second stage
-
రెండో దశ భూ హక్కు పత్రాల పంపిణీ
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే పూర్తయిన రెండో దశలోని 2 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాల పంపిణీని రెవెన్యూ శాఖ ప్రారంభించింది. మొదటి దశ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో 7.50 లక్షలకుపైగా భూ హక్కు పత్రాలను ఇప్పటికే రైతులకు అందించారు. ఇప్పుడు రెండో దశలోని 2 వేల గ్రామాల్లో సర్వే చివరి దశకు చేరుకోవడంతో ఆ గ్రామాల్లోని రైతులకు విడతల వారీగా భూ హక్కు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 26 జిల్లాల్లో 8.68 లక్షల భూ హక్కు పత్రాలు పంపిణీ చేయాల్సివుండగా ఇప్పటికే 5.12 లక్షల పత్రాలను ముద్రించి ఆయా జిల్లాలకు పంపారు. ఇందులో 2.48 లక్షల పత్రాలు ఈ–కేవైసీ పూర్తి చేసి పంపిణీ కూడా చేశారు. మిగిలిన పత్రాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లో పంపిణీ దాదాపు పూర్తయింది. గుంటూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఇంకా 5 శాతం లోపు పంపిణీ చేయాల్సి ఉంది. బాపట్ల, వైఎస్సార్, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో ఇంకా 30 శాతం వరకు పూర్తి చేయాల్సివుంది. పశ్చిమగోదావరి, కర్నూలు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 90 శాతం పెండింగ్ ఉండటంతో అక్కడ భూ హక్కు పత్రాల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరో నెల రోజుల్లో పంపిణీ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. -
రెండవ దశ కరోనా వ్యాక్సినేషన్ షురూ
-
రెండో దశలో కరోనా: దాటితే నియంత్రణ కష్టమే
సాక్షి, హైదరాబాద్ : దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి రెండో దశలో ఉంది. వైరస్ వ్యాప్తి మూడో దశ (సామాజిక వ్యాప్తి–కమ్యూనిటీ ట్రాన్స్మిషన్)లోకి వ్యాపించడానికి దేశానికి కేవలం 30 రోజులు గడువే ఉంది. వైరస్ మూడు, నాలుగు దశలు దాటిపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బంది, ఆస్పత్రులు, పడకలు ఇతర మౌలిక సదుపాయాలు ఏమాత్రం సరిపోవు. చిన్న వైరసే కదా అని నిర్లక్ష్యం చేస్తే జీవితమే కోల్పొవాల్సి వస్తుంది. ముందే మే ల్కొని ఎవరికి వారు స్వీయ నియంత్రణ చర్యలు చేపడితే..వైరస్ భారీ నుంచి సులభంగా బయటపడొచ్చని కోవిడ్–19 హైదరాబాద్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్ట ర్ శ్రీహర్ష యాదవ్ సూచించారు. ఆయన మాటల్లోనే... మొదటి దశ : చైనా, ఇటలీ, ఇరాన్, అమెరియా, యునైటెడ్ కింగ్డమ్, ఇండోనేషియా దేశాలకు వెళ్లి వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్‌గా వస్తుంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు వెలుగు చూసిన కేసులన్నీ ఈ దశవే. విదేశాలకు వెళ్లి వచ్చేవాళ్లను ఆయా దేశాల్లోనే నియంత్రించడం ద్వారా తొలి దశలోనే వైరస్‌ను కట్టడి చేయవచ్చు. (ట్రంప్ గుడ్‌న్యూస్.. కరోనాకు విరుగుడు..!) రెండో దశ : విదేశాలకు వెళ్లి కరోనా బారినపడి, మన దగ్గరుకు వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులు, సహోద్యోగులకు వైరస్ విస్తరింపజేసే దశ. దేశంలో ప్రస్తుతం ఈ రెండో దశ కొనసాగుతుంది. ఈ దశను లోకల్ ట్రాన్స్‌మిషన్‌గా వ్యవహరిస్తుంటారు. విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులు దిగగానే వారిని స్క్రీనింగ్ చేయ డం, లక్షణాలు ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించి, చికిత్సలు చేయించడం, వ్యాధి లక్షణాలు లేకపోయినా వారిని ఇతరులకు దూరంగా ఉంచడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరించకుంట్ట కట్టడి చేయవచ్చు. ప్రస్తుతం మనం రెండో దశలోనే ఉన్నాం. మూడో దశ : ఇది అత్యంత కీలకమైనది. ప్రమాదకరమైన దశ. రెండో దశలో వైరస్ బారిన పడిన వారి నుంచి చుట్టుపక్కల ఉన్న వారికి పెద్దెత్తునవైరస్ విస్తరిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే వేలాది మందికి విస్తరిస్తుంది. మరణాల సంఖ్య భారీగా ఉంటుంది. నియంత్రణ కష్టమవుతుంది. ఇటలీ, ఇరాన్‌లు ప్రస్తుతం ఇదే దశను ఎదుర్కొంటున్నాయి. (పారాసిట్మాల్తో అద్భుత ఫలితం) నాలుగో దశ : వైరస్ నియంత్రణ చేయి దాటిపోయే దశ ఇదే. ప్రస్తుతం ఇటలీ, ఇరాన్ ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ దశను తొలిసారి చూసిన దేశం చైనా. ఈ దశలోనే అక్కడ కేసుల సంఖ్య 80 వేలు దాటిపోయింది. ఆలస్యంగా మేల్కొన్నప్పటికీ..కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రస్తుతం వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది. కానీ ఇరాన్, ఇటలీ వంటి దేశాలు మాత్రం ఇప్పటికీ వైరస్‌తో పోరాడుతూనే ఉన్నాయి. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష... బయటి దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 14 రోజుల్లో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల తలెత్తితే కరోనా వైరస్‌గా అనుమానిస్తారు. సాధారణంగా వైరస్ రెండు నుంచి 14 రోజుల్లో బయటపడుతుంది. తుంపర్లు, ముట్టుకోవడం వల్ల ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు జనసమూహానికి దూరంగా ఉండటం, ముక్కుకు మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా వైరస్ భారీ నుంచి కాపాడుకోవచ్చు. స్వీయ నియంత్రణే చాలా ముఖ్యం. -
పీఎస్ఎల్వీ సీ–41లో సాంకేతిక లోపం
శ్రీహరికోట (సూళ్లూరుపేట) : శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో మొదటి ప్రయోగ వేదికపై పీఎస్ఎల్వీ సీ–41 రాకెట్ అనుసంధానం పనుల్లో సోమవారం రాత్రి సాంకేతిక లోపం తలెత్తి పీఎస్–2 దశను వెనక్కి తీసుకొచ్చేశారు. రాకెట్ మొదటి దశను (పీఎస్–1) ఇటీవల పూర్తి చేసి రెండో దశను (పీఎస్–2) అనుసంధానం చేసేందుకు సోమవారం లాంచ్ ప్యాడ్ వద్దకు తీసుకెళ్లారు. పీఎస్–1 నుంచి పీఎస్–2కు కనెక్షన్ ఇచ్చే ఎలక్ట్రానిక్స్ కేబుల్స్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అనుసంధానాన్ని నిలిపేశారు. -
తీరనున్న కరువు
తిరుమలాయపాలెం: దశాబ్దాలుగా కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడిన తిరుమలాయపాలెం మండలం నేటి నుంచి సస్యశ్యామలం కానుంది. కరువును తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భక్తరామదాసు రెండో దశ ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుండెపుడి వద్ద ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు వరుణుడిపై భారం వేస్తూ పంటలు సాగు చేస్తున్న మండల రైతాంగానికి భక్తరామదాసు ప్రాజెక్టులతో కరువు తీరనుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత ఏడాది పాలేరు నుంచి భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించి.. మండలంలోని ఎస్సారెస్పీ కాలువల ద్వారా చెరువులు నింపారు. కాకరవాయి, పైనంపల్లి, బచ్చోడు, బచ్చోడుతండా, రాజారం, జూపెడ, సోలీపురం, రఘునాథపాలెం గ్రామాలకు భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందకపోవడంతో మంత్రి తుమ్మల ప్రత్యేక కృషితో సీఎం కేసీఆర్ చేత ఈ ప్రాజెక్టుకు రూ.4.3కోట్ల నిధులు మంజూరు చేయించారు. 1.9 కిలోమీటర్ల మేర పైపులైన్ ఏర్పాటు చేసి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి వద్ద ఎస్సారెస్పీ కాల్వల్లోకి నీటిని విడుదల చేయనున్నారు. అనతి కాలంలోనే సుబ్లేడు గోనెతండా వరకు పైపులు ఏర్పాటు చేసి.. ఎస్సారెస్పీ కాల్వల్లోకి వదిలే విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేసి నిర్మాణం పూర్తి చేశారు. మండలంలోని ఏడు గ్రామలతోపాటు కూసుమంచి మండలంలోని రెండు గ్రామాల్లో 16,365 ఎకరాలకు సాగునీరు అందనుంది. పాలేరు నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు పైగా సాగునీరందనుంది. -
కాళేశ్వరం రెండో దశ అనుమతులపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు మొదటి దశ పర్యావరణ అనుమతులు వచ్చిన నేపథ్యంలో రెండో దశ అనుమతులకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి పీకే ఝా అధికారులను ఆదేశించారు. ఆ ప్రతిపాదనలను వెంటనే ఆన్లైన్లో కేంద్రానికి పంపాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అటవీశాఖ చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం ఆయన వివిధ జిల్లాల అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఝా మాట్లాడుతూ వచ్చే ఏడాది హరితహారం కోసం నర్సరీల సంఖ్య పెంచాలని, భూముల సర్వేలో భాగంగా అటవీ ప్రాంతాల సరిహద్దులు గుర్తించి హద్దులు నమోదుచేయాలని ఆదేశించారు. ఎకో టూరిజం అభివృద్ధి కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా అటవీ అధికారుల చొరవను అభినందించిన ఉన్నతాధికారులు, మిగతా జిల్లాల అధికారుల అవగాహన కోసం వరంగల్‌లో వర్క్‌షాపు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్తగూడెం అటవీ ప్రాంతం గుండాల రేంజ్ రంగాపురం పరిధిలో అన్యాక్రాంతం అయిన 55 హెక్టార్ల అటవీ భూమిని స్వాధీనం చేసుకొని మొక్కలు నాటిన సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. -
రెండవ దశ బొగ్గు బ్లాకుల వేలం నేటి నుంచి...
న్యూఢిల్లీ: రెండో దశ బొగ్గు గనుల వేలం నేడు (బుధవారం) ప్రారంభం కానుంది. ఈ విడతలో తొలి రోజున జార్ఖండ్‌లోని నాలుగు బ్లాకులను కేంద్రం వేలం వేయనుంది. జిత్పూర్, మైత్రా, బృందా, ససాయ్ గనులు ఈ జాబితాలో ఉన్నాయి. అదానీ పవర్, జెఎస్డబ్ల్యూ స్టీల్, సెయిల్, బాల్కో తదితర సంస్థలు వీటి కోసం పోటీపడుతున్నాయి. రెండో దశ వేలానికి ఆఖరు తేది ఈ నెల 9. ఈ విడతలో మొత్తం 15 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలానికి ఉంచింది. మొత్తం 80 దరఖాస్తులు సాంకేతిక రౌండుకు అర్హత పొందాయి. వాస్తవానికి గత నెలలోనే వేలం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ చట్టపరమైన వివాదాల కారణంగా జాప్యం జరిగింది. మొదటి విడతలో 19 గనులు వేలం వేయగా 15 గనులకు మాత్రమే బిడ్లు వచ్చాయి.