కొత్త రకం వాహనాలు, ఎలా ఉన్నాయో చూడండి | New Quadricycle Vehicle Category Approved By Indian Government | Sakshi
Sakshi News home page

కొత్త రకం వాహనాలు, ఎలా ఉన్నాయో చూడండి

Published Thu, Jun 7 2018 10:34 AM | Last Updated on Thu, Jun 7 2018 10:34 AM

New Quadricycle Vehicle Category Approved By Indian Government - Sakshi

కొత్త రకం చిన్న వాహనాలు-క్వాడ్రిసైకిల్స్‌కు భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. రోడ్డు రవాణా, ప్రధాన రహదారుల మంత్రిత్వ శాఖ వీటిని ఆమోదించింది. నాలుగు చక్రాలు కలిగిన ఈ కొత్త రకం వాహనాలు, పర్సనల్‌ వెహికిల్స్‌గా, కమర్షియల్‌ వెహికిల్స్‌గా వాడుకోవచ్చని తెలిపింది. వీటికి సంబంధించిన ఉద్గారాలు, క్రాష్‌, ఇతర నిబంధనల జాబితాను ప్రభుత్వం, ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా-ఏఆర్‌ఏఐలు కలిసి నిర్దేశించనున్నాయి. ఈ కేటగిరీలో తొలి వాహనం బజాజ్‌ లాంచ్‌ చేయనుంది. బజాజ్‌ క్యూట్‌ పేరుతో దీన్ని మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో ఇలాంటి స్పెషల్‌ కేటగిరీ వాహనాలు లేవు. అయితే ఈ వాహనాలపై ఏ మేర జీఎస్టీ రేటు అమలు చేస్తారో ప్రభుత్వం ఇంకా స్పష్టీకరించలేదు. 

ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఉన్న గ్రీన్‌ ప్లేట్ల మాదిరిగా ఈ వాహనాలకు స్పెషల్‌ రిజిస్ట్రేషన్‌ ప్లేట్లను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ వాహనాలు 475 కేజీల కంటే తక్కువ బరువు ఉన్నాయి. ఇంకా పొడవు, వెడల్పు కొలతల గురించి సరియైన క్లారిటీ లేదు. ఈ కేటగిరీ వాహనాల వివరాలపై త్వరలోనే రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఓ సర్క్యూలర్‌ జారీచేయనుంది. ఈ క్వాడ్రిసైకిల్‌ భారత్‌లో అత్యంత కఠినమైన క్రాష్‌ టెస్ట్‌ ప్రొగ్రామ్‌ను కూడా పాస్‌ కావాల్సి ఉంది. అంతేకాక పెట్రోల్‌, డీజిల్‌, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వాహన ఉద్గారాల టెస్ట్‌లను కూడా ఈ వాహనాలపై నిర్వహించనున్నారు. ఫుల్‌ ఎలక్ట్రిక్‌ లేదా హైబ్రిడ్‌ క్వాడ్రిసైకిల్స్‌కు ఇప్పటికే ప్రభుత్వం అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వాహనాలను భారత రోడ్లపై అనుమతించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత రోడ్లపై క్వాడ్రిసైకిళ్లు సురక్షితమైనవి కావని, ఇవి లోపపూరితమైన డిజైన్‌ను కలిగి ఉన్నావని పలువురంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement