రెండు లక్షల మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే! | Bajaj Chetak Electric Scooter Hits New Sales Record Of 2 Lakh Sales, Details Inside | Sakshi
Sakshi News home page

రెండు లక్షల మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!

Published Mon, Jul 22 2024 9:29 PM | Last Updated on Tue, Jul 23 2024 5:38 PM

Bajaj Chetak 2 Lakh Sales Record

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది.  జూన్ 2024లో ఈ స్కూటర్ అమ్మకాలు ఏకంగా 16691 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రారంభంలో కేటీఎమ్ షోరూమ్‌లలో అమ్ముడైన ఈ స్కూటర్.. ఇప్పుడు బజాజ్ డీలర్ నెట్‌వర్క్ ద్వారా అమ్ముడవుతోంది.

ప్రస్తుతం కంపెనీ 600 కంటే ఎక్కువ షోరూమ్‌లను కలిగి ఉంది. ఈ షోరూమ్‌లలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు జరుగుతున్నాయి. 2023 మార్చిలో అమ్మకాలు కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ.. ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి. ప్రారంభంలో మొదటి 15 నెలల్లో 1587 యూనిట్ల అమ్మకాలను పొందిన చేతక్ క్రమంగా వాహన వినియోగదారులు ఆకర్శించడంలో విజయం సాధించింది.

బజాజ్ ఆటో చేతక్ లైనప్ స్టెమ్‌ను రెండు కొత్త వేరియంట్‌లలో విడుదల చేయడంతో స్టెర్న్‌గా మార్చింది. చేతక్ బేస్ 2901, మిడ్-టైర్ అర్బేన్, రేంజ్ టాపింగ్ ప్రీమియం వేరియంట్ రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. డిజైన్ పరంగా అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ ఫీచర్స్, రేంజ్ విషయంలో కొంత తేడా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement