Handkerchief
-
వివాహిత హత్య
♦ చేతి రుమాలుతో మెడకు ఉరి ♦ నర్సాపూర్ మండలంలో ఘటన నర్సాపూర్ రూరల్: చేతి రుమాలుతో మెడకు ఉరి బిగించి దుండగులు ఓ వివాహితను హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి మండలం పోతురెడ్డిపల్లికి చెందిన నీరుడు నవీన అలియాస్ సంతోష (25) శనివారం ఉదయం తుల్జారాంపేట గిరిజన తండా సమీపంలో హత్యకు గురైన స్థితిలో పడి ఉంది. సంఘటన స్థలంలో నీటి ప్యాకెట్లు, మద్యం సీసా ఉన్నాయి. సంతోష శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదంటూ ఆమె తండ్రి సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. శనివారం ఉదయం తుల్జారాంపేట తండా సమీపంలో మహిళ మృతదేహం పడి ఉందని నర్సాపూర్ పోలీసులు సంగారెడ్డి ఎస్పీ కార్యలయానికి సమాచారమిచ్చారు. దీంతో సంగారెడ్డి రూరల్ పోలీసులు వివిధ ఆధారాలు తెలిపి ఆరా తీసిన మీదట సంతోష తండ్రికి తెలిపారు. ఆయనతో పాటు ఇతర కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి వచ్చి సంతోషను గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు, ఎస్ఐ వెంటరాజుగౌడ్ తెలిపారు. కాగా, తన కుమార్తె సంతోషను అల్లుడు బాలకృష్ణే హతమార్చాడని హతురాలి తండ్రి జవాన్ నర్సింహ ఆరోపించారు. వీరికి కుమార్తె అక్షయ (3) పుట్టినప్పటి నుంచి కట్నం వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ప్రస్తుతం సంతోష ఐదు నెలల గర్భవతి అని చెప్పారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఖర్చీఫ్ల్లా బొగ్గుగనులిచ్చేశారు
ప్యారీస్: విదేశాల్లోనూ ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ హయాంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఆ ప్రభుత్వం దేశంలోని ఎంతో విలువైన బొగ్గు గనులను చేతిరుమాళ్ల(హ్యాండ్ కర్చీఫ్), పెన్నుల మాదిరిగా ఇష్టమొచ్చినట్లు ఇచ్చేసిందని ఆరోపించారు. దీనివల్ల భారత ఖజానా లక్షల కోట్లలో గండి పడిందని చెప్పారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ప్యారిస్‌లోని భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 'మీరు ఈ విషయం (బొగ్గు గనుల కేటాయింపులు) గురించి తప్పనిసరిగా వినాలి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడు పెన్నులు, ఖర్చీఫులు ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు తీసుకున్న వ్యక్తి సరైనవాడేనా అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కానీ, అలా ఆలోచించకుండా పెన్నులు ఖర్చీఫ్లా పంపకం మాదిరిగా యూపీఏ ప్రభుత్వం 204 బొగ్గు గనులను కేటాయించింది. ఫలితంగా లక్షల కోట్ల నష్టం వాటిల్లింది' అని ఆయన చెప్పారు. అయితే, ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కేటాయింపులను రద్దు చేసిందని, ఆ విషయంలో మాజీ ప్రధానిని కూడా తప్పుబట్టిందని, ఇప్పుడా విషయం జోలికి వెళ్లనని, విమర్శలకు దిగాలనుకోవడం లేదని చెప్పారు.