తిరుపతి మంగళం: కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి కాస్త ఊరట లభించింది. ఆరు నెలలుగా రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్డులు(స్మార్ట్ కార్డులు)లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎట్టకేలకు ఆర్టీఏ కార్యాలయాలకు కొంత మేరకు స్మార్ట్‌కార్డులు చేరాయి.
లక్ష కార్డులకు 20 వేలు ఇచ్చారు
జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో సు మారు లక్ష స్మార్ట్ కార్డులు అవసరం ఉంది. అయితే రాష్ట్ర రవాణాశాఖ నుంచి జిల్లాకు 20వేల కార్డులు మాత్రమే వచ్చాయి. అందులో ప్రధానంగా తిరుపతికి 8వేలు కార్డులు,చిత్తూరుకు 7వేలు కార్డులు చొప్పున రవాణాశాఖ కార్యాలయాలకు చేరాయి. మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి, పుత్తూరు వంటి ప్రాంతాలన్నింటికీ కలిపి 5 వేల కార్డులు మాత్రమే చేరాయి. రోజుకు 300 నుంచి 500 కార్డుల మాత్రమే ప్రింటింగ్ అవుతున్నాయి. దీంతో జిల్లాకు వచ్చిన కార్డులను వాహనదారుని పేరుపైన ప్రింట్‌చేసి ఇవ్వడానికే 20 రోజులు పడుతుంది. మిగిలిన కార్డులు జిల్లాకు వచ్చి వాహనదారునికి పూర్తి స్థాయిలో అందించేందుకు రవాణా శాఖకు కనీసం అంటే మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉంది.
రిజిస్ట్రేషన్ చేయించుకున్నా తప్పని జరిమానా
కొనుగోలు చేసిన వాహనాలను రిజిస్ట్రేషన్ చే యించుకున్నా ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ కార్డులు సకా లంలో అందించలేదు. దీంతో పోలీసులు, అధి కారులు హైవేలపై తనిఖీలు నిర్వహించేటప్పు డు ఆర్సీ లేకున్నా రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా విధిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్డుల పంపిణీ జరగకపోవడంలో ఆర్టీఏ నిర్లక్ష్యం ఉన్నప్పటికీ జరిమానాలు తప్పడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. దీనిపై రవాణా శాఖ, పోలీసులు చర్చించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న రసీదులనే ఆర్సీగా పరిగణించాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment