బజాజ్ ఆటో దేశీయ విఫణిలో 'చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ.1.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది టాప్-స్పెక్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా తయారైంది. ఆగష్టు 5నుంచి అమెజాన్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ బ్రూక్లిన్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. అయితే డిజైన్ మాత్రం దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ అలర్ట్, హిల్-హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
చేతక్ 3201 ప్రత్యేక ఎడిషన్.. ప్రీమియమ్ వేరియంట్ మాదిరిగానే అదే 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 136 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 73 కిమీ కావడం గమనించదగ్గ విషయం. మార్కెట్లో ఈ స్కూటర్.. ఏథర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment