భారతదేశంలో ధనవంతుల సంఖ్య పెరుగుతూ ఉంది. వీరిలో చాలా మంది లెక్కకు మించిన డబ్బు సంపాదించడమే కాకుండా.. ఉదారంగా దాతృత్వ కార్యక్రమాలకు మద్దతిస్తూ.. వేలకోట్లు దానం చేస్తుంటారు. ఇందులో చెప్పుకోదగ్గ వ్యక్తి బిలియనీర్ 'శివ్ నాడార్' (Shiv Nadar). అయితే ఈయన హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ షేర్స్ మంగళవారం 9 శాతం క్షీణించాయి. దీంతో ఒక్క రోజులోనే రూ. 46,485 కోట్లు నష్టం వాటిల్లింది.
హెచ్‌సీఎల్ టెక్ మార్కెట్ విలువ
భారతదేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో ఒకటైన హెచ్‌సీఎల్.. డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలు మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫమయ్యాయి. దీంతో సంస్థ స్టాక్ ధరలో కూడా భారీ క్షీణత కనిపించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో కంపెనీ షేర్లు 8.63% పతనమై, ఒక్కో షేరుకు రూ.1,813.95 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్‌లో, స్టాక్ మొత్తం 9.41% క్షీణతను ప్రతిబింబిస్తూ రూ. 1,798.40 కనిష్ట స్థాయిని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో షేరు 8.51 శాతం క్షీణించి రూ.1,819.95 వద్ద ముగిసింది. ఫలితంగా జనవరి 14 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింది.
శివ్ నాడార్ నికర విలువ
ఒక్క రోజులో వేలకోట్ల నష్టం వాటిల్లినప్పటికీ.. శివ్ నాడార్ నికర విలువ ఫోర్బ్స్ ప్రకారం 39.4 బిలియన్ డాలర్లు లేదా రూ. 3,40,793 కోట్లుగా ఉంది. ఇది ఆయన బలమైన పునాదిని & ఐటీ రంగంలో కంపెనీ బలానికి నిదర్శనం అని తెలుస్తోంది.
అత్యంత ఉదార దాత
శివ్ నాడార్ కేవలం భారతదేశంలోని సంపన్నుల జాబితాలో ఒకరుగా మాత్రమే కాకుండా.. అత్యంత ఉదారమైన పరోపకారిగా కూడా గుర్తింపు పొందారు.
శివ్ నాడార్ దాతృత్వంలో అంబానీ, అదానీని కూడా మించిపోయారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 2,153 కోట్లు విరాళమిచ్చారు. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. దీంతో ఎడెల్‌గివ్ హురున్ వితరణశీలుర లిస్టులో శివ్ నాడార్ అగ్రస్థానంలో నిలిచారు.
ఇదీ చదవండి: ఐటీ కంపెనీల్లో ఇదీ పరిస్థితి: ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ అస్థిరత ఫలితంగా హెచ్‌సీఎల్ టెక్ వాల్యుయేషన్‌లో తాత్కాలిక తగ్గుదల ఏర్పడినప్పటికీ, భారతదేశ ఐటీ రంగానికి శివ్ నాడార్ చేసిన కృషి, అతని దాతృత్వ ప్రయత్నాల కారణంగా అతనిని నిజమైన మార్గదర్శకుడిగా మాత్రమే కాకుండా.. భవిష్యత్ తరాలకు రోల్ మోడల్‌గా నిలిపింది.
Comments
Please login to add a commentAdd a comment