ఖర్చీఫ్ల్లా బొగ్గుగనులిచ్చేశారు | 'Coal Blocks Were Given Away Like Handkerchief': Narendra Modi | Sakshi
Sakshi News home page

ఖర్చీఫ్ల్లా బొగ్గుగనులిచ్చేశారు

Published Sun, Apr 12 2015 1:58 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఖర్చీఫ్ల్లా బొగ్గుగనులిచ్చేశారు - Sakshi

ఖర్చీఫ్ల్లా బొగ్గుగనులిచ్చేశారు

ప్యారీస్: విదేశాల్లోనూ ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ హయాంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఆ ప్రభుత్వం దేశంలోని ఎంతో విలువైన బొగ్గు గనులను చేతిరుమాళ్ల(హ్యాండ్ కర్చీఫ్), పెన్నుల మాదిరిగా ఇష్టమొచ్చినట్లు ఇచ్చేసిందని ఆరోపించారు. దీనివల్ల భారత ఖజానా లక్షల కోట్లలో గండి పడిందని చెప్పారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ప్యారిస్లోని భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

'మీరు ఈ విషయం (బొగ్గు గనుల కేటాయింపులు) గురించి తప్పనిసరిగా వినాలి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడు పెన్నులు, ఖర్చీఫులు ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు తీసుకున్న వ్యక్తి సరైనవాడేనా అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కానీ, అలా ఆలోచించకుండా పెన్నులు ఖర్చీఫ్లా పంపకం మాదిరిగా యూపీఏ ప్రభుత్వం 204 బొగ్గు గనులను కేటాయించింది. ఫలితంగా లక్షల కోట్ల నష్టం వాటిల్లింది' అని ఆయన చెప్పారు.  అయితే, ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కేటాయింపులను రద్దు చేసిందని, ఆ విషయంలో మాజీ ప్రధానిని కూడా తప్పుబట్టిందని, ఇప్పుడా విషయం జోలికి వెళ్లనని, విమర్శలకు దిగాలనుకోవడం లేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement