coal blocks
-
రేపు 60 బొగ్గు బ్లాకుల వేలం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లోని 60 బొగ్గు బ్లాకుల కోసం 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణలోని ఒక బొగ్గు గని, ఒడిశాలోని 16, ఛత్తీస్‌గఢ్ 15, మధ్యప్రదేశ్ 15, జార్ఖండ్ 6, పశ్చి మబెంగాల్ 3, బిహార్‌లోని 3, మహారాష్ట్రలోని ఒక బొగ్గు గనికి కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహించనుంది. ఈ నెల 21న హైదరాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్లాల్ మీనా తదితరులు పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన కోసమంటూ.. బొగ్గు గనుల వేలానికి సంబంధించి కేంద్ర బొగ్గు శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ వేలంలో 60 బొగ్గు బ్లాక్‌లను వేలం వేయనున్నారు. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ బ్లాక్‌లు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదం చేస్తాయి. 10వ రౌండ్లో మొత్తం 60 బొగ్గు గనులు ఉండగా.. అందులో 24 గనుల్లో పూర్తిగా, మిగతా 36 గనుల్లో పాక్షికంగా అన్వేషణ జరిగింది.వేలంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగం వారికి సమాన అవకాశం ఉంటుంది. సొంత వినియోగం, విక్రయం సహా వివిధ ప్రయోజనాల ను పొందవచ్చు. ఎలాంటి పరిమితులు ఉండవు..’’అని పేర్కొంది. సులభతర వాణిజ్యం కోసం, బొగ్గు గనుల సత్వర నిర్వహణకు వీలుగా వివిధ అనుమతులు పొందేందుకు సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ పోర్టల్‌ను రూపొందించినట్టు తెలిపింది. -
‘బ్లాకుల’ ప్రైవేటీకరణ అసాధ్యం!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అసాధ్యం. సింగరేణి సంస్థకు చెందిన గనులన్నీ ఆ సంస్థకే చెందాలని నిజాం పాలనలోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో సింగరేణి సంస్థ, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు త్రైపాక్షిక ఒప్పం దం కుదుర్చుకున్నాయి. సింగరేణిలో రాష్ట్ర ప్రభు త్వం 51, కేంద్రం 49% వాటాలు కలిగి ఉన్నాయి. దీంతో ఏ విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వానిదే తుదినిర్ణయంగా ఉంటుంది’అని సింగరేణి పర్సనల్, అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్(పీఏడబ్ల్యూ) డైరెక్టర్ ఎన్.బలరాం స్పష్టం చేశారు. సింగరేణికి పేలుడు పదర్థాల సరఫరాపై ఉక్రెయిన్–రష్యా యుద్ధ ప్రభావం, గనుల్లో వరుస ప్రమాదాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, డిస్మిస్ కార్మికుల సమస్యల గురించి ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. అవి ఆయన మాటల్లోనే.. టెండర్లు పిలిచినా ముందుకు రాలేదు 2015 జనవరిలో అమల్లోకి వచ్చిన మినరల్స్, మైన్స్డెవలప్మెంట్ రెగ్యులరైజేషన్(ఎంఎండీఆర్) చట్టానికనుగుణంగా తెలంగాణ లోని కోయగూడెం ఓసీ, సత్తుపల్లి ఓసీ–3, శ్రావణపల్లి ఓసీ, కేకే–6 బ్లాకు లను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కంపెనీలకు బ్లాకులు అప్పగిస్తే సమయం ఆదాతోపాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలుంటాయని కేంద్రం భావించింది. త్రైపాక్షిక ఒప్పందానికి కేంద్ర నిర్ణయం విరుద్ధంగా ఉండటం, దాన్ని కార్మికసంఘాలు వ్యతిరేకించడంతో బ్లాకుల ప్రైవేటీకరణ సాధ్యం కాని పని. బ్లాకుల నిర్వహణకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇప్పట్లో ప్రైవేటీకరణ లేనట్టే. ఎక్స్‌ప్లోజివ్స్ కోసం ప్రత్యామ్నాయ చర్యలు ఉక్రెయిన్– రష్యా యుద్ధం నేపథ్యంలో సింగరేణికి ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరా(అమ్మోనియం నైట్రేడ్) పూర్తిగా నిలిచిపోలేదు. ప్రస్తుతం రాష్ట్రీయ కెమికల్ ఫెర్టిలైజర్స్ (పుణే–70%ఎక్స్‌ప్లోజివ్స్), స్టార్ క్యామ్ సంస్థ(30%) ద్వారా ఒక టన్ను ఎక్స్‌ప్లోజివ్స్‌కు రూ.65 వేలకు ఒప్పందం కుదుర్చుకుని సరఫరా చేసుకుంటోంది. వచ్చే నెల రెండోవారం వర కు ఆయా సంస్థలతో ఒప్పందం ఉంది. యుద్ధం కొనసాగినా ఆ పరిస్థితిని అధిగమించేలా సింగరేణి ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది. రోజూ ఓపెన్ కాస్టుల్లో ఓవర్ బర్డెన్కు 560 టన్నులు, భూ గర్భ గనులకు 50 టన్నులు మొత్తం 610 టన్నుల ఎక్స్‌ప్లోజివ్స్ అవసరమవుతాయి. స్థానికతకు పెద్దపీట రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సింగరేణి నియామకా ల్లో స్థానికతకు పెద్దపీట వేస్తున్నాం. ఇకపై సంస్థలో కార్మిక విభాగంలో 95% ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తాం. ఎగ్జిక్యూటివ్ నియామకాల్లో గతంలో ఉన్న 60(స్థానిక), 40(స్థానికేతర) శాతాన్ని మార్పు చేశాం. 80% ఉద్యోగాలు స్థానికులకు, 20% స్థానికేతరులకు ఇవ్వనున్నాం. ఇటీవల సింగరేణి భూగర్భ గనుల్లో ప్రమాదాలు పెరగడం బాధాకరం. డిప్యూ టీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ పర్యవేక్షించి ఆదేశిస్తేనే కార్మికులు గనుల్లో పని చేస్తుంటారు. గతం తో పోలిస్తే ప్రమాదాలు తగ్గాయి. మరో అవకాశం సింగరేణిలో ఆరు వేలమంది డిస్మిస్ కార్మికులున్నా రు. అనారోగ్యం, గనుల్లో పని చేయడం ఇష్టం లేక, వ్యవసాయం, ఇతర ఉద్యోగాలపై ఆసక్తితో కార్మికులు సింగరేణి వంద మస్టర్ల నిబంధనను పాటించడం లేదు. దీంతో వారిని డిస్మిస్ చేయాల్సి వస్తుంది. వీరి కోసం బోర్డు ఆఫ్ డైరెక్టర్ల నిర్ణయం ప్రకారం మరో అవకాశం ఇవ్వాలని సింగరేణి భావిస్తోంది. -
బొగ్గు బ్లాకుల వేలం ఆపాలి..
శ్రీరాంపూర్/బెల్లంపల్లి/మందమర్రి రూరల్: సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలం ఆపాలని మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు బుధవారం రణ దీక్ష చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే దివాకర్‌రావు శ్రీరాంపూర్‌లో, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిలో, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మందమర్రిలో రణ దీక్ష చేశారు. మందమర్రి, శ్రీరాంపూర్‌లలోని దీక్షా శిబిరాలను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వారికి సఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణ ఆపే వరకు ఉద్యమిస్తామన్నారు. సింగరేణిలో 51 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉందన్న మంత్రి, కేంద్రం ఏక పక్షంగా గనులను ప్రైవేటుపరం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వేలంలో పెట్టిన బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. దీక్షల్లో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు, టీఆర్ఎస్, టీబీజీకేఎన్ నాయకులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. -
బొగ్గు బ్లాకుల వేలం తగదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం వేయడం తగ దని వైఎస్సార్ తె లంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపి వేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కోల్‌బెల్ట్ లోని నాలుగు గనులను ఈ నెల 13న వేలం వేయాలని నిర్ణయించడంపై గురువారం ఆమె తీవ్రంగా స్పందించారు. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాల సమ్మెకు తన మద్దతు తెలిపారు. థర్మల్ విద్యుత్కేంద్రాల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తోందని షర్మిల పేర్కొన్నారు. బొగ్గు బ్లాకుల వేలంతో సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిలో బ్లాక్ లను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి లేఖలు రాశామని కేసీఆర్ చెబుతున్నారని. ఆ లేఖను బహి ర్గతం చేయాలని డిమాండ్ చేశారు. -
ఇది అతిపెద్ద సంస్కరణ: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో భారత్ విదేశీ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలనుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇందులో భాగంగా బొగ్గు సంస్కరణలపై కేంద్రం దృష్టి సారించిందని, విద్యుత్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించబోతోందని అన్నారు. కరోనా సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మల్చుకుంటోందని తెలిపారు. ప్రపంచంలోనే భారత్‌ను అతిపెద్ద బొగ్గు ఎగుమతిదారుగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.(కరోనాతో ఆటవిక తెగల యోధుడి అస్తమయం) 41 బొగ్గు గనుల వేలాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఇంధన శక్తి రంగంలో భారత్ స్వావలంబనకు ఈ సంస్కరణలు ఉపయోగపడుతాయని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా కోల్ సెక్టార్ పోటీతత్వానికి దూరంగా ఉందని, పారదర్శకత లోపించిందన్నారు. ఈ స్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు తాము అధికారంలోకి వచ్చాక 2014 తర్వాత అనేక చర్యలు చేపట్టామన్నారు.(ఐరాసలో భారత్ విజయం: మోదీ హర్షం) కమర్షియల్ కోల్ సెక్టార్ ద్వారా దేశంలో ఈ రంగం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ప్రైవేట్ బొగ్గు గనుల ద్వారా ఆదివాసీ, గిరిజన ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుతుందన్నారు. అలాగే ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కోల్ సెక్టార్లో ప్రైవేట్ పెట్టుబడులు అతి పెద్ద సంస్కరణగా మోదీ అభివర్ణించారు. ఇకపై కోల్ రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన అడ్డంకులను కూడా తొలగించినట్టు తెలిపారు. దేశంలో 41 బొగ్గు గనులను ప్రైవేటీకరించడం ద్వారా రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో రూ.33వేల కోట్ల మూల ధన పెట్టుబడులు పెరుగుతాయన్నారు. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా కొత్తగా 2.8లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.(దేశంలో కొత్తగా 12,881 కరోనా కేసులు) -
సీఓడీ..డిలే!
పాల్వంచ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేటీపీఎస్ 7వ దశలో విద్యుత్ ఉత్పత్తికి పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. నిర్మాణ పనులు శరవేగంగా జరిగినప్పటికీ ఉత్పత్తి మాత్రం అనుకున్న స్థాయిలో రాకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. 800 మెగావాట్ల బాయిలర్ ట్యూబ్ లీకేజీ కారణంగా నాలుగు రోజులుగా ఉత్పత్తి నిలిచిపోయింది. అంతేగాక గత అక్టోబర్‌లోనే సీవోడీ(కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) చేస్తామని ప్రకటించినప్పటికీ.. నవంబర్‌లో కూడా చేస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. పూర్తిస్థాయి ఉత్పత్తి వస్తేనే సీఓడీకి వెళతామని అధికారులు చెపుతున్నారు. సేఫ్టీ వాల్స్ లీకులు సరిచేయడంతో పాటు బాయిలర్, సిస్టమ్ లోడింగ్‌లో తలెత్తే సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. 11 వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా... తెలంగాణ ఏర్పడక ముందు 6,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా, ఆ తర్వాత ఓసీ–2లో 120 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇక్కడ జీ–13, జీ–8 బొగ్గు గ్రేడ్లు పుష్కలం. జీ–13 ఉత్పత్తి ఎక్కువ. నెలకు 3.8 లక్షల టన్నుల బొగ్గు లభిస్తోంది. జేవీఆర్ ఓసీ–1, జేవీఆర్ ఓసీ–2ల నుంచి ప్రతిరోజూ 550నుంచి 700 లారీ ల వరకు బొగ్గు రవాణా జరుగుతోంది. 30 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. గనుల విస్తరణతో వచ్చే రెండు మూడేళ్లలో సత్తుపల్లి కేంద్రంగా జీఎం కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే 25 ఎకరాల్లో సింగరేణి కా ర్మికుల క్వార్టర్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. షేప్ నిధుల్లేవు.. పర్యావరణం పట్టదు.. జేవీఆర్ ఓపెన్‌కాస్ట్ ఏర్పాటప్పుడు ప్రభావిత గ్రామాలైన.. రేజర్ల, కిష్టారం అభివృద్ధికి సింగరేణి నుంచి షేప్ నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ఈ 13 ఏళ్ల కాలంలో కేవలం రూ.5కోట్లు మాత్రమే ఇచ్చారు. అవి కూడా ప్రాధాన్యతా ప్రకారం మంజూరు చేయలేదనే విమర్శలున్నాయి. 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.2.80కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటనలు చేసినా.. ఇప్పటివరకు విడుదల చేయలేదు. పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకం కలిగింది. బొగ్గు తవ్వకాలు చేపట్టక ముందు పచ్చదనంతో కళకళలాడిన సత్తుపల్లి పరిసరాల్లో ఇప్పుడు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఏడాదికి లక్ష మొక్కలు నాటిస్తాం, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెప్పిన సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు రూ.15లక్షల విలువైన 65 వేల మొక్కలనే నాటినట్లు సంస్థ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. పలుమార్లు మొక్కలు నాటాలంటూ సత్తుపల్లిలో స్వచ్ఛంద సేవా సంస్థలు ఆందోళనకు దిగిన సంఘటనలు ఉన్నా.. యాజమాన్యం పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. బాంబు బ్లాస్టింగ్లతో దడ.. బొగ్గు తవ్వకాల్లో భాగంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో చేపట్టే బాంబు బ్లాస్టింగ్ వల్ల ఏడు కిలోమీటర్ల వరకు గ్రామాల్లోని నిర్మాణాలపై ప్రభావం పడుతోంది. దీంతో.. ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చి దెబ్బ తింటున్నాయి. 3 గంటల నుంచి 3.30 వరకు జరిగే పేలుళ్లతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ఒక్కోసారి అధిక మోతాదుతో భూమి కంపిస్తోందని, ఓసీ–2 సమీపంలోని ఎన్టీఆర్ కాలనీలో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయే దశకు చేరుకున్నాయని ఇక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు ఆందోళనలు చేసి.. సింగరేణి సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు కూడా. ఉసురు తీస్తున్న బొగ్గు లారీలు.. సత్తుపల్లి నుంచి కొత్తగూడెం గౌతంఖనికి రోడ్డుమార్గంలో నిత్యంలారీల్లో బొగ్గును సరఫరా చేస్తు న్నారు. వందలాది టిప్పర్లు తిరుగుతుండడంతో విపరీతమైన దుమ్ము లేచి వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. పెద్దపెద్ద బొగ్గు పెళ్లలు జారి పడుతున్నాయి. అధిక లోడు, మితిమీరిన వేగంతో రవాణా కారణంగా ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 132 మంది మృత్యువాత పడ్డారు. 87 మంది క్షతగాత్రులైనట్లు పోలీసుల విచారణలో తేలింది. 2019కల్లా బొగ్గు రవాణా కోసం రైల్వేలైన్ పనులు పూర్తి చేస్తామని ప్రకటించినప్పటికీ.. భూసేకరణ ప్రక్రియ మాత్రమే ముగిసింది. -
ఖర్చీఫ్ల్లా బొగ్గుగనులిచ్చేశారు
ప్యారీస్: విదేశాల్లోనూ ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ హయాంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఆ ప్రభుత్వం దేశంలోని ఎంతో విలువైన బొగ్గు గనులను చేతిరుమాళ్ల(హ్యాండ్ కర్చీఫ్), పెన్నుల మాదిరిగా ఇష్టమొచ్చినట్లు ఇచ్చేసిందని ఆరోపించారు. దీనివల్ల భారత ఖజానా లక్షల కోట్లలో గండి పడిందని చెప్పారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ప్యారిస్‌లోని భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 'మీరు ఈ విషయం (బొగ్గు గనుల కేటాయింపులు) గురించి తప్పనిసరిగా వినాలి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడు పెన్నులు, ఖర్చీఫులు ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు తీసుకున్న వ్యక్తి సరైనవాడేనా అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కానీ, అలా ఆలోచించకుండా పెన్నులు ఖర్చీఫ్లా పంపకం మాదిరిగా యూపీఏ ప్రభుత్వం 204 బొగ్గు గనులను కేటాయించింది. ఫలితంగా లక్షల కోట్ల నష్టం వాటిల్లింది' అని ఆయన చెప్పారు. అయితే, ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కేటాయింపులను రద్దు చేసిందని, ఆ విషయంలో మాజీ ప్రధానిని కూడా తప్పుబట్టిందని, ఇప్పుడా విషయం జోలికి వెళ్లనని, విమర్శలకు దిగాలనుకోవడం లేదని చెప్పారు. -
రెండవ దశ బొగ్గు బ్లాకుల వేలం నేటి నుంచి...
న్యూఢిల్లీ: రెండో దశ బొగ్గు గనుల వేలం నేడు (బుధవారం) ప్రారంభం కానుంది. ఈ విడతలో తొలి రోజున జార్ఖండ్‌లోని నాలుగు బ్లాకులను కేంద్రం వేలం వేయనుంది. జిత్పూర్, మైత్రా, బృందా, ససాయ్ గనులు ఈ జాబితాలో ఉన్నాయి. అదానీ పవర్, జెఎస్డబ్ల్యూ స్టీల్, సెయిల్, బాల్కో తదితర సంస్థలు వీటి కోసం పోటీపడుతున్నాయి. రెండో దశ వేలానికి ఆఖరు తేది ఈ నెల 9. ఈ విడతలో మొత్తం 15 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలానికి ఉంచింది. మొత్తం 80 దరఖాస్తులు సాంకేతిక రౌండుకు అర్హత పొందాయి. వాస్తవానికి గత నెలలోనే వేలం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ చట్టపరమైన వివాదాల కారణంగా జాప్యం జరిగింది. మొదటి విడతలో 19 గనులు వేలం వేయగా 15 గనులకు మాత్రమే బిడ్లు వచ్చాయి. -
బొగ్గు బ్లాక్లపై టీజెన్‌కో ఆరా
* సాధ్యాసాధ్యాల పరిశీలన * జనవరి 15 వరకు తుది గడువు * దక్కించుకునేందుకు సింగరేణి ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు రద్దుచేసిన బొగ్గు బ్లాక్లపై తెలంగాణ జెన్కో ఆరా తీస్తోంది. రద్దయిన బొగ్గు బ్లాక్‌లకు త్వరలోనే ఈ-వేలం విధానంలో టెండర్లు పిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో ఏడింటిని విద్యుత్తురంగ సంస్థలకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయగడ్, జార్ఖండ్‌లోని సౌత్ క్రాన్పుర, మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి, ఒడిశాలోని ఎల్బీ వాలీ, పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్, బర్జోరా బ్లాక్‌లను విద్యుత్తు అవసరాలకు వినియోగించాలని టెండర్ షెడ్యూల్లో నిర్దేశించింది. కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాలకు భారీ మొత్తంలో బొగ్గు నిల్వలు అవసరమున్నందున ఈ బ్లాక్‌లను దక్కించుకునేందుకు తెలంగాణ జెన్కో ప్రయత్నాలు ప్రారంభించింది. వీటిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే ఆయా రాష్ట్రాలకు వెళ్లి.. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. ఈ వేలంలో పాల్గొనేందుకు జనవరి 15 వరకు కేంద్రం గడువు విధించింది. దీంతో ఈలోగా క్షేత్రస్థాయి పరిస్థితులపై అందిన నివేదికల ఆధారంగా వేలంలో పాల్గొనాలా.. వద్దా.. అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు జెన్కో వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఏపీ జెన్కో సైతం అదే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు బొగ్గు బ్లాకుల రద్దు నిర్ణయంతో తెలంగాణ జెన్కో ఒక బ్లాక్‌ను కోల్పోయింది. కరీంనగర్ జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ రద్దయిన జాబితాలో ఉంది. గతంలో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏపీ జెన్కోకు కేటాయించింది. రాష్ట్ర పునర్విభజనలో ఇది తెలంగాణ జెన్కో ఖాతాలోకి వచ్చింది. ఈ బ్లాక్ నిర్వహణ, తవ్వకాల బాధ్యతను టీజెన్‌కో సింగరేణి కంపెనీకే అప్పగించింది. ఈసారి కూడా అదే పద్ధతిలో బ్లాక్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సిద్ధమవుతున్న సింగరేణి మరోవైపు సింగరేణి సైతం ఈ బొగ్గు బ్లాక్లపై కన్నేసింది. తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్‌లన్నీ తమ సంస్థకే కేటాయించాలని నెల రోజుల కిందటే కేంద్ర ఇంధన శాఖకు లేఖ రాసింది. దీనికి తోడు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని కోల్ బ్లాక్‌లు అప్పగించాలనే ప్రతిపాదనలు పంపింది. బొగ్గు ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వరంగ సంస్థల్లో సింగరేణికి అపారమైన అనుభవం ఉంది. తాజా నిబంధనల ప్రకారం విద్యుత్తు ప్లాంట్లు ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొనాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి విద్యుత్తు ప్లాంట్ నిర్మిస్తుండటంతో.. ఈ వేలంలో పాల్గొనేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. -
మధుకోడాపై ఛార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై ప్రత్యేక కోర్టులో సీబీఐ శుక్రవారం ఛార్జీషీట్ దాఖలు చేసింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో మోసం, కుట్రలకు పాల్పడ్డారంటూ మధు కోడాపై అభియోగాలను సీబీఐ నమోదు చేసింది. అలాగే జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసుతోపాటు మరో అరుగురిపై కూడా సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మధుకోడా జార్ఖండ్ సీఎంగా ఉన్న సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కోడా ఆస్తులపై సీబీఐ విచారణ చేపట్టంది. అందులోభాగంగా 144 కోట్ల విలువైన ఆస్తులను మనీల్యాండరింగ్ కోర్టు గత ఏడాది సెప్టెంబర్‌లో జప్తు చేసిన సంగతి తెలిసిందే. -
విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు దెబ్బ
ఇరు రాష్ట్రాలకు వచ్చిన మూడు బొగ్గు బ్లాకులు రద్దు సుప్రీం తీర్పుతో డోలాయమానంలో కొత్త థర్మల్ ప్లాంట్లు తాడిచర్ల-1 రద్దుతో కేటీపీపీకి బొగ్గు లేనట్లే వీటీపీఎస్, కేటీపీఎస్ ప్లాంట్లదీ ఇదే పరిస్థితి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై బొగ్గు దెబ్బపడింది. తీవ్ర విద్యుత్ కొరతతో సతమతమవుతున్న తెలంగాణకు అనుకోని షాక్ తగిలింది. వచ్చే ఏడాదే అందుబాటులోకి వస్తుందనుకుంటున్న 600 మెగావాట్ల విద్యుత్ తీరా చేతికి రాకుండా పోయే ముప్పు తలెత్తింది. బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా రద్దు చేసిన బొగ్గు బ్లాకుల జాబితాలో కరీంనగర్ జిల్లాలోని తాడిచెర్ల-1 బొగ్గు బ్లాకు కూడా ఉంది. దీనిపై ఆధారపడే వరంగల్ జిల్లాలో 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు(కేటీపీపీ)ను నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ఉత్పత్తి దశకు చేరే అవకాశమున్న తరుణంలో బొగ్గు బ్లాకు రద్దయింది. తాడిచర్ల-1 బ్లాకును అభివృద్ధి చేసే బాధ్యతను సింగరేణికి జెన్కో అప్పగించింది. పనులను సకాలంలో ప్రారంభించని కారణంగా సుప్రీం నిర్ణయంతో దీన్ని కోల్పోవలసి వచ్చింది. దీంతో కేటీపీపీ ప్లాంటు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా, అటు ఆంధ్రప్రదేశ్‌పైనా సుప్రీం తీర్పు ప్రభావం చూపుతోంది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)కు ఒడిశాలో 900 మిలియన్ టన్నుల నిల్వలున్న నవ్‌గావ్-తెలిసాహీ బ్లాకుతో పాటు మధ్యప్రదేశ్‌లో 150 మిలియన్ టన్నుల నిల్వలున్న సులియారీ-తెల్వార్ బ్లాకును కేంద్రం కేటాయించింది. ఈ రెండు బ్లాకులు కూడా తాజాగా రద్దయ్యాయి. ఈ బ్లాకుల నుంచి వచ్చే బొగ్గును 800 మెగావాట్ల వీటీపీఎస్ ప్లాంటుకు, 800 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్)కు అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఈ బొగ్గు బ్లాకుల అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియను ప్రారంభించడం, ఆయా రాష్ట్రాల్లోని ఖనిజాభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం వంటి చర్యలను ఏపీఎండీసీ ఇప్పటివరకు చేపట్టలేదు. ఈ బ్లాకులు రద్దవడం వల్ల ఇరు రాష్ట్రాలకూ కలిపి 1095 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు దక్కకుండా పోయాయి. దీంతో ఇంధన శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రివ్యూ పిటిషన్ వేస్తాం: టీ జెన్కో తాడిచర్ల-1 బ్లాకును రద్దు చేయడంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లు టీ-జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు రాకముందే బొగ్గు బ్లాకు రద్దు కాకుండా చూసేందుకు ఇంప్లీడ్ పిటిషన్ వేసినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు.బొగ్గు బ్లాకును మళ్లీ దక్కించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
బొగ్గు కేటాయింపులు రద్దు చేసిన సుప్రీం కోర్టు
-
బొగ్గు కేటాయింపులు రద్దు చేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేసింది. నాలుగు క్షేత్రాలకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా 214 క్షేత్రాలు కేటాయించినట్లు కోర్టు పేర్కొంది. ససన్, యుఎంపిపి, ఎన్టిపిసి, సెయిల్ క్షేత్రాలకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. బొగ్గు కేటాయింపులన్నిటిపైన దర్యాప్తు కొనసాగించాలని సుప్రీం కోర్టు సిబిఐని ఆదేశించింది. ** -
బొగ్గు గనుల కేటాయింపు రద్దు కేసులో తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు రద్దు కేసులో సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 1993 నుంచి 218 గనుల కేటాయింపుల్లో అవినీతి, పారదర్శకత పాటించకపోవడం వంటి ఆరోపణలు వచ్చాయి. చీఫ్ జస్టిస్ ఆర్ ఎమ్ లోథా సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం ఈ కేసులో సుదీర్ఘంగా వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. -
సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తాం: పియూష్
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామని విద్యుత్, బొగ్గుశాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. సుప్రీం కోర్టు వెల్లడించే ఎలాంటి తీర్పు ఎలాంటిదైనా వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 2019 నాటికి బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దేశంలోని ప్రతి ప్లాంటు సరిపడే బొగ్గును ఉత్పత్తిని చేస్తామన్నారు. బొగ్గు కేటాయింపు కుంభకోణంలో ఎవర్ని ఉపేక్షించబోదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అయితే బొగ్గు కేటాయింపుల వేలాన్ని ఎప్పుడు నిర్వహించబోయేది చెప్పడానికి పియూష్ గోయల్ నిరాకరించారు. -
బొగ్గు క్షేత్రాల కేటాయింపులు నిలిపి వేయండి : సుప్రీం
-
1993 నుంచి బొగ్గు క్షేత్రాల కేటాయింపులు రద్దు!
న్యూఢిల్లీ: యుపిఏ ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగినట్లు వివాదాలకు దారి తీసిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేసింది. బొగ్గు క్షేత్రాలు కేటాయింపులో పారదర్శకతలేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోథా అధ్యక్షతన ఏర్పాటైన సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీం కోర్టుల తీర్పుతో 1993 నుంచి 2010 వరకు కేటాయించిన బొగ్గు క్షేత్రాలు అన్నీ రద్దవుతాయి. కేసుపై మరింత విచారణ జరగవలసి ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ బొగ్గు క్షేత్రాలను తిరిగి కేటాయించే అంశాలను పరిశీలించడానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీ వేయాలని ధర్మాసనం సలహా ఇచ్చింది. లైసెన్స్‌ల రద్దుపై సెప్టెంబర్ 1న సుప్రీం కోర్టు విచారణ చేపడుతుంది. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం వేలం వేయకుండా ప్రైవేట్, పబ్లిక్ కంపెనీలకు బొగ్గు గనులను కట్టబెట్టడం వివాదాలకు దారి తీసింది. ఈ కేటాయింపుల వల్ల కేంద్రానికి భారీ నష్టం సంభవించింది. ఈ కుంభకోణం పలుసార్లు పార్లమెంటును కూడా కుదిపేసింది. -
బొగ్గు గనుల కేటాయింపులపై తప్పు జరిగింది: కేంద్రం
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుల్లో ఏదో తప్పు జరిగిందని కేంద్రం అంగీకరించింది. ఇదే అదనుగా బీజేపీ ఒత్తిడి పెంచింది. తప్పు జరిగిందని అంగీకరించినందున ప్రధానమంత్రి రాజీనామా చేయూలని డిమాండ్ చేసింది. ప్రధాన ప్రతిపక్షం డిమాండ్‌ను కాంగ్రెస్ తోసిపుచ్చింది. బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రక్రియ మరింత మెరుగైన రీతిలో జరిగి ఉండాల్సిందంటూ కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు నివేదించింది. మంచి అభిప్రాయంతోనే తాము నిర్ణయం తీసుకున్నప్పటికీ ఏదో తప్పు దొర్లినట్టుగా ఉందని అటార్నీ జనరల్ జీఈ వాహనవతి పేర్కొన్నారు. కొంత దిద్దుబాటు చేయూల్సిన అవసరం ఉందని కూడా జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని సుప్రీం త్రిసభ్య ధర్మాసనానికి ఆయన చెప్పారు. తద్వారా బొగ్గు బ్లాకుల కేటాయింపులో ప్రభుత్వం పొరపాట్లకు పాల్పడిందనే విషయూన్ని కేంద్రం దాదాపు అంగీకరించినట్టయింది. మరింత మెరుగైన రీతిలో కేటాయింపుల కసరత్తును జరిపి ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడిన నేపథ్యంలో ఏజీ పైవిధంగా స్పందిం చారు. సుప్రీం అభిప్రాయంతో తానూ ఏకీభవిస్తున్నానని వాహనవతి పేర్కొన్నారు. ప్రధాని తప్పుకోవాలి: బొగ్గు కేటాయింపుల్లో తప్పు జరిగిందని అంగీకరించినందున ప్రధాని మన్మోహన్సింగ్ పదవినుంచి తప్పుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. తీవ్రమైన అవకతవకలు చోటు చేసుకున్నట్టుగా ఏజీ చెప్పినందున.. 2006-2009 మధ్య బొగ్గు శాఖను నిర్వహించిన ప్రధానే ఇందుకు బాధ్యత వహించాలని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బొగ్గు బ్లాకుల కేటాయింపుతో సంబంధమున్న ఆ శాఖకు చెందిన ఇద్దరు సహాయ మంత్రులు, పీఎంఓ అధికారులపై చర్యల విషయంలో సీబీఐ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. సహాయమంత్రి దాసరి నారాయణరావు పాత్రపై ప్రశ్నలు ఉత్పన్నమైనప్పటికీ ఆయన్నింతవరకు విచారించలేదన్నారు. ఈ కుంభకోణంలో ఎంతోమంది భాగస్వాములున్నారని, రూ.50 లక్షల కోట్ల విలువైన బొగ్గు బ్లాకులను దాదాపు ఉచితంగా కట్టబెట్టారని ఆరోపించారు.