
శ్రీహరికోట (సూళ్లూరుపేట) : శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో మొదటి ప్రయోగ వేదికపై పీఎస్‌ఎల్‌వీ సీ–41 రాకెట్ అనుసంధానం పనుల్లో సోమవారం రాత్రి సాంకేతిక లోపం తలెత్తి పీఎస్–2 దశను వెనక్కి తీసుకొచ్చేశారు. రాకెట్ మొదటి దశను (పీఎస్–1) ఇటీవల పూర్తి చేసి రెండో దశను (పీఎస్–2) అనుసంధానం చేసేందుకు సోమవారం లాంచ్ ప్యాడ్ వద్దకు తీసుకెళ్లారు. పీఎస్–1 నుంచి పీఎస్–2కు కనెక్షన్ ఇచ్చే ఎలక్ట్రానిక్స్ కేబుల్స్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అనుసంధానాన్ని నిలిపేశారు.
Comments
Please login to add a commentAdd a comment