రెండవ దశ బొగ్గు బ్లాకుల వేలం నేటి నుంచి...
న్యూఢిల్లీ: రెండో దశ బొగ్గు గనుల వేలం నేడు (బుధవారం) ప్రారంభం కానుంది. ఈ విడతలో తొలి రోజున జార్ఖండ్‌లోని నాలుగు బ్లాకులను కేంద్రం వేలం వేయనుంది. జిత్‌పూర్, మైత్రా, బృందా, ససాయ్ గనులు ఈ జాబితాలో ఉన్నాయి. అదానీ పవర్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, సెయిల్, బాల్కో తదితర సంస్థలు వీటి కోసం పోటీపడుతున్నాయి.
రెండో దశ వేలానికి ఆఖరు తేది ఈ నెల 9. ఈ విడతలో మొత్తం 15 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలానికి ఉంచింది. మొత్తం 80 దరఖాస్తులు సాంకేతిక రౌండుకు అర్హత పొందాయి. వాస్తవానికి గత నెలలోనే వేలం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ చట్టపరమైన వివాదాల కారణంగా జాప్యం జరిగింది. మొదటి విడతలో 19 గనులు వేలం వేయగా 15 గనులకు మాత్రమే బిడ్లు వచ్చాయి.