లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న దేవేందర్‌రెడ్డి తదితరులు
మెదక్ మున్సిపాలిటీ: ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని విస్మరించాయని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందని చెప్పారు.
ముఖ్యంగా వైద్య సేవలపై దృష్టి సారించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ...ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించని పేదలను ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆదుకుంటున్నట్లు తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 2500మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆదుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎంఆర్‌ఎఫ్ కింద 41మందికి రూ.11.68లక్షలు అందజేశారు. మెదక్ మండల పరిధిలోని పాతూర్ గ్రామానికి చెందిన సత్తమ్మకు రూ.12.500, రాజ్‌పల్లి గ్రామానికి చెందిన సిద్దమ్మకు రూ.15,500, రాయిన్‌పల్లి గ్రామానికిచెందిన సిహెచ్.యశోధకు రూ.42,500, మాచవరం గ్రామానికి చెందిన మమతకు రూ.25వేలు, నవాబుపేటకు చెందిన నందమ్మకు రూ.25,500, దాయరవీధికి చెందిన పోచమ్మకు రూ.14వేలు,
హౌజింగ్‌బోర్డుకు చెందిన నరేందర్‌రెడ్డికి రూ.22,500, ఫత్తేనగర్ వీధికి చెందిన ప్రవీణ్‌కు రూ.10వేలు, వెంకటేశంకు రూ.60వేలు, చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన నవీన్‌రెడ్డికి రూ.16,500, ఇదే మండలం మడూర్‌కు చెందిన సంతోష్‌కు రూ.37,500, రామాయంపేటకు చెందిన లక్ష్మయ్యకు రూ.60వేలు, పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటకు చెందిన దుర్గమ్మకు రూ.20వేలు, ఢాక్యాతండాకు చెందిన మరొకరికి రూ.15వేల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ వైస్‌చైర్మన్ రాగి అశోక్, టీఆర్‌ఎస్‌వి నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్‌గౌడ్, కోఆప్షన్ సభ్యుడు సాధిక్, టీఆర్‌ఎస్ నాయకులు ఉమర్, దత్తు, మహ్మద్, రామస్వామి, లింగారెడ్డి, జయరాంరెడ్డి, గడిలశ్రీనివాస్‌రెడ్డి, దుర్గయ్య, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment