
హెచ్‌సీఎల్ చేతికి వోల్వో ఐటీ కంపెనీ
స్వీడన్‌కు చెందిన వోల్వో గ్రూప్ ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది.
డీల్ విలువ రూ.895 కోట్లు!
న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన వోల్వో గ్రూప్ ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. ఈ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.895కోట్లకు అంతా నగదులోనే కొనుగోలు చేసిందని సమాచారం. అంతేకాకుండా వోల్వో కంపెనీకి ఐదేళ్ల పాటు ఐటీ సేవలు అందించేందుకు అవుట్ సోర్సింగ్ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. భారత ఐటీ కంపెనీలు సాధించిన అతి పెద్ద డీల్స్‌లో ఇదొకటి. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం..,వోల్వో కంపెనీకి చెందిన ఐటీ కంపెనీ కొనుగోలుకు సంబంధించి గత ఏడాది అక్టోబర్‌లోనే రెండు కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఐటీ కంపెనీ కొనుగోలు వల్ల యూరోప్‌లోని నార్డిక్, ఫ్రాన్స్ ప్రాంతాల్లో 40 కొత్త వినియోగదారులు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు లభిస్తారు.