సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తాం: పియూష్
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామని విద్యుత్, బొగ్గుశాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. సుప్రీం కోర్టు వెల్లడించే ఎలాంటి తీర్పు ఎలాంటిదైనా వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
2019 నాటికి బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దేశంలోని ప్రతి ప్లాంటు సరిపడే బొగ్గును ఉత్పత్తిని చేస్తామన్నారు. బొగ్గు కేటాయింపు కుంభకోణంలో ఎవర్ని ఉపేక్షించబోదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అయితే బొగ్గు కేటాయింపుల వేలాన్ని ఎప్పుడు నిర్వహించబోయేది చెప్పడానికి పియూష్ గోయల్ నిరాకరించారు.