‘ఎక్సైజ్’ ప్రైవేట్ డ్రైవర్ల విజ్ఞప్తి
కొత్త వాహనాలపై నియమించాలని వేడుకోలు
వరంగల్ క్రైం : కొత్త వాహనాలు వస్తే తమను పర్మినెంట్ చేస్తామని సంతోషించాం... కానీ తీసివేస్తామంటున్నారు.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖలోని ప్రైవేట్ డ్రైవర్లు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 మంది ఎక్సైజ్‌శాఖలో ప్రైవేట్ డ్రైవర్లుగా గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ఎక్సైజ్ శాఖకు కొత్త వాహనాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అరుుతే, ఈ వాహనాలపై తమను పర్మినెంట్ లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తారని ప్రైవేట్ డ్రైవర్లు భావిస్తుండగా.. వీరందరినీ తొలగించాలని మంత్రి సెలవిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, ఎక్సైజ్ డెరైక్టర్‌అకున్ సభర్వాల్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇరవై ఏళ్లుగా శాఖను నమ్ముకున్నందున తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో హైదరాబాద్ తరహాలో వాహనాలను లోన్‌పై ఇప్పించి శాఖలోనే పెట్టుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అందరిపై జాలి చూపకున్నా... రెండేళ్లకు పైబడి పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చిన ఆ శాఖ డెరైక్టర్ వీరినిశాఖలోనే కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం కూడా వారి పాలిట శాపంగా మారిందనే చెప్పాలి. ప్రభుత్వం ఉద్యోగం కాకుండా అతి తక్కువ వేతనంతో ప్రైవేట్‌గా పనిచేస్తున్నప్పుడు తమకు బదిలీ ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు.
కానిస్టేబుళ్ల ఫిర్యాదుతో..
ఎక్సైజ్ శాఖలోని కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు శాఖలోని ఉన్నతాధికారులకు ప్రైవేటు డ్రైవర్లపై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ డ్రైవర్ల కారణంగా తనిఖీ సమాచారం గుడుంబా తయూరీదారులకు వెళ్తోందని, తద్వారా అరికట్టలేకపోతున్నామనేది వారి ఫిర్యాదుల సారాంశం. ఇదే నిజమని న మ్ముతున్న ఉన్నతాధికారులు ప్రైవేట్ డ్రైవర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాష్ర్ట్రంలోని అనేక ప్రాంతాలలో సీజ్‌చేసిన గుడుంబా, బెల్లంను కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఎస్సైలు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. హన్మకొండలో అయితే ఏకంగా ఒక సీఐ రెండు లారీల బెల్లాన్ని వ్యాపారికి తరలించి సొమ్ముచేసుకున్నాడు. ఇలా శాఖ ఉద్యోగుల్లో పలువురు తప్పులు చేస్తూ ప్రైవేట్ డ్రైవర్లపై ఫిర్యాదు చేయడంతో వీరి బజారున పడే పరిస్థితి నెలకొంది.