Singer Rahul Sipligunj Green India Challenge Special Song I గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌పై రాహుల్‌ పాట - Sakshi
Sakshi News home page

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌పై రాహుల్‌ పాట

Published Thu, Dec 24 2020 4:23 PM | Last Updated on Thu, Dec 24 2020 6:52 PM

Rahul Sipligunj Green India Challenge Song Released By Indrakaran Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పుడమి పచ్చగుండాలె- మన బతుకులు చల్లగుండాలె అనే నినాదంతో ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన "గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్"‌ మూడో దశ విస్తృతంగా వ్యాపిస్తోంది. స్టార్‌ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. ఈ క్రమంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రాముఖ్యతను చాటిచెప్తూ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఓ పాటను చిత్రీకరించారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, వనజీవి రామయ్య ఈ స్పెషల్‌ సాంగ్‌ను ఆవిష్కరించారు. ఈ పాటలో ప్రాణవాయువును పెంచే చెట్లతో చెలిమి చేయండని సందేశాన్ని పొందు పరిచారు. మనిషికో మూడు మొక్కలు నాటండని చెప్తూనే, చంటిపాపను కాపాడినట్టుగా చెట్లను సంరక్షించండని పిలుపునిచ్చారు. (చదవండి: అభిజిత్‌ ఛాలెంజ్‌ స్వీకరించిన సోహైల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement