సుప్రో బ్రాండ్‌తో 7 కొత్త వాహనాలు: మహీంద్రా | Mahindra unveils 7 new vehicles under Supro brand | Sakshi
Sakshi News home page

సుప్రో బ్రాండ్‌తో 7 కొత్త వాహనాలు: మహీంద్రా

Published Fri, Feb 17 2017 1:03 AM | Last Updated on Mon, Oct 8 2018 7:58 PM

సుప్రో బ్రాండ్‌తో 7 కొత్త వాహనాలు: మహీంద్రా - Sakshi

సుప్రో బ్రాండ్‌తో 7 కొత్త వాహనాలు: మహీంద్రా

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన కంపెనీ ‘మహీంద్రా’ తాజాగా తన ‘సుప్రో’ బ్రాండ్‌ కింద ఏడు కొత్త వాహనాలను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటిల్లో నాలుగు వెహికల్స్‌ ప్యాసెంజర్‌ వ్యాన్‌ విభాగానికి, మూడు వెహికల్స్‌ లోడ్‌ కారియర్‌ విభాగానికి చెందినవి ఉన్నాయి. సుప్రో మిని వ్యాన్‌ ప్రారంభ ధర రూ.4.71 లక్షలుగా, సుప్రో మిని ట్రక్‌ ప్రారంభ ధర రూ.4.28 లక్షలుగా ఉంది.

ధరలన్నీ ఎక్స్‌షోరూమ్‌ కోల్‌కతావి. సుప్రో మిని వ్యాన్, సుప్రో మిని వ్యాన్‌ వీఎక్స్, సుప్రో మిని వ్యాన్‌ సీఎన్‌జీ, సుప్రో స్కూల్‌ వ్యాన్‌ అనేవి ప్యాసెంజర్‌ వ్యాన్‌ విభాగంలోని వాహనాలు. ఇక లోడ్‌ కారియర్‌లో సుప్రో మిని ట్రక్, సుప్రో మిని ట్రక్‌ సీఎన్‌జీ, సుప్రో కార్గో వ్యాన్‌ అనే వెహికల్స్‌ ఉన్నాయి. ఈ వాహనాలన్నీ బీఎస్‌–4 నిబంధనలకు అనువుగా తయారయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement