న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో భారత్ విదేశీ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలనుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇందులో భాగంగా బొగ్గు సంస్కరణలపై కేంద్రం దృష్టి సారించిందని, విద్యుత్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించబోతోందని అన్నారు. కరోనా సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మల్చుకుంటోందని తెలిపారు. ప్రపంచంలోనే భారత్‌ను అతిపెద్ద బొగ్గు ఎగుమతిదారుగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.(కరోనాతో ఆటవిక తెగల యోధుడి అస్తమయం)
41 బొగ్గు గనుల వేలాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఇంధన శక్తి రంగంలో భారత్ స్వావలంబనకు ఈ సంస్కరణలు ఉపయోగపడుతాయని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా కోల్ సెక్టార్ పోటీతత్వానికి దూరంగా ఉందని, పారదర్శకత లోపించిందన్నారు. ఈ స్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు తాము అధికారంలోకి వచ్చాక 2014 తర్వాత అనేక చర్యలు చేపట్టామన్నారు.(ఐరాసలో భారత్ విజయం: మోదీ హర్షం)
కమర్షియల్ కోల్ సెక్టార్ ద్వారా దేశంలో ఈ రంగం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ప్రైవేట్ బొగ్గు గనుల ద్వారా ఆదివాసీ, గిరిజన ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుతుందన్నారు. అలాగే ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కోల్ సెక్టార్‌లో ప్రైవేట్ పెట్టుబడులు అతి పెద్ద సంస్కరణగా మోదీ అభివర్ణించారు. ఇకపై కోల్ రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన అడ్డంకులను కూడా తొలగించినట్టు తెలిపారు. దేశంలో 41 బొగ్గు గనులను ప్రైవేటీకరించడం ద్వారా రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో రూ.33వేల కోట్ల మూల ధన పెట్టుబడులు పెరుగుతాయన్నారు. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా కొత్తగా 2.8లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.(దేశంలో కొత్తగా 12,881 కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment