గణేశా.. నూరేళ్లు నిండాయూ..!
పాఠశాల బస్సు కిందపడి విద్యార్థి మృతి
డ్రైవర్‌దే నిర్లక్ష్యమన్న స్థానికులు
ఆగ్రహించిన బంధువులు, స్థానికులు బస్సు అద్దాలు ధ్వంసం
మృతదేహంతో రోడ్డుపై బైఠారుుంపు
స్తంభించిన రాకపోకలు న్యాయం చేయూలని డిమాండ్
హసన్‌పర్తి : ఆడుతూ, పాడుతూ అక్షరాలు నే ర్చుకోవడానికి వెళ్లిన బాలుడిని పాఠశాల బస్సే బలితీసుకుంది. అప్పటి వరకు తమతో పాటు సంతోషంగా గడిపిన చిన్నారిని బస్సు చిదిమేసింది. ఈ ఘటనలో ముస్కు గణేశ్(6) అక్కడికక్కడే దుర్మరణం చెందడం బంధువులు, స్థాని కుల్లో ఆగ్రహం తెప్పించింది. వివరాలు ఇవీ.. నగరంలో 58వ డివిజన్ వంగపహాడ్‌కు చెంది న ముస్కు గణేశ్(6) ఆరెపల్లిలోని ఎన్‌ఎస్‌ఆర్ పాఠశాలలో యూకేజీ చదువుతన్నాడు. బడి వాహనంలోనే చదువుకోవడానికి వెళ్లివచ్చేవా డు. ఈ క్రమంలో బుధవారం ఉదయం బడికి బయలు దేరిన గణేశ్.. అదే బస్సులో ఇంటికి వస్తూ బస్సు కింద పడి ప్రాణాలు వది లాడు..
అమ్మా.. అంటూ ప్రాణాలు వదిలాడు..
వంగపహాడ్ పోలీస్‌ఔట్‌పోస్టు వద్ద బాలుడు బస్సు దిగుతుండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేశా డు. దీంతో బస్సు టైర్ తలపై నుంచి వెళ్లడంతో అమ్మా అంటూ ప్రాణాలు వదిలాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. స్థానికులు గమనించి వెం టనే కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును వదిలి పరుగులు దీశాడు. బస్సులో ఉన్న విద్యార్థులు ఆందోళనకు గురై కిందికి దిగారు. తమ తోటి విద్యార్థి తలపగిలి మరణించడాన్ని చూసి షా క్‌కు గురయ్యూరు. విషయం తెలిసిన మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహానికి గు రయ్యూరు. సంఘటనా స్థలానికి చేరుకుని బ స్సును పాక్షికంగా ధ్వంసం చేశారు. ప్రధాన ర హదారిపై రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న సీఐ రవికుమార్, ఎస్సైలు రవికిరణ్, శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్సై ఉపేందర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అరుునా, వారు ససేమిరా అన్నారు. మృతుడి తల్లి వ్యక్తిగత పని నిమిత్తం కరీంనగర్‌కు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
యూజమాన్యానిదే నిర్లక్ష్యం..
బస్సులోంచి చిన్న పిల్లలు కిందకు దించేందుకు యూజమాన్యం తప్పకుండా బస్సు క్లీనర్‌ను నియమించాలి. కానీ, యాజమాన్యం ఈ పనిచేయలేదు. దీంతోనే ప్రమాదం జరిగి గణేష్ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. దాదాపు రెండు గంటలపాటు నిరసన చేపట్టడడంతో వాహనాలు బారులు తీరారుు. ప్రయాణికుల ఇబ్బందులకు గురయ్యూరు. పోలీసులు స్పందించి ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. అరుునా, మృతదేహంతో ఆందోళన కొనసాగుతూనే ఉంది.
కంటతడిపెట్టిన స్థానికులు
చిన్నారి తల పగిలి మెదడు చిట్లిన దృశ్యాన్ని చూసిన స్థానికులు ‘అయ్యో పాపం.. బాలుడు’ అంటూ కంటతడి పెట్టారు. బాలుడి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నం టారుు. దేవుడు ఎంత అన్యాయం చేశాడంటూ విలపిస్తున్న దృశ్యం అక్కడ ఉన్న వారిని కలిచివేసింది.