శ్రీరాంపూర్ దీక్షలో మాట్లాడుతున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
శ్రీరాంపూర్/బెల్లంపల్లి/మందమర్రి రూరల్: సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలం ఆపాలని మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు బుధవారం రణ దీక్ష చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే దివాకర్‌రావు శ్రీరాంపూర్‌లో, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిలో, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మందమర్రిలో రణ దీక్ష చేశారు. మందమర్రి, శ్రీరాంపూర్‌లలోని దీక్షా శిబిరాలను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వారికి సఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణ ఆపే వరకు ఉద్యమిస్తామన్నారు. సింగరేణిలో 51 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉందన్న మంత్రి, కేంద్రం ఏక పక్షంగా గనులను ప్రైవేటుపరం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వేలంలో పెట్టిన బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. దీక్షల్లో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రావు, టీఆర్‌ఎస్, టీబీజీకేఎన్ నాయకులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment