
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం వేయడం తగ దని వైఎస్సార్ తె లంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపి వేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కోల్‌బెల్ట్ లోని నాలుగు గనులను ఈ నెల 13న వేలం వేయాలని నిర్ణయించడంపై గురువారం ఆమె తీవ్రంగా స్పందించారు. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాల సమ్మెకు తన మద్దతు తెలిపారు.
థర్మల్ విద్యుత్కేంద్రాల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తోందని షర్మిల పేర్కొన్నారు. బొగ్గు బ్లాకుల వేలంతో సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిలో బ్లాక్ లను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి లేఖలు రాశామని కేసీఆర్ చెబుతున్నారని. ఆ లేఖను బహి ర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment