new vehicles
-
బ్లేడ్ బ్యాటరీ బస్సు.. బుల్లి కారు..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో (Bharat mobility expo 2025)వివిధ కంపెనీల నుంచి నూతన ఎలక్ట్రిక్ వాహనాలు కొలువుదీరాయి. వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ ఆటో భారత్‌కు ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. వీఎఫ్–7, వీఎఫ్–6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరినాటికి వీటిని మార్కెట్లోకి తేనున్నట్టు తెలిపింది. తమిళనాడులోని ట్యూటికోరిన్ వద్ద 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రం స్థాపించనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది రెండవ అర్ద భాగంలో ఈ ప్లాంటు రెడీ అవుతుందని విన్‌ఫాస్ట్ ఆసియా సీఈవో పామ్ సాన్ ఛావ్ తెలిపారు.హ్యుండై టీవీఎస్ జోడీహ్యుండై మోటార్ కంపెనీ, టీవీఎస్ మోటార్ కంపెనీ చేతులు కలిపాయి. అధునాతన ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లు, చిన్న ఫోర్–వీలర్లను అభివృద్ధి చేసే లక్ష్యంతో భాగస్వామ్యాన్ని అన్వేషించనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా హ్యుండై తన మైక్రో మొబిలిటీ కాన్సెప్ట్ ఈవీలను ఆవిష్కరించింది. ఈ భాగస్వామ్యం కార్యరూపం దాలిస్తే డిజైన్, ఇంజనీరింగ్, సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలని హ్యుండై యోచిస్తోంది. అయితే భారత్‌లో ఈ వాహనాల తయారీ, మార్కెటింగ్‌పై టీవీఎస్ దృష్టి పెడుతుంది.కొలువుదీరిన ఎంజీ మోడళ్లుజేఎస్డబ్లు్య ఎంజీ మోటార్ ఇండియా మజెస్టర్ పేరుతో మధ్యస్థాయి ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కాంపాక్ట్ కార్స్ కంటే పెద్దగా, పూర్తి స్థాయి కార్స్ కంటే చిన్నగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఐఎం5, ఐఎం6, ఎంజీ హెచ్ఎస్, ఎంజీ7 ట్రోఫీ ఎడిషన్ మోడళ్లను సైతం కంపెనీ ప్రదర్శించింది. మోంట్రా ఎలక్ట్రిక్ కొత్త మోడళ్లుమురుగప్ప గ్రూప్ కంపెనీ మోంట్రా ఎలక్ట్రిక్ రెండు కొత్త వాహనాలను లాంచ్ చేసింది. ఈవియేటర్ పేరుతో చిన్న తరహా వాణిజ్య వాహనాన్ని, సూపర్ కార్గో పేరుతో త్రీవీలర్‌ను ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్‌తో ఈవియేటర్ 245 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.15.99 లక్షలు. సూపర్ కార్గో ఈ–త్రీవీలర్ 200 కిలోమీటర్లపైగా పరుగెడుతుంది. పూర్తి ఛార్జింగ్ కోసం 15 నిమిషాలు సమయం తీసుకుంటుంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.4.37 లక్షలు. కంపెనీ 55 టన్నుల హెవీ కమర్షియల్ ఎలక్ట్రిక్ ట్రక్ రైనో సైతం ప్రదర్శించింది. బీవైడీ సీలయన్–7..చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం బీవైడీ భారత్‌లో సీలయన్–7 కూపే–ఎస్యూవీ ఆవిష్కరించింది. కంపెనీ నుంచి ఇది భారత మార్కెట్లో నాల్గవ మోడల్‌గా నిలవనుంది. 82.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్ చేస్తే వేరియంట్‌నుబట్టి 542–567 కిలోమీటర్లు పరుగెడుతుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పర్ఫామెన్స్ వేరియంట్ 4.5 సెకన్లలో, ప్రీమియం వేరియంట్ 6.7 సెకన్లలో అందుకుంటుంది.ఒలెక్ట్రా బ్లేడ్ బ్యాటరీ ఛాసీ..హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా 12 మీటర్ల పొడవున్న బ్లేడ్ బ్యాటరీ ఛాసీని ఆవిష్కరించింది. 9 మీటర్ల పొడవున్న సిటీ బస్, 12 మీటర్ల పొడవుతో కోచ్ బస్ సైతం ప్రదర్శించింది. బ్లేడ్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2024 సెప్టెంబర్ 30 నాటికి 2,200లకుపైగా యూనిట్ల ఎలక్ట్రిక్ బస్‌లను సరఫరా చేసి ప్రజా రవాణా రూపు రేఖలను మార్చినట్టు ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. అశోక్ లేలాండ్ సాథీవాణిజ్య వాహనాలు, బస్‌ల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ సాథి పేరుతో తేలికపాటి చిన్న వాణిజ్య వాహనాన్ని ఆవిష్కరించింది. అత్యాధునిక ఎల్ఎన్టీ సాంకేతికతతో తయారైంది. 45 హెచ్‌పీ పవర్, 110 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. 1,120 కిలోల బరువు మోయగలదు. ధర రూ.6.49 లక్షలు. అలాగే మల్టీ యాక్సెల్, ఫ్రంట్ ఇంజన్, 15 మీటర్ల పొడవున్న గరుడ్–15 ప్రీమియం బస్ సైతం కొలువుదీరింది. 42 స్లీపర్ బెర్తులను ఈ బస్‌లో ఏర్పాటు చేశారు. కాగా, ఈ–టిరాన్ పేరుతో ఎలక్ట్రిక్ పోర్ట్ టెర్మినల్ ట్రాక్టర్‌ను సైతం కంపెనీ ఆవిష్కరించింది. మైక్రో మొబిలిటీతో బజాజ్?స్విట్జర్లాండ్‌కు చెందిన మైక్రో మొబిలిటీ సిస్టమ్స్‌లో వాటాను కొనుగోలు చేయడంతో సహా ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిళ్లను ఉత్పత్తి, ఎగుమతి చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం బజాజ్ ఆటో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మైక్రోలీనో పేరుతో రెండు సీట్ల ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్‌ను, అలాగే మైక్రోలెటా పేరుతో మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మైక్రో మొబిలిటీ తయారు చేస్తోంది. నగరాల్లో తక్కువ దూరం ప్రయాణానికి అనువైన వాహనాల తయారీలో మైక్రో మొబిలిటీ సిస్టమ్స్‌కు పేరుంది.జేబీఎం ఎలక్ట్రిక్ కొత్త వాహనాలుజేబీఎం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎక్స్పో వేదికగా గెలాక్సీ లగ్జరీ కోచ్, ఎక్స్‌ప్రెస్ ఇంటర్సిటీ బస్, లో ఫ్లోర్ మెడికల్ మొబైల్ యూనిట్ ఈ–మెడిలైఫ్, దేశంలో తొలిసారిగా 9 మీటర్ల పొడవున్న టార్మాక్ కోచ్ ఈ–స్కైలైఫ్ను విడుదల చేసింది. లిథియం–అయాన్ బ్యాటరీలు కలిగిన ఈ వాహనాలకు ఆల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది. ఇప్పటికే కంపెనీ భారత్‌తోపాటు యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో 1,800 ఎలక్ట్రిక్ బస్‌లను విక్రయించింది. 10,000 పైచిలుకు ఈ–బస్‌లకు ఆర్డర్ బుక్ ఉందని జేబీఎం గ్రూప్ వైస్ చైర్మన్ నిశాంత్ ఆర్య తెలిపారు. -
EICMA 2024 : కళ్ళు చెదిరే సరికొత్త బైకులు.. చూస్తే మతిపోవాల్సిందే! (ఫోటోలు)
-
బజాజ్ చేతక్ స్పెషల్ ఎడిషన్.. అమెజాన్‌లో కోనేయండి
బజాజ్ ఆటో దేశీయ విఫణిలో 'చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ.1.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది టాప్-స్పెక్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా తయారైంది. ఆగష్టు 5నుంచి అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ బ్రూక్లిన్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. అయితే డిజైన్ మాత్రం దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ అలర్ట్, హిల్-హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.చేతక్ 3201 ప్రత్యేక ఎడిషన్.. ప్రీమియమ్ వేరియంట్ మాదిరిగానే అదే 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 136 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 73 కిమీ కావడం గమనించదగ్గ విషయం. మార్కెట్లో ఈ స్కూటర్.. ఏథర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఉన్న వనరుల్నే వాడుకుంటాం : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్ఆర్డీ)లోని ఖాళీ స్థలాన్ని వినియోగించుకుంటామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం మీడియా చిట్ చాట్‌లో పాల్గొని కీలక విషయాలు వెల్లడించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలంలో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ నిర్మిస్తామని, కొత్తగా వాహనాలు కూడా కొనుగోలు చేయమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని అన్నారు. అధికారుల నియామకంలో ఫైరవీలు ఉండని అన్నారు. అధికారుల బదిలీలు ఉంటాయని, కానీ బదిలీ విషయంలో వారి వెంటపడమని సీఎం రేవంత్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12, 14 గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదన్నారు. అన్ని అంశాలపై, అందరితో చర్చించి శ్వేతపత్రాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. రేపు(శుక్రవారం) బీఏసీలో సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా రాయదుర్గం-ఎయిర్పోర్ట్ మెట్రో ఉపయోగకరంగా ఉండదని, విమానాశ్రయానికి మరో మార్గంలో మెట్రోను ప్లాన్ చేస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. చదవండి: ప్రజాభవన్‌లోకి భట్టి ఫ్యామిలీ గృహ ప్రవేశం -
108 సేవలకు రూ.725 కోట్లు
సాక్షి, అమరావతి: అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలకు గురై ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న వారికి 108 అంబులెన్స్‌లు సంజీవనిలా మారాయి. ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వేగంగా ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలను నిలబెడుతున్నాయి. ప్రాణం విలువ తెలిసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టీడీపీ హయాంలో నిర్వీర్యమైన 108 వ్యవస్థకు ఊపిరి పోసింది. 768 అంబులెన్స్‌ల ద్వారా ప్రజలకు ఉచితంగా సేవలందించేందుకు ఇప్పటి వరకూ రూ.589 కోట్లను ఖర్చు చేయగా కొత్త వాహనాల కొనుగోలుకు మరో రూ.136 కోట్లకుపైగా వ్యయం చేయడం గమనార్హం. గర్భిణులే అత్యధికం.. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున మూడు వేల మందికి అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి. 2020 జూలై నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి 36 లక్షల మంది సేవలు పొందారు. వీరిలో అత్యధికంగా 23 శాతం మంది గర్భిణులుండగా 14 శాతం కిడ్నీ బాధితులు, 11 శాతం మంది రోడ్డు ప్రమాద బాధితులున్నారు. నిర్వహణకు ఏటా రూ.188 కోట్లకు పైగా రోడ్డు ప్రమాదాల బాధితులు, గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని ఎంత త్వరగా ఆస్పత్రికి తరలిస్తే ప్రాణ రక్షణకు అంత ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో 108 అంబులెన్స్‌ల నిర్వహణ, ఉచితంగా అత్యవసర రవాణా సేవలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. క్షేత్ర స్థాయిలో అంబులెన్స్ కార్యకలాపాల కోసం 3700 మందికి పైగా విధులు నిర్వహిస్తుండగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లో మరో 311 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి వేతనాలతో పాటు అంబులెన్స్‌ల నిర్వహణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ప్రతి నెలా 108 అంబులెన్సుల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచ్చిస్తోంది. ఏడాదికి రూ.172.68 కోట్లను నిర్వహణ కోసం కేటాయిస్తోంది. దీనికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి మొత్తం రూ.188 కోట్లకు పైగా వ్యయం చేస్తోంది. గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా వాహనాలు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉండగా మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి తెర దించుతూ సీఎం జగన్ 2020 జూలై 1న ఏకంగా 412 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా 20 కొత్త అంబులెన్స్‌లను రూ.4.76 కోట్లతో 2022 అక్టోబర్‌లో అదనంగా కొనుగోలు చేశారు. దీంతో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కి.మీకిపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. వీటి కొనుగోలుకు ప్రభుత్వం మరో రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ఇలా రూ.136.02 కోట్లు అంబులెన్స్ కొనుగోలుకు వెచ్చించారు. తద్వారా నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు కోసం రూ.725.02 కోట్లు ఖర్చు చేశారు. -
సాయుధ బలగాల కోసం వీర్ ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్స్ అదుర్స్!
హైదరాబాద్: కన్జూమర్ టెక్నాలజీ సంస్థ ఉడ్చలో కొత్తగా వీర్‌బైక్ పేరిట ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఆవిష్కరించింది. సాయుధ బలగాల కోసం దీర్ఘకాలం మన్నే, చౌకైన రవాణా సాధనాన్ని అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు సాహిల్ ఉత్తేకర్ తెలిపారు. (ఇదీ చదవండి: రూ.8 లక్షలకే ఎంజీ ఎలక్ట్రిక్ కారు!) మన్నికైన తేలికపాటి ఫ్రేమ్, ఎలక్ట్రిక్ కటాఫ్‌లతో డిస్క్ బ్రేక్‌లు, సర్దుబాటు చేసుకోగలిగే సీటు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఏడాది వారంటీ తదితర ప్రత్యేకతలు ఈ విద్యుత్ బైక్‌లో ఉంటాయని సంస్థ సీఈవో రవి కుమార్ పేర్కొన్నారు. ఆలివ్ గ్రీన్, నేవల్ వైట్, ఎయిర్‌ఫోర్స్ బ్లూ తదితర అయిదు రంగుల్లో ఈ బైక్‌లు లభ్యమవుతాయని తెలిపారు. -
రోడ్డెక్కిన 2,11,20,441 వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2,11,20,441 యూనిట్లు. భారత రోడ్లపైకి 2022 సంవత్సరంలో కొత్తగా దూసుకొచ్చిన వాహనాల సంఖ్య ఇది. 2021లో అమ్ముడైన 1,83,21,760 యూనిట్లతో పోలిస్తే ఇది 15.28 శాతం వృద్ధి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. 2020తో పోలిస్తే ఈ సంఖ్య 17 శాతం అధికం. కోవిడ్ ముందస్తు సంవత్సరం 2019తో పోలిస్తే 10 శాతం తగ్గుదల నమోదైంది. ఇక 2022లో ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం కొత్త శిఖరాలను తాకిందని ఎఫ్ఏడీఏ వివరించింది. ఆశించిన స్థాయిలో వృద్ధి లేదు.. ‘అక్టోబర్, నవంబర్‌లో మెరుగైన అమ్మకాలు నమోదైనప్పటికీ డిసెంబర్లో తగ్గుముఖం పట్టడంతో ద్విచక్ర వాహన విభాగం మరోసారి ఆకట్టుకోవడంలో విఫలమైంది. ద్రవ్యోల్బణం, యాజమాన్య ఖర్చు అధికం కావడం, గ్రామీణ మార్కెట్ ఇంకా పూర్తిగా పుంజుకోకపోవడం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన అమ్మకాలు పెరగడం వంటి కారణాలతో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కలిగిన ద్విచక్ర వాహన విభాగంలో ఇంకా ఆశించిన స్థాయిలో వృద్ధి కనిపించలేదు’ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ఈవీలు మూడంకెల వృద్ధి.. గతేడాది దేశవ్యాప్తంగా రిటైల్‌లో ద్విచక్ర వాహనాలు 1,53,88,062 యూనిట్లు విక్రయం అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.37 శాతం వృద్ధి నమోదైంది. ప్యాసింజర్ వెహికిల్స్ 16.35 శాతం అధికమై 34,31,497 యూనిట్లకు చేరాయి. ఈ విభాగం అమ్మకాల్లో దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. కోవిడ్ కారణంగా తిరోగమనం చెందిన త్రిచక్ర వాహన విభాగం రికవరీ అయింది. 2019తో పోలిస్తే అంతరం తగ్గింది. 2021తో పోలిస్తే త్రీ–వీలర్లు విక్రయాలు 71.47 శాతం ఎగసి 6,40,559 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహన అమ్మకాలు మూడంకెల వృద్ధి సాధించాయి. దీంతో ఈ విభాగంలో ఈవీల వాటా 50 శాతం మించింది. ట్రాక్టర్లు.. జీవిత కాల రికార్డు.. ట్రాక్టర్ల విక్రయాలు వరుసగా మూడేళ్లను మించి 2022లో 7.94 లక్షల యూనిట్లతో జీవిత కాల రికార్డు నమోదు చేశాయి. మెరుగైన రుతుపవణాలు, రైతుల వద్ద నగదు లభ్యత, వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర, ప్రభుత్వం పెద్ద ఎత్తున పంటల కొనుగోళ్లు ఇందుకు కారణం. వాణిజ్య వాహనాలు 6,55,696 నుంచి 31.97 శాతం దూసుకెళ్లి 8,65,344 యూనిట్లకు ఎగశాయి. కమర్షియల్ వెహికిల్స్ సెగ్మెంట్ మొత్తం 2022లో వృద్ధి చెందుతూనే ఉంది. 2019 స్థాయిలో అమ్మకాలు ఉన్నాయి. తేలికపాటి వాణిజ్య వాహనాలు (ఎల్సీవీ), భారీ వాణిజ్య వాహనాలు (హెచ్‌సీవీ), బస్‌లు, నిర్మాణ రంగ యంత్రాల్లో డిమాండ్‌కు తోడు.. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ విభాగాన్ని వృద్ధి బాటలో కొనసాగించాయి. ప్రత్యేక స్కీమ్‌లు ప్రకటించాలి.. ‘వాహన తయారీ సంస్థలు డిసెంబరులో సాధారణ ధరలను పెంచాయి. ఈ ఏడాది ప్రారంభంలోనూ ధరలను సవరించాయి. ఇది కాకుండా బీఎస్–6 రెండవ దశ నిబంధనలు వస్తున్నాయి. దీని ప్రభావంతో అన్ని వాహన విభాగాల్లో ధరల పెంపుదల ఉంటుంది. దీనిని ఎదుర్కోవడానికి తయారీ కంపెనీలు ప్రత్యేక పథకాలను ప్రకటించాలి. తద్వారా రిటైల్ అమ్మ కాలు ఊపందుకుంటాయి’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. -
‘ఆపద్బాంధవి’ మరింత బలోపేతం.. మరిన్ని 108 అంబులెన్స్‌లు
సాక్షి, అమరావతి: అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌చేసిన నిమిషాల్లో కుయ్.. కుయ్‌మంటూ వచ్చి బాధితులను ఆస్పత్రులకు చేరుస్తూ ‘108’ అంబులెన్స్‌లు ఆపద్బాంధవిలా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. ఈ సేవలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కొత్త వాహనాల కొనుగోలుకు చర్యలు చేపడుతోంది. టీడీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ‘108’ సేవలకు సీఎం వైఎస్ జగన్ ఊపిరిలూదిన విషయం తెలిసిందే. ఫలితంగా 2020 జూలై నుంచి ఇప్పటివరకూ ఈ అంబులెన్స్‌లు 10 లక్షలకు పైగా ఎమర్జెన్సీ కేసుల్లో ప్రజలను ఆస్పత్రులకు చేర్చాయి. ఫోన్‌చేసిన వెంటనే అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకునే సమయం గణనీయంగా తగ్గింది. రూ.46 కోట్లతో 146 వాహనాలు టీడీపీ హయాంలో 440 అంబులెన్స్‌లతో ఏపీలో 108 సేవలు అంతంతమాత్రంగా ఉండేవి. సీఎం వైఎస్ జగన్ వచ్చాక 768 అంబులెన్స్‌లతో వాటి సేవలను విస్తరించారు. తాజాగా.. రూ.46 కోట్లతో మరో 146 కొత్త వాహనాల కొనుగోలుకు వైద్యశాఖ చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకోసం రూ.107 కోట్లతో 432 కొత్త 104 వాహనాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. కానీ, రాష్ట్రంలో 10,032 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా పీహెచ్సీ వైద్యులు నెలలో రెండుసార్లు ఒక్కో గ్రామాన్ని 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ)తోపాటు విలేజ్ క్లినిక్‌లను సందర్శించాలి. ఇప్పటికే ఉన్న 656 ‘104 ఎంఎంయూ’ వాహనాలతో 7,166 విలేజ్ క్లినిక్‌లను సందర్శిస్తున్నారు. మిగిలిన విలేజ్ క్లినిక్‌లలోనూ నెలలో రెండుసార్లు సందర్శించడానికి 260 నూతన 104 వాహనాలు కొనుగోలు చేస్తే సరిపోతుందని వైద్యశాఖ నిర్ణయించింది. ఇదీ చదవండి: చెత్తతో ‘పవర్’ ఫుల్ -
ఇక ‘తుక్కు’ రేగుతుంది..!
న్యూఢిల్లీ: కాలుష్యకారక పాత వాహనాల వినియోగాన్ని తగ్గించి, కొత్త వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాత వాహనాలను తుక్కు కింద మార్చేందుకు ఇచ్చి, స్క్రాప్ సర్టిఫికెట్ తీసుకుంటే కొత్త కారుకు రిజిస్ట్రేషన్ ఫీజును మాఫీ చేయాలని భావిస్తోంది. అలాగే, వ్యక్తిగత వాహనాలకు 25 శాతం దాకా, వాణిజ్య వాహనాలకు 15 శాతం దాకా రోడ్ ట్యాక్స్‌లో రిబేటు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించనుంది. ఇక స్క్రాపింగ్ సర్టిఫికెట్ గల వాహనదారులకు కొత్త వాహనాలపై అయిదు శాతం మేర డిస్కౌంటు ఇచ్చేలా వాహనాల తయారీ సంస్థలకు కూడా సూచించనుంది. వాహనాల స్క్రాపేజీ విధానంపై కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పార్లమెంటులో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ విధానంపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాబోయే కొన్ని వారాల్లో ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రచురించనున్నట్లు ఆయన తెలిపారు. రిజిస్టర్డ్ తుక్కు కేంద్రాల్లో పాత, అన్‌ఫిట్ వాహనాలను స్క్రాప్ కింద ఇచ్చేసి, స్క్రాపింగ్ సర్టిఫికెట్ పొందే యజమానులకు ఈ స్కీమ్ కింద పలు ప్రోత్సాహకాలు లభిస్తాయని గడ్కరీ తెలిపారు. స్క్రాప్ కింద ఇచ్చేసే వాహనాల విలువ.. కొత్త వాహనాల ఎక్స్‌షోరూం రేటులో సుమారు 4–6% దాకా ఉండేలా స్క్రాపింగ్ సెంటర్ సర్టిఫికెట్ జారీ చేసే అవకాశం ఉంటుందన్నారు. దేశీ వాహన పరిశ్రమ టర్నోవరు ప్రస్తుతం రూ. 4.5 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ. 10 లక్షల కోట్లకు పెరిగేందుకు స్క్రాపేజీ పాలసీ తోడ్పడగలదని మంత్రి తెలిపారు. అందరికీ ప్రయోజనకరం..: స్క్రాపేజీ విధానం అన్ని వర్గాలకూ ప్రయోజనకరంగా ఉండబోతోందని గడ్కరీ తెలిపారు. ఇంధన వినియోగ సామర్థ్యం మెరుగుపడేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు, కొత్త వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. పాత, లోపభూయిష్టమైన వాహనాల సంఖ్యను తగ్గించడం ద్వారా కాలుష్య కారక వాయువుల విడుదలను నియంత్రించేందుకు, రహదారి.. వాహనాల భద్రతను మెరుగుపర్చేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు. ప్రాణాంతకంగా రోడ్డు ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య కోవిడ్–19 మరణాల కన్నా ఎక్కువ ఉండటం ఆందోళనకరమని గడ్కరీ తెలిపారు. గతేడాది కోవిడ్–19తో 1.46 లక్షల మంది మరణించగా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృత్యువాత పడ్డారని ఆయన పేర్కొన్నారు. వీరిలో అత్యధిక శాతం 18–35 ఏళ్ల మధ్య వయస్సున్న వారేనని మంత్రి చెప్పారు. తుక్కు పాలసీ ప్రతిపాదనల్లో మరికొన్ని... ► వాహనాల ఫిట్నెస్ టెస్టులు, స్క్రాపింగ్ సెంటర్ల సంబంధ నిబంధనలు 2021 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. పదిహేనేళ్లు పైబడిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలను తుక్కు కింద మారుస్తారు. ► 2023 ఏప్రిల్ 1 నుంచి భారీ వాణిజ్య వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్‌ను తప్పనిసరి చేస్తారు. మిగతా వాహనాలకు దశలవారీగా 2024 జూన్ 1 నుంచి దీన్ని అమల్లోకి తెస్తారు. ► ఫిట్నెస్ టెస్టులో విఫలమైనా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణలో విఫలమైనా సదరు వాహనాల జీవితకాలం ముగిసినట్లుగా పరిగణిస్తారు. 15 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందడంలో విఫలమైన వాణిజ్య వాహనాలను డీ–రిజిస్టర్ చేస్తారు. ఇలాంటి వాహనాల వినియోగాన్ని తగ్గించే దిశగా 15 ఏళ్ల పైబడిన కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ టెస్టు, సర్టిఫికెట్ల ఫీజును భారీగా పెంచుతారు. ► ప్రైవేట్ వాహనాల విషయానికొస్తే .. 20 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ టెస్టులో లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణలో విఫలమైన పక్షంలో డీ–రిజిస్టర్ చేస్తారు. 15 ఏళ్ల నుంచే రీ–రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచుతారు. ► ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో రిజిస్టర్డ్ వాహనాల స్క్రాపింగ్ కేంద్రాల (ఆర్వీఎస్ఎఫ్) ఏర్పాటుకు కేంద్రం ప్రోత్సాహమిస్తుంది. స్క్రాపింగ్ కేంద్రం ఏర్పాటుకు మార్గదర్శకాల ముసాయిదా.. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రం (ఆర్వీఎస్ఎఫ్) ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 100 స్క్రాపింగ్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. ఆర్వీఎస్ఎఫ్ ఏర్పాటుకు రూ. లక్ష లేదా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు నిర్దేశించే మొత్తం ప్రాసెసింగ్ ఫీజుగా ఉంటుంది. ప్రతీ ఆర్వీఎస్ఎఫ్కు ముం దస్తు డిపాజిట్‌గా రూ.10 లక్షల బ్యాంక్ గ్యా రంటీ ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కో సం దరఖాస్తు చేసుకున్న 60 రోజులల్లోగా అనుమ తులపై నిర్ణయం తీసుకోవాలి. ఈ ముసా యిదా నిబంధనలపై సంబంధిత వర్గాలు 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలి. -
ఏపీలో సరికొత్తగా 108, 104 వాహనాలు
-
కాలుష్య రహిత వాహనాలనే నడిపిద్దాం
సాక్షి,జనగామ: కాలుష్య రహిత వాహనాలను నడిపిస్తూ రాబోయే తరాలకు సంపూర్ణ ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని గుడ్‌లక్ వెహికిల్ ఇండస్ట్రీస్ ఎండీ పెద్ది శరత్, డైరెక్టర్ రవీందర్ అన్నారు. ఎలక్ట్రికల్ ఆటోల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది.ఈ సందర్భంగా గుడ్‌లక్ వెహికిల్ ఇండస్ట్రీస్ ఎండీ పెద్ది శరత్, డైరెక్టర్ రవీదర్ మాట్లాడుతూ నాలుగు బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రికల్ ఆటోలు ఎనిమిది గంటల పాటు చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని తెలిపారు. విద్యుత్ కేవలం నాలుగు యూనిట్లు మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. ఒక కిలోమీటరు ప్రయాణానికి ఖర్చు 30 పైసలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్యాసింజర్ ఆటో ధర రూ.1,25 లక్షల నుంచి రూ.1,40లక్షలు, ట్రాలీ ఆటో ధర రూ.1,25 లక్షల నుంచి రూ.1,35 లక్షల వరకు ఉందని తెలిపారు. 25 కిలోమీటర్ల వేగంతో నడిచే ఆటోలకు ఆర్టీ అప్రూవల్ లేకున్నా రోడ్డుపై తిరగవచ్చన్నారు. అత్యవసర సమయంలో బ్యాంకు రుణం, బీమా పొందాలనుకునే యజమానులు వెహికిల్ రిజిష్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓజోన్ పొరపై పొల్యూషన్ చూపిస్తున్న ప్రమాద సంకేతాలను దృష్టిలో ఉంచుకుని కాలుష్య రహిత ఆటోలను మాత్రమే వినియోగించాలని సూచించారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా బ్రాంచీలను స్థాపించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో జనగామ మునిసిపల్ కమిషనర్ రవీందర్ యాదవ్, టౌన్ ప్లానింగ్ అధికారి రంగు వీరస్వామి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి కేఆర్ లత, మతిన్, వెంకటేశ్వర్లు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 1 నుంచి కొత్త వాహనాలు కొంటే..
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలకు మేరకు సెప్టెంబరు 1 న లేదా తర్వాత విక్రయించిన వాహనాలపై దీర్ఘకాలిక థర్డ్ పార్టీ భీమా వర్తించనుంది. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్, బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) అన్నిబీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా బీమా సంస్థలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఇప్పుడు కార్ల కోసం మూడు సంవత్సరాల బీమా, ద్విచక్ర వాహనాలకు ఐదు సంవత్సరాల బీమాను ఆఫర్ చేయాలి. అలాగే కొత్త కారు, లేదా బైక్ కొనుగోలు చేసే వినియోగదారులు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. భవిష్యత్ వాహన కొనుగోలుదారులు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ కింద కొత్త కార్ల కోసం రూ. 24వేల దాకా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త మోటార్ సైకిల్స్ కొనుగోలు చేసినవారు 13వేల రూపాయల దాకా చెల్లించాల్సి ఉంటుంది. వాహన్ మోడల్, ఇంజీన్ కెపాసిటీ ఆధారంగా బీమాను నిర్ణయిస్తారు. జూలై 20,2018న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో థర్డ్ పార్టీ వారికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని బీమా సంస్థలను కోరింది. ఇంతకుముందు ఇది ఒక్క సంవత్సరం మాత్రమే థర్డ్ పార్టీకి బీమా కల్పించేది. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ విధానం ప్రకారం కొత్త రేట్లు సెప్టెంబర్ 1, 2018 నుంచి మార్చి 31,2019 వరకు కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి అమలు అవుతుందని ఐఆర్డీఏఐ ప్రకటించింది. దీని ప్రకారం వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే మొత్తం మూడేళ్లకుగానీ ఐదేళ్లకుగానీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వాహనం మరొకరికి అమ్మితేనే వాహన యజమానిపై ఉన్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రద్దు చేసి...కొత్త యజమానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లవివరాలు ఇలా ఉన్నాయి. ప్రైవేట్ కార్లకు: మూడేళ్ల ప్రీమియం 1000సీసీ మించకుండా ఉండే వాహనానికి రూ.5,286/- 1000సీసీ నుంచి 1500సీసీ మధ్య ఉండే వాహనానికి : రూ.9,534 1500 సీసీకి మించితే : రూ. 24,305 టూ వీలర్స్ : ఐదేళ్ల ప్రీమియం 75 సీసీ లోపు : రూ.1,045 75సీసీ నుంచి 150 సీసీ మధ్య : రూ. 3,285 150 సీసీ నుంచి 350 సీసీ మధ్య: రూ. 5453 350 సీసీకి మించి : రూ.13,034 -
కొత్త రకం వాహనాలు, ఎలా ఉన్నాయో చూడండి
కొత్త రకం చిన్న వాహనాలు-క్వాడ్రిసైకిల్స్‌కు భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. రోడ్డు రవాణా, ప్రధాన రహదారుల మంత్రిత్వ శాఖ వీటిని ఆమోదించింది. నాలుగు చక్రాలు కలిగిన ఈ కొత్త రకం వాహనాలు, పర్సనల్ వెహికిల్స్‌గా, కమర్షియల్ వెహికిల్స్‌గా వాడుకోవచ్చని తెలిపింది. వీటికి సంబంధించిన ఉద్గారాలు, క్రాష్, ఇతర నిబంధనల జాబితాను ప్రభుత్వం, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-ఏఆర్ఏఐలు కలిసి నిర్దేశించనున్నాయి. ఈ కేటగిరీలో తొలి వాహనం బజాజ్ లాంచ్ చేయనుంది. బజాజ్ క్యూట్ పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో ఇలాంటి స్పెషల్ కేటగిరీ వాహనాలు లేవు. అయితే ఈ వాహనాలపై ఏ మేర జీఎస్టీ రేటు అమలు చేస్తారో ప్రభుత్వం ఇంకా స్పష్టీకరించలేదు. ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న గ్రీన్ ప్లేట్ల మాదిరిగా ఈ వాహనాలకు స్పెషల్ రిజిస్ట్రేషన్ ప్లేట్లను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ వాహనాలు 475 కేజీల కంటే తక్కువ బరువు ఉన్నాయి. ఇంకా పొడవు, వెడల్పు కొలతల గురించి సరియైన క్లారిటీ లేదు. ఈ కేటగిరీ వాహనాల వివరాలపై త్వరలోనే రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఓ సర్క్యూలర్ జారీచేయనుంది. ఈ క్వాడ్రిసైకిల్ భారత్‌లో అత్యంత కఠినమైన క్రాష్ టెస్ట్ ప్రొగ్రామ్‌ను కూడా పాస్ కావాల్సి ఉంది. అంతేకాక పెట్రోల్, డీజిల్, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వాహన ఉద్గారాల టెస్ట్‌లను కూడా ఈ వాహనాలపై నిర్వహించనున్నారు. ఫుల్ ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ క్వాడ్రిసైకిల్స్‌కు ఇప్పటికే ప్రభుత్వం అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వాహనాలను భారత రోడ్లపై అనుమతించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత రోడ్లపై క్వాడ్రిసైకిళ్లు సురక్షితమైనవి కావని, ఇవి లోపపూరితమైన డిజైన్‌ను కలిగి ఉన్నావని పలువురంటున్నారు. -
నో డిస్కౌంట్ ప్లీజ్.!
సాక్షి, సిటీబ్యూరో: కొత్తమోడల్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నప్పుడు పాతవాహనాల అమ్మకాలను పెంచుకునేందుకు డీలర్లు సైతం కొద్దో గొప్పో డిస్కౌంట్లు ప్రకటిస్తారు. మార్కెట్లోని అన్ని వస్తువుల అమ్మకాల తరహాలోనే ఆటోమొబైల్ రంగంలోనూ ఇలాంటి రాయితీలు సర్వ సాధారణం. అయితే ఈ రాయితీలే ఆటోమొబైల్ రంగానికి గుదిబండలుగా మారాయి. ప్రభుత్వానికి జీవితకాల పన్నుపైన ఆదాయానికి గండి పడుతుందంటూ డిస్కౌంట్లతో కూడిన ఇన్వాయీస్లను స్వీకరించేందుకు రవాణాశాఖ నిరాకరిస్తుండగా, షౌరూమ్‌లు ఇచ్చే ఇన్వాయీస్లనే ప్రామాణికంగా తీసుకొని వాహనాలను రిజిస్ట్రేషన్ చేయాలని ఆటోమొబైల్ డీలర్లు పేర్కొంటున్నారు. దీంతో నగరంలో డిస్కౌంట్ సేల్స్ వివాదాస్పదంగా మారింది. మరోవైపు ఇదే అంశంపై కొందరు వ్యక్తులు షౌరూమ్‌లు ఇచ్చే ఇన్వాయీస్లనే ప్రామాణికంగా తీసుకొని వాహనాలను రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. వాహన తయారీదారులు నిర్ణయించిన వాస్తవ ధర (ఎక్స్‌షోరూమ్ ప్రైస్) ప్రకారమే జీవితకాలపన్ను చెల్లించాలని రవాణాశాఖ వాదిస్తోంది. ఇదే అంశంపైన ఇటీవల ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో డీలర్లు, రవాణా అధికారుల మధ్య చర్చలు జరిగాయి. వివరాల్లోకి వెళితే.గ్రేటర్ పరిధిలో సుమారు 200 మంది ఆటోమొబైల్ డీలర్లు, మరో వంద మందికి పైగా సబ్ డీలర్లు నగరంలో ప్రతి రోజూ 2000 నుంచి 3000 వరకు వాహనాలను విక్రయిస్తారు. ఇందులో 70 శాతం వరకు బైక్‌లు ఉండగా, మరో 15 శాతం వరకు కార్లు, 5 శాతం లగ్జరీ వాహనాలు, మిగతా 5 శాతం ఇత ర వాహనాలు ఉంటాయి. ఆటోమొబైల్ డీలర్ల మధ్య ఉండే సహజమైన పోటీ వాతావరణం, అమ్మకాలను పెంచుకునేందుకు వినియోగదారులను ఆకట్టుకొనే చర్యల్లో భాగంగా డీలర్లు వాహనాల వాస్తవ ధర (ఎక్స్‌షోరూమ్ ప్రైస్)పైన ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తున్నారు. ఉదాహరణకు మారుతీ స్విఫ్ట్ వాస్తవ ధర రూ.10.25 లక్షలు ఉండగా, డీలర్లు దానిని రూ.9.9 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. వారు విక్రయించిన మేరకే ఇన్వాయీస్లు ఇస్తున్నారు.అంటే ఒక వాహ నంపైన రూ.25 వేల నుంచి రూ.30 వేల వర కు రాయితీ లభిస్తుంది. ఇక్కడే వివాదం నెల కొంటోంది. రూ.10 లక్షల లోపు ఖరీదైన వాహనాలపైన 12 శాతం చొప్పున, రూ.10 లక్షలు దాటిన వాటిపైన 14 శాతం చొప్పున పన్ను వసూలు చేస్తున్నారు. అంటే డీలర్లు ఇచ్చే డిస్కౌంట్ కారణంగా ఒక వాహనంపైన ఆర్టీఏ ఆదాయం ఏకంగా 2 శాతానికి పడిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ప్రకామే అధికారులు పన్నులు వసూలు చేస్తున్నారు. గత సంవత్సరం నగరంలోని వివిధ ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో సుమారు రూ.17 కోట్లు ఇలా అదనంగా రాబట్టారు. డిస్కౌంట్ ధరలపై డీలర్లు ఇచ్చే ఇన్వాయీస్ ఆధారంగా వాహనాల రిజిస్ట్రేషన్లకు వచ్చే వినియోగదారులపైన అదనపు భారం పడుతోంది. రూ.10.25 లక్షల వాహనాన్ని రూ.9.9 లక్షలకే కొనుగోలు చేసిన వ్యక్తి రవాణాశాఖ నిబంధనల మేరకు అసలు ధర ప్రకారమే పన్ను చెల్లించాల్సి వస్తుండటంతో ఆటోమొబైల్ డీలర్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై కొందరు హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఇన్వాయీస్ ప్రామాణికం.... వస్తువుకు విక్రయించిన ధరనే ప్రామాణికంగా తీసుకోవాలని డీలర్లు పట్టుబడుతున్నారు. ఇన్వాయీస్నే ప్రామాణికంగా భావించాలని డిమాండ్ చేస్తున్నారు. విక్రేతలు, కొనుగోలుదారులకు మధ్య జోక్యం తగదన్నారు. మంగళవారం రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలోనూ ఇదే అంశంపైన కొందరు డీలర్లు అధికారులను ప్రశ్నించారు. తమ వస్తువులను ఎంతకైనా విక్రయించే హక్కు తమకు ఉందని, తాము విక్రయించిన ధరల ప్రకారమే జీవితకాల పన్నులు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ ఎక్స్‌షోరూమ్ ధరల ప్రకారం పన్నులు వసూలు చేయడం వల్ల అంతిమంగా వినియోగదారుడు తనకు లభించే రాయితీని కోల్పోవలసి వస్తోంది. ప్రభుత్వం వినియోగదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకోవచ్చు కదా..’’ అని పలువురు డీలర్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు భవిష్యత్తులో ఇన్వాయీస్ల స్థానంలో ఎక్స్‌షోరూమ్ ధరలను మాత్రమే పరిగణనలోకి తీసుకొనేలా నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసీ)తో అనుసంధానమయ్యేందుకు రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది. దాంతో వాహనాల పైన వినియోగదారులకు లభించే డిస్కౌంట్లు నిలిచిపోయే అవకాశం ఉంది. -
పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు ఇంకెన్నేళ్లు?
న్యూఢిల్లీ : కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పెట్రోల్, డీజిల్ కార్ల వాడుకం నిషేధం దిశగా ప్రపంచం కదులుతోంది. పెట్రోల్, డీజిల్ వాడుకాన్ని పూర్తిగా నిరోధించి, కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. భారత్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలంటే ఇంకా 30 ఏళ్లు పట్టేలా కనిపిస్తోంది. భారత్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్‌తో రూపొందే కొత్త వాహనాల విక్రయాలకు 2047 ఏడాది వరకు సమయం పడుతుందని ఆటోమొబైల్ ఇండస్ట్రి బాడీ సియామ్ ప్రతిపాదించింది. అదేవిధంగా ఇంట్రా-సిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్లీట్‌ను 2030 వరకు సాధించవచ్చని వెల్లడించింది. 2030 వరకు 40 శాతం కొత్త వాహనాల విక్రయాలు పూర్తిగా ఎలక్ట్రిక్‌తో రూపొందేవిగా ఉండాలని సియామ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. దీనిపై ప్రభుత్వానికి ఓ పత్రం కూడా నివేదించినట్టు పేర్కొంది. పబ్లిక్ మొబిలిటీ కోసం 100 శాతం ఎలక్ట్రిక్ అందించేలా ప్రభుత్వ విజన్‌కు అనుకూలంగా పనిచేస్తున్నామని, 2030 వరకు వ్యక్తిగత అవసరాల కోసం వాడే మొబిలిటీలో 40 శాతం ఎలక్ట్రిక్‌వే ఉండబోతున్నట్టు సియామ్ తెలిపింది. 2030 వరకు ఒక్క పెట్రోల్ లేదా డీజిల్ కారును దేశంలో విక్రయించబోమని ఈ ఏడాది ఏఫ్రిల్‌లో విద్యుత్ శాఖ మాజీ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే భారత్ స్వాతంత్య్రం సాధించి 100 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను అందించే రోడ్‌మ్యాప్‌ను సియామ్ ప్రతిపాదించింది. ప్రభుత్వం, ఇండస్ట్రి, వివిధ వాటాదారులు కలిసి పనిచేయాలని, 100 శాతం అంకితభావంతో పెట్టుబడులు పెట్టాలని సియామ్ అధ్యక్షుడు అభయ్ ఫిరోడియా తెలిపారు. -
కొత్త వాహనదారులకు ఊరట
తిరుపతి మంగళం: కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి కాస్త ఊరట లభించింది. ఆరు నెలలుగా రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్డులు(స్మార్ట్ కార్డులు)లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎట్టకేలకు ఆర్టీఏ కార్యాలయాలకు కొంత మేరకు స్మార్ట్‌కార్డులు చేరాయి. లక్ష కార్డులకు 20 వేలు ఇచ్చారు జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో సు మారు లక్ష స్మార్ట్ కార్డులు అవసరం ఉంది. అయితే రాష్ట్ర రవాణాశాఖ నుంచి జిల్లాకు 20వేల కార్డులు మాత్రమే వచ్చాయి. అందులో ప్రధానంగా తిరుపతికి 8వేలు కార్డులు,చిత్తూరుకు 7వేలు కార్డులు చొప్పున రవాణాశాఖ కార్యాలయాలకు చేరాయి. మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి, పుత్తూరు వంటి ప్రాంతాలన్నింటికీ కలిపి 5 వేల కార్డులు మాత్రమే చేరాయి. రోజుకు 300 నుంచి 500 కార్డుల మాత్రమే ప్రింటింగ్ అవుతున్నాయి. దీంతో జిల్లాకు వచ్చిన కార్డులను వాహనదారుని పేరుపైన ప్రింట్చేసి ఇవ్వడానికే 20 రోజులు పడుతుంది. మిగిలిన కార్డులు జిల్లాకు వచ్చి వాహనదారునికి పూర్తి స్థాయిలో అందించేందుకు రవాణా శాఖకు కనీసం అంటే మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్నా తప్పని జరిమానా కొనుగోలు చేసిన వాహనాలను రిజిస్ట్రేషన్ చే యించుకున్నా ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ కార్డులు సకా లంలో అందించలేదు. దీంతో పోలీసులు, అధి కారులు హైవేలపై తనిఖీలు నిర్వహించేటప్పు డు ఆర్సీ లేకున్నా రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా విధిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్డుల పంపిణీ జరగకపోవడంలో ఆర్టీఏ నిర్లక్ష్యం ఉన్నప్పటికీ జరిమానాలు తప్పడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. దీనిపై రవాణా శాఖ, పోలీసులు చర్చించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న రసీదులనే ఆర్సీగా పరిగణించాలని వాహనదారులు కోరుతున్నారు. -
కొత్త వాహనాల కళ: భారీగా కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్ : దసరా పండుగను పురస్కరించుకుని, నగర వీధులు కొత్త వాహనాలతో కళకళలాడబోతున్నాయి. ఈ దసరాకు రోడ్డుపైకి వచ్చే కొత్త వాహనాల సంఖ్య పెరుగబోతుందని ఆటోమొబైల్ డీలర్స్, రోడ్డు ట్రాన్స్‌పోర్టు అథారిటీ అధికారిక అంచనాల్లో తెలిసింది. గత ఎనిమిది రోజుల విక్రయాలను చూసుకుంటే కనీసం 1.5 లక్షల కొత్త వాహనాలు ఈ దసరాకు రోడ్డుపై చక్కర్లు కొట్టబోతున్నట్టు వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆకర్షణీయమైన డిస్కౌంట్లు తక్కువగా ఉన్నప్పటికీ, టూ-వీలర్ కేటగిరీలో విక్రయాలు 10 శాతం పైకి ఎగిసినట్టు అధికారిక డేటా పేర్కొంది. టూ-వీలర్స్ కేటగిరీలో గతేడాది ఎంత మొత్తంలో అమ్ముడుపోయాయో, ఈ ఏడాది అంతే మొత్తంలో విక్రయమైనట్టు తెలిసింది. నగరంలో ఉన్న ఐదు రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసుల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్లు సుమారు లక్ష మేర నమోదైనట్టు ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్ పేర్కొంది. దుర్గాష్టమి రోజున కొత్త వాహనాలను కొనుగోలు చేయడం హిందూవులకు సెంటిమెంట్ అని, ఆయుధ పూజ, వాహన పూజ కోసం కొత్త వాహనాల కొనుగోళ్లు చేపడతారని ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్ పేర్కొంది. గురువారం దుర్గాష్టమి కావడంతో, ఈ విక్రయాలు మరింత పెరిగాయని, కచ్చితమైన గణాంకాలను త్వరలోనే విడుచేయనున్నట్టు తెలిపింది. ఈ దసరాకి వర్తకులకు మంచి విక్రయాలు నమోదయ్యాయని, జీఎస్టీ అమలు వినియోగదారులకు లబ్ది చేకూరినట్టు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ లీడర్ పి.టి చౌదరి(రిటైర్డ్) చెప్పారు. వచ్చే మూడు నుంచి నాలుగు రోజులు ఈ విధంగానే విక్రయాలు నమోదవుతాయని పేర్కొన్నారు. కొన్ని మోడల్స్‌కు ఎక్కువగా డిమాండ్ ఉండటంతో, చాలా మంది డీలర్స్ ఆఫర్లు ప్రకటించలేదు. కార్ల విషయానికి వస్తే, రూ.40వేల వరకు నగదు ప్రయోజనాలను వినియోగదారులు పొందారు. -
మున్సిపాలిటీలకు ఆధునిక వాహనాలు
అమరావతి: రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఆధునిక చెత్త తరలింపు వాహనాలు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 14 వాహనాలను జెండా ఊపి బుధవారం ప్రారంభించారు. ఈ వాహనాల్లో ఆధునిక టెక్నాలజీ కారణంగా చెత్త బయటకు కనపడకుండా మూసివేసినట్లు ఉంటుంది. అలాగే పెద్ద మొత్తంలో ఉన్న చెత్తను వాహనంలోనే తక్కువ మొత్తంలోకి మార్పు చేయవచ్చు. ఇతర వాహనాలకంటే 60 శాతం ఎక్కువ సామర్థ్యముండడం ఈ వాహనాల విశేషం. -
సుప్రో బ్రాండ్‌తో 7 కొత్త వాహనాలు: మహీంద్రా
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన కంపెనీ ‘మహీంద్రా’ తాజాగా తన ‘సుప్రో’ బ్రాండ్ కింద ఏడు కొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటిల్లో నాలుగు వెహికల్స్ ప్యాసెంజర్ వ్యాన్ విభాగానికి, మూడు వెహికల్స్ లోడ్ కారియర్ విభాగానికి చెందినవి ఉన్నాయి. సుప్రో మిని వ్యాన్ ప్రారంభ ధర రూ.4.71 లక్షలుగా, సుప్రో మిని ట్రక్ ప్రారంభ ధర రూ.4.28 లక్షలుగా ఉంది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ కోల్కతావి. సుప్రో మిని వ్యాన్, సుప్రో మిని వ్యాన్ వీఎక్స్, సుప్రో మిని వ్యాన్ సీఎన్జీ, సుప్రో స్కూల్ వ్యాన్ అనేవి ప్యాసెంజర్ వ్యాన్ విభాగంలోని వాహనాలు. ఇక లోడ్ కారియర్లో సుప్రో మిని ట్రక్, సుప్రో మిని ట్రక్ సీఎన్జీ, సుప్రో కార్గో వ్యాన్ అనే వెహికల్స్ ఉన్నాయి. ఈ వాహనాలన్నీ బీఎస్–4 నిబంధనలకు అనువుగా తయారయ్యాయి. -
ఇరవై ఏళ్లుగా ఉన్నాం.. కనికరించండి...
‘ఎక్సైజ్’ ప్రైవేట్ డ్రైవర్ల విజ్ఞప్తి కొత్త వాహనాలపై నియమించాలని వేడుకోలు వరంగల్ క్రైం : కొత్త వాహనాలు వస్తే తమను పర్మినెంట్ చేస్తామని సంతోషించాం... కానీ తీసివేస్తామంటున్నారు.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖలోని ప్రైవేట్ డ్రైవర్లు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 మంది ఎక్సైజ్‌శాఖలో ప్రైవేట్ డ్రైవర్లుగా గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ఎక్సైజ్ శాఖకు కొత్త వాహనాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అరుుతే, ఈ వాహనాలపై తమను పర్మినెంట్ లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తారని ప్రైవేట్ డ్రైవర్లు భావిస్తుండగా.. వీరందరినీ తొలగించాలని మంత్రి సెలవిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, ఎక్సైజ్ డెరైక్టర్అకున్ సభర్వాల్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇరవై ఏళ్లుగా శాఖను నమ్ముకున్నందున తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో హైదరాబాద్ తరహాలో వాహనాలను లోన్‌పై ఇప్పించి శాఖలోనే పెట్టుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అందరిపై జాలి చూపకున్నా... రెండేళ్లకు పైబడి పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చిన ఆ శాఖ డెరైక్టర్ వీరినిశాఖలోనే కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం కూడా వారి పాలిట శాపంగా మారిందనే చెప్పాలి. ప్రభుత్వం ఉద్యోగం కాకుండా అతి తక్కువ వేతనంతో ప్రైవేట్‌గా పనిచేస్తున్నప్పుడు తమకు బదిలీ ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుళ్ల ఫిర్యాదుతో.. ఎక్సైజ్ శాఖలోని కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు శాఖలోని ఉన్నతాధికారులకు ప్రైవేటు డ్రైవర్లపై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ డ్రైవర్ల కారణంగా తనిఖీ సమాచారం గుడుంబా తయూరీదారులకు వెళ్తోందని, తద్వారా అరికట్టలేకపోతున్నామనేది వారి ఫిర్యాదుల సారాంశం. ఇదే నిజమని న మ్ముతున్న ఉన్నతాధికారులు ప్రైవేట్ డ్రైవర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాష్ర్ట్రంలోని అనేక ప్రాంతాలలో సీజ్చేసిన గుడుంబా, బెల్లంను కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఎస్సైలు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. హన్మకొండలో అయితే ఏకంగా ఒక సీఐ రెండు లారీల బెల్లాన్ని వ్యాపారికి తరలించి సొమ్ముచేసుకున్నాడు. ఇలా శాఖ ఉద్యోగుల్లో పలువురు తప్పులు చేస్తూ ప్రైవేట్ డ్రైవర్లపై ఫిర్యాదు చేయడంతో వీరి బజారున పడే పరిస్థితి నెలకొంది. -
కొత్త వాహనాలకు నేరుగా పర్మనెంట్ నంబరే!
-
కొత్త వాహనాలకు నేరుగా పర్మనెంట్ నంబరే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇకపై మీరు కొనుగోలు చేసే కొత్త వాహనానికి నేరుగా శాశ్వత సంఖ్య(పర్మనెంట్ నంబర్) రానుంది. టెంపరరీ(తాత్కాలిక) నంబర్ ఇచ్చే విధానానికి రవాణా శాఖ స్వస్తి పలకనుంది. ఫిబ్రవరి నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఆయన సోమవారం కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. వాహనానికి నేరుగా పర్మనెంట్ నంబర్‌ను డీలర్ వద్దే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం వాహనాన్ని 10 కోణాల్లో పొటోలు తీసి రవాణా శాఖకు డీలర్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా ఫిబ్రవరి నుంచి 83 రకాల సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి రానున్నాయని వివరించారు. ప్రజలు కేవలం లెర్నింగ్, పర్మనెంట్ లెసైన్స్, ఫిట్నెస్ టెస్టులకు మాత్రమే రవాణా శాఖ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని పేర్కొన్నా రు. వాహన యజమాని మార్పు మొదలైన అన్ని రకాల సేవలను ఆన్లైన్లోనే పొందే వీలుందని చెప్పారు. కంప్యూటర్ ద్వారానే డ్రైవింగ్ టెస్ట్ ఫలితం విజయవాడలో అత్యాధునిక టెస్టింగ్ డ్రైవింగ్ ట్రాక్‌ను సిద్ధం చేశామని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ ట్రాక్‌లో డ్రైవింగ్ తీరు మొత్తాన్ని సీసీ కెమెరాలో బంధిస్తామని... చివరకు టెస్టు పాసయ్యారో, ఫెయిలయ్యారో కంప్యూటర్ ద్వారానే ఫలితం విడుదల చేస్తామని వెల్లడించారు. లెర్నింగ్ లెసైన్స్ కోసం అత్యాధునిక విధానంలో ఏటీఎం మిషన్ల తరహాలో ఉండే కొత్త పరికరాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. మొదట విజయవాడలో ఫిబ్రవరి 1 నుంచి ఈ పరికరాలను ఉపయోగిస్తామన్నారు. అక్కడ విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. జూన్ చివరి నాటికి 40 శాతం పోస్టులు ఖాళీ రవాణా శాఖలో ప్రస్తుతం 33 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఈ ఏడాది జూన్ చివరినాటికి ఇది 40 శాతానికి చేరుకోనుందని బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఖాళీల భర్తీపై త్వరలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందని వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే పబ్లిక్ సర్వీసు కమిషన్ కూడా ఖాళీల వివరాలను కోరిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 8 కొత్త చెక్‌పోస్టులు ఏర్పాటు కావడంతో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని అక్కడకు తరలించాల్సి వచ్చిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,976 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించాల్సి ఉండగా... ఇప్పటికే రూ.1400 కోట్లకుపైగా ఆర్జించామని వివరించారు. -
తెలంగాణ పోలీసులకు కొత్త వాహనాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు నూతన వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని జిల్లాల్లో పోలీసు స్టేషన్లకు సరఫరా చేసేందుకు వీలుగా ప్రభుత్వం 600 టాటా సుమో గోల్డ్ వాహనాలను సిద్ధం చేసింది. వీటిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ప్రారంభించనున్నారు. -
జిల్లాల్లోనూ పోలీసులకు కొత్త వాహనాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లోని పోలీసుస్టేషన్లకు కొత్త వాహనాలను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు కొత్త ఇన్నోవా వాహనాలను, 300కు పైగా ద్విచక్ర వాహనాలను ప్రభుత్వం ఇదివరకే అందజేసిన సంగతి తెలిసిందే. మిగిలిన తొమ్మిది జిల్లాల పోలీసు స్టేషన్లకు సైతం కొత్త వాహనాలను సమకూర్చితే, గస్తీ విస్తృతమై శాంతి భద్రతలు పరిరక్షించడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇన్నోవా వాహనాలు పోలీసుల విధినిర్వహణకు అంతగా తోడ్పడవని వచ్చిన విమర్శలపై దృష్టి సారించిన ప్రభుత్వం జిల్లాలకు టాటాసుమో, బొలేరో వాహనాలను అందచేయాలని యోచిస్తోంది. అలాగే ద్విచక్ర వాహనాలను కూడా గస్తీ కోసం అందజేయనుంది. ఇందులో భాగంగా పూర్తిగా వాహనాలు లేని పోలీసుస్టేషన్లకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై డీజీపీ అనురాగ్‌శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డిలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. రాష్ట్రంలో మొత్తం 680 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్,సైబరాబాద్‌లకు చెందిన పోలీసు స్టేషన్లు పోగా మిగతా వాటికి ప్రాధాన్యక్రమంలో కొత్త వాహనాలను అందచేస్తారని అధికారవర్గాలు తెలిపాయి. -
పారాహుషార్!
జిల్లాపోలీసులకు త్వరలో 150 కొత్త వాహనాలు మన్యంలో కూంబింగ్ ఆపరేషన్లు ఇక ముమ్మరం మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీలో కొత్త పోలీసు వాహనాలు రయ్ రయ్ మంటూ పరుగులు పెట్టనున్నాయి. ఏజెన్సీని జల్లెడ పట్టడమే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాం గానికి ఈ వాహనాలను సమకూరనున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మావోయిస్టుల కదలికలు మళ్లీ ఊపందుకుంటున్నాయన్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ ఆపరేషన్లకు సమాయత్తమవుతున్న పోలీసు శాఖ మౌలిక వసతుల మెరుగుదల, అదనపు హంగులపై దృష్టిసారించింది. అందుకు తొలి అడుగుగా పోలీసు శాఖకు అధునాతన వాహనాలను సమకూర్చనున్నారు. ఏజెన్సీని జల్లెడ పట్టేందుకు పోలీసు శాఖకు ఈ కొత్త వాహనాలను ఇవ్వనున్నారు. ఈమేరకు జిల్లా పోలీసు అధికారుల ప్రతిపాదనకు రాష్ట్ర పోలీసు రవాణా విభాగం ఆమోదం తెలిపింది. సుమోలు ఔట్... బొలేరోలు ఇన్ పోలీసు అధికారులు ఇంతవరకు ఎక్కువగా తెల్లరంగు సుమోలనే వాడుతుండడంతో అవి పోలీసులవని అందరికీ చిరపరిచితమైపోయాయి. దీంతో ఏజెన్సీలో పోలీసులు ఎక్కడ తిరిగినా ఇట్టే తెలిసిపోతోంది. పైగా, ఏజెన్సీ రోడ్లపై తెల్లసుమోలు కావాల్సినంత వేగంగా పరిగెత్తలేకపోతున్నాయి. వీటి స్థానంలో ప్రైవేటు వాహనాల మాదిరిగా నల్లరంగు బొలేరోలు సమకూర్చాలని జిల్లా అధికారులు ప్రతిపాదించారు. వాటితోపాటు అదనపు వాహనాలను ఇవ్వాలని కోరగా ఆమోదం లభించింది. 150 కొత్త వాహనాలు! : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అవసరాల మేరకు జిల్లాకు 150 వరకు కొత్త వాహనాలను సరఫరా చేయనున్నారు. వాటిలో పోలీసు అధికారులు ఉపయోగించేందుకు నల్లరంగు బొలేరో వాహనాలు 40 ఉన్నట్లు భోగట్టా. ప్రధానంగా కూంబింగ్ పార్టీల పర్యవేక్షణ, పోలీసు స్టేషన్ల తనిఖీలు, గస్తీ తదితర కార్యక్రమాల కోసం పోలీసు అధికారులు వీటినే ఉపయోగిస్తారు. ఇవి కాకుండా కొత్తగా 5 మారుతీ డిజైర్ వాహనాలను కేటాయించారు. ఇక కూంబింగ్ ఆపరేషన్ల కోసం ఏజెన్సీకి బలగాల తరలింపుపైనా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. అందుకోసం ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చనున్నారు. కొత్తగా 25 మినీ ట్రక్కులు, 10 బస్సులను ఇవ్వనున్నారు. ఏజెన్సీలో పోలీసుల గస్తీ కోసం కొత్తగా 60 మోటారు బైక్‌లను కేటాయించనున్నారు. పోలీసు సామగ్రి తరలింపు కోసం మరో 5 ఆటో మ్యాక్స్‌లు కూడా జిల్లా పోలీసు శాఖకు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త వాహనాలు వస్తే ఏజెన్సీలో పోలీసింగ్ మరింత పటిష్టమవుతుందని జిల్లా పోలీసులు ఆశిస్తున్నారు.