపు వద్దకు వెళ్లి తిరిగి సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పద్మపై దుండగులు లైంగిక దాడి చేసి ఆపై హత్య చేశారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పద్మ బాత్రూంలో వివస్త్రగా పడి ఉండడంతో.. లైంగిక దాడి జరిగి ఉండవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ విశ్వనాథరవీందర్ తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడారు. అదుపులో అనుమానితులు? కాగా, స్థానికంగా చెందిన కొంతమంది యువకులను పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇంట్లో విగతజీవులుగా..ఉదయం ఆరుగంటల వరకు దామోదర్, పద్మ ఇంటి బయటికి రాకపోవడం, గేటు వద్ద కారంపొడి కనిపించడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. లోపలికి వెళ్లి పరిశీలించగా బాత్రూంలో పద్మ మృతదేహం కనిపించడంతో దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో దామోదర్ ఇంటి నుంచి రేకుల శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ సమయంలోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. దామోదర్ కత్తిపోట్లతో మంచంపై విగతజీవిగా పడి ఉండగా, పద్మ బాత్రూంలో మెడపై గాయాలతో మృతిచెంది ఉంది.పద్మను హత్య చేశాక ఆమె మెడలోని రెండుతులాల నల్లపూసల గొలుసును ఎత్తుకెళ్లారు. బీరువాలోని దుస్తులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా లాకర్ కూడా తెరిచి ఉంది. మృతుల కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. హత్య వెనుక అనుమానాలెన్నో? వరంగల్ క్రైం: హసన్‌పర్తి బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ప్రధాన రోడ్డు పక్కన ఉన్న ఇంట్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన దంపతుల దారుణ హత్య హసన్‌పర్తిలో సంచలనం సృష్టించింది. దంపతులను అతికిరాతకంగా హత్య చేసి ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా చివరకు డాగ్ స్క్వాడ్‌కు కూడా ఆధారాలు లభించకుండా కారంపొడి చల్లి హంతకులు పరారు కావడం పోలీసులకు సవాల్‌గా మారింది. గడ్డం దామోదర్(58), గడ్డం పద్మ(49) హత్య ఘటన ఎలా జరిగింది? ఎంత మంది పాల్గొన్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు మాత్రం.. పరిచయస్తులు లేదా ఇంటి పరిసరాలపై అవగాహన కలిగినవారే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారనే కోణంలో విచారిస్తున్నారు. రెండు నిమిషాల వ్యవధిలోనే .... గడ్డం దామోదర్, పద్మల సెల్ఫోన్లు రెండు నిమిషాల తేడాతో స్విచ్ ఆఫ్ అయ్యాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సోమవారం రాత్రి 11.46 గంటలకు పద్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఆ తర్వాత 11.48 గంటలకు దామోదర్ ఫోన్ స్విచ్ఆఫ్ అయినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అర్ధరాత్రికి ముందే హత్య జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సెల్‌ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. సినిమాను తలపించేలా.. సినిమాలో చూపినట్లు పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు కనిపిస్తోంది. ఇంటి గేటుకు గడియ పె ట్టి ఉంది. పద్మను బాత్రూంలో హత్య చేసి బ యట గొళ్లం పెట్టారు. ఇంట్లో బెడ్‌ఫై దామోదర్ ను హత్య చేసి బెడ్‌షీట్ కప్పి తలుపులు దగ్గర పెట్టి వెళ్లారు. బాత్రూం దగ్గర, గేటు దగ్గర ఆనవాళ్లు దొరకకుండా కారంపొడి చల్లారు. హత్యకు ఉపయోగించిన సిమెంట్ ఇటుకను బావిలో పడేశారు.దీంతో పాటు హత్య చేసే సమయంలో చేతికి అంటిన రక్తం మరకలను అక్కడే కడుక్కుని నిందితులు వెళ్లినట్లు తెలుస్తోంది. గడ్డం దామోదర్, పద్మ దంపతుల హత్య వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య చేసిన నిందితులు గోడ దూకి లోపలికి చొరబడి మాటు వేసి హత్య చేసి ఉంటారని తెలుస్తోంది. హంతకుల కోసం పోలీసులు నాలుగు ఐదు బృందలుగా విడిపోయి గాలిస్తున్నారు.గడ్డం దామోదర్ పలువురికి వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడని, దానికి సంబంధించిన అనేక రకాల డాక్యుమెంట్లు సంఘటన స్థలంలో లభించాయి. ఇంటికి ఎదురుగా ఉన్న ఎస్బీఐ బ్యాంకులో సోమవారం రూ.6వేలను దామోదర్ అకౌంట్లో డిపాజిట్ చేశారు. పోపుల పెట్టెలో దొరికిన బంగారం... పద్మ వంటగదిలో పోపుల డబ్బాలో బంగారం, డబ్బులు దాచుకోవడం అలవాటు. హత్యకు గురైన దంపతుల పెద్ద కూతురు ఉదయశ్రీ చెప్పిన సమాచారంతో పోలీసులు వంటగదిలో ఉన్న పోపుగింజల డబ్బాను చూడగా అందులో ఒక నల్లపుసల గొలుసు, ఒక ఉంగారం, సుమారు రూ.2వేల నగదు లభించాయి. -
గణేశా.. నూరేళ్లు నిండాయూ..!
పాఠశాల బస్సు కిందపడి విద్యార్థి మృతి డ్రైవర్‌దే నిర్లక్ష్యమన్న స్థానికులు ఆగ్రహించిన బంధువులు, స్థానికులు బస్సు అద్దాలు ధ్వంసం మృతదేహంతో రోడ్డుపై బైఠారుుంపు స్తంభించిన రాకపోకలు న్యాయం చేయూలని డిమాండ్ హసన్‌పర్తి : ఆడుతూ, పాడుతూ అక్షరాలు నే ర్చుకోవడానికి వెళ్లిన బాలుడిని పాఠశాల బస్సే బలితీసుకుంది. అప్పటి వరకు తమతో పాటు సంతోషంగా గడిపిన చిన్నారిని బస్సు చిదిమేసింది. ఈ ఘటనలో ముస్కు గణేశ్(6) అక్కడికక్కడే దుర్మరణం చెందడం బంధువులు, స్థాని కుల్లో ఆగ్రహం తెప్పించింది. వివరాలు ఇవీ.. నగరంలో 58వ డివిజన్ వంగపహాడ్‌కు చెంది న ముస్కు గణేశ్(6) ఆరెపల్లిలోని ఎన్ఎస్ఆర్ పాఠశాలలో యూకేజీ చదువుతన్నాడు. బడి వాహనంలోనే చదువుకోవడానికి వెళ్లివచ్చేవా డు. ఈ క్రమంలో బుధవారం ఉదయం బడికి బయలు దేరిన గణేశ్.. అదే బస్సులో ఇంటికి వస్తూ బస్సు కింద పడి ప్రాణాలు వది లాడు.. అమ్మా.. అంటూ ప్రాణాలు వదిలాడు.. వంగపహాడ్ పోలీస్ఔట్పోస్టు వద్ద బాలుడు బస్సు దిగుతుండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేశా డు. దీంతో బస్సు టైర్ తలపై నుంచి వెళ్లడంతో అమ్మా అంటూ ప్రాణాలు వదిలాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. స్థానికులు గమనించి వెం టనే కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును వదిలి పరుగులు దీశాడు. బస్సులో ఉన్న విద్యార్థులు ఆందోళనకు గురై కిందికి దిగారు. తమ తోటి విద్యార్థి తలపగిలి మరణించడాన్ని చూసి షా క్కు గురయ్యూరు. విషయం తెలిసిన మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహానికి గు రయ్యూరు. సంఘటనా స్థలానికి చేరుకుని బ స్సును పాక్షికంగా ధ్వంసం చేశారు. ప్రధాన ర హదారిపై రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న సీఐ రవికుమార్, ఎస్సైలు రవికిరణ్, శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్సై ఉపేందర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అరుునా, వారు ససేమిరా అన్నారు. మృతుడి తల్లి వ్యక్తిగత పని నిమిత్తం కరీంనగర్‌కు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. యూజమాన్యానిదే నిర్లక్ష్యం.. బస్సులోంచి చిన్న పిల్లలు కిందకు దించేందుకు యూజమాన్యం తప్పకుండా బస్సు క్లీనర్‌ను నియమించాలి. కానీ, యాజమాన్యం ఈ పనిచేయలేదు. దీంతోనే ప్రమాదం జరిగి గణేష్ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. దాదాపు రెండు గంటలపాటు నిరసన చేపట్టడడంతో వాహనాలు బారులు తీరారుు. ప్రయాణికుల ఇబ్బందులకు గురయ్యూరు. పోలీసులు స్పందించి ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. అరుునా, మృతదేహంతో ఆందోళన కొనసాగుతూనే ఉంది. కంటతడిపెట్టిన స్థానికులు చిన్నారి తల పగిలి మెదడు చిట్లిన దృశ్యాన్ని చూసిన స్థానికులు ‘అయ్యో పాపం.. బాలుడు’ అంటూ కంటతడి పెట్టారు. బాలుడి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నం టారుు. దేవుడు ఎంత అన్యాయం చేశాడంటూ విలపిస్తున్న దృశ్యం అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. -
‘ఖాకీ’ కబ్జాలో కేయూ భూమి
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని ఓ ఖాకీ కబ్జా చేశాడు. సుమారు వేయి గజాల భూమి తనదేనంటూ మంగళవారం చదును చేసే కార్యక్రమం చేపట్టాడు. కేయూ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని భూమి యూనివర్సిటీదేనని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా.. సదరు సీఐ వారి మాటను బేఖాతరు చేయడమేగాక స్థానిక సీఐని అవమానించాడు. దీనికి సంబంధించినవివరాలు ఇలా ఉన్నాయి. పలివేల్పుల శివారులోని సర్వే నంబర్ 413లో కేయూకు సంబంధించిన భూమి ఉంది. అయితే ఆ భూమిని కొందరు వ్యక్తు లు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు.దీంతో కేయూసీ అధికారులు ఇటీవల ల్యాండ్ సర్వే అధికారులతో కొలతలు వేయించి హద్దులు నిర్ధారించారు. భూమి కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు ప్రహారీ నిర్మాణ పను లు చేపట్టడానికి ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న నగర పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఓ సీఐ అక్కడికి చేరుకుని యంత్రాలతో భూమి చదును చేసే కార్యక్ర మం చేపట్టాడు. అందులో వేయి గజాల భూ మి కొనుగోలు చేసినట్లు కేయూ అధికారులకు తెలిపాడు. సర్వే చేసిన రికార్డు తమ వద్ద ఉం దంటూ కేయూ అధికారులు ఎంత చెప్పినా ఆయన వినలేదు. డబ్బులు ఇచ్చి భూమి కొనుగోలు చేశా.. ఇది ఆక్రమించింది కాదంటూ ఎదురుతిరిగాడు. దీంతో పరిస్థితి ఉద్రి క్తంగా మారింది. సద రు సీఐ, అధికారుల మధ్య మా టమాట పెరిగింది. సమాచా రం అందుకున్న రిజిస్ట్రార్ సాయిలు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే సీఐపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న కేయూ సీఐ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేయూ సీఐపై మండిపాటు.. ఇది కేయూకు చెందిన భూమేనని సీఐ దేవేందర్‌రెడ్డి చెప్పినందుకు భూమి అక్రమించుకున్న సీఐ ఆయనతో వాగ్వాదానికి దిగారు. సివిల్ తగదాలో పోలీసుల జోక్యం ఏమిటం టూ ఎదురు ప్రశ్నించారు. ఓ సీఐగా ఉండి.. తోటి సీఐకి సహకరించవా.. అంటూ మండిపడ్డాడు. అంతేగాక కేయూ సీఐని అవమానకరమైన పదజాలంతో దూషించాడు. నీ వద్ద ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే చూపించమని కోరినా సదరు సీఐ చూపించలేదు. చివరికి సీఐ దేవేందర్‌రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం కేయూ భూమిని ఆక్రమించుకోవడమేగాక తనను అవమానించాడని సీఐ దేవేందర్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.